సంగీతం::చళ్ళపళ్ళి సత్యం
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::S.P.బాలు,V.రామకృష్ణ
తారాగణం::N.T.రామారావు, మురళిమోహన్, బాలకృష్ణ,జయమాలిని, కుమారి లత, కాంచన
:::
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఏటేటా మన ఇంటా ఈ పండగే జరగాలీ
ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలీ
ఏటేటా మన ఇంటా ఈ పండగే జరగాలీ
ఈ నిలయం కలకాలం శ్రీనిలయమై నిలవాలీ
వెలుతురైనా..చీకటైనా..విడిపోదు ఈ అనుబంధం
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
తారకలే..దిగివచ్చీ తారంగం ఆడాలీ
వెన్నెలలే..ముంగిటిలో..వేణువులై..పాడాలి
తారకలే..దిగివచ్చీ తారంగం ఆడాలీ
వెన్నెలలే..ముంగిటిలో..వేణువులై..పాడాలి
ఆటలాగా..పాటలాగా..సాగాలి మనజీవితంఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా
ఆనాటి హౄదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
No comments:
Post a Comment