Friday, July 11, 2008

అన్నదమ్ముల అనుబంధం--1975

























సంగీతం::చక్రవర్తి
రచన::దాశరథి
గానం::S.P.బాలు,P.సుశీల



గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే...
ఇలాంటి వేళ ఆడాలి జతగా..
ఇలాగె మనము వుండాలిలే...
మనసు దోచి..మాయజేసీ..
చెలినే మరచిపోవొద్దోయిరాజ..రాజా
గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే...

వసంత రాణి నీకోసమే కుషిగ వచ్చింది
చలాకి నవ్వు చిందించుచు ఉషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారి లాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచీ...మమతపెంచీ
విడిచిపోనని మాటివ్వాలి రాజ..రాజా...

గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే...


మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేనూ..
యుగాలకైనా నాదానవై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే స్మరించుకొంటాను
మనసు నీదే..మమత నీదే..
రేయి పగలు నాలో వున్నది నీవే సోనీ..

గులాబిపువ్వై నవ్వాలి వయసు..
జగాన వలపే నిండాలిలే..
.
ఇలాంటివేళ ఆడాలి జతగా
ఇలాగె మనము వుండాలిలే..
లాలలా..లాలలా..లాలలా..

No comments: