ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల
పంచమి పూట మంచిదని మాటిచ్చాను పొరపాటు
వచ్చేవారం ముచ్చటని రాసిచ్చాను ఎదచాటు
ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది
ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో.......
అయ్యో పాపం మంచోడని చనువిచ్చాను పొరపాటు
ఊపిరి నీవే అన్నానని మనసిచ్చాను గ్రహపాటు
ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ
ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో......
పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు
అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు
కళ్ళల్లోకి చూస్తే..సంకెళ్ళువేసేస్తావు
నీ పైట చాటూకు వస్తే..చాపల్లే చుట్టేస్తావు
కలలోకి రావద్దన్న..వస్తావు రేయంతా
నీ ప్రేమ ముద్దరలన్ని..పూస్తావు వొళ్ళంతా
సరదాలే ఈవేళ..సరిగమలే..పాడాయి
ఆ మాటే అన్నావు చాలింకా..నీ మోజే మళ్ళింది నావంకా
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో......
పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు
అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు
ఎదురుగ వున్నగాని..ఎదలోకి రమ్మన్నానా
ఎగతాళికన్నాగాని..నను దోచుకోమన్నానా
వగలన్ని చూస్తువుంటే..వయసూరుకొంటుందా
కనుసైగ చేస్తువుంటే..వలపాపుకొంటుందా
సరికొత్తా గుబులేదో..గుండెల్లో రేపేవు
ఈ వింతే పులకింత కావాలీ..నీ చెంతే బ్రతుకంత సాగాలీ
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో......
అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు
పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు
ఆ చొరవే నా కొంప ముంచిందీ ఆ మనసే నా దుంప తెంచిందీ
ఆ మాటే నా కొంప ముంచిందీ ఆ రాతే నా దుంప తెంచింది
అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో...అయ్యో.......
పంచమిపూట మంచిదని..మాటిచ్చాను పొరపాటు
అయ్యో పాపం మంచోడని..చనువిచ్చాను పొరపాటు
Wednesday, June 25, 2008
శ్రీరంగ నీతులు--1983
ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం:::చక్రవర్తి
గానం:::SP.బాలు,P.సుశీల
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
దోర దోర వయసులో చందమామా
ఆ తారలేమి చేసావు చందమామా
వావివరస చూసావ చందమామా
నీ వయసునాపుకొన్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీ కెందుకింత మచ్చరం చందమామా
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
వెన్నోల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
నిద్దర్ల్లో వేగముంది వద్దన్న ఆగకుంది పైడిబొమ్మా
పూలబాణాలు వేసుకొందామా ప్రేమ గాయాలు చేసుకొందామా
పూలబాణాలు వేసుకొందామా ప్రేమ గాయాలు చేసుకొందామా
కలిసే వుందామా కరిగే పోదామా హోయ్
చుప్పనాతి చుక్కల్నిదాటుదామా అది చూడలేని చంద్రుణ్ణి తరుముదామా
తొంగి తొంగి చూదమాకు చందమామా
నీ సంగతంత తెలుదుమాకు చందమామా
తొంగి తొంగి చూదమాకు చందమామా
నీ సంగతంత తెలుదుమాకు చందమామా
గుండెల్లో సారముంది గొంత్తుల్లో రాగముంది కలుపుదామా
పొద్దేంతో హాయిగుంది ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా
ముద్దుమురిపంలో ముణిగిపోదమా తీపిగా గాలిలో తేలిపోదమా
ముద్దుమురిపంలో ముణిగిపోదమా తీపిగా గాలిలో తేలిపోదమా
స్వర్గం చూద్దామా సొంతం చేద్దామా హా..
మచ్చరాలు మాననీ మచ్చెమామా
దండం పెట్టి ఇద్దరం కలుసుకోమా
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
దోర దోర వయసులో చందమామా
ఆ తారలేమి చేసావు చందమామా
వావివరస చూసావ చందమామా
నీ వయసునాపుకొన్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీ కెందుకింత మచ్చరం చందమామా
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
Labels:
P.Suseela,
SP.Baalu,
శ్రీరంగ నీతులు--1983
శ్రీరంగ నీతులు--1983
ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల
కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..
నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని
అందాలన్నీ ఒకే..ఒకే..ఒకే..
మాట ఒకే..ఆట ఒకే..
వయసు ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్న
తాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..
నీ కన్న తల్లీ నిను కన్న నాడే
అడిగినావట నన్నే..
తొలిసారి నువ్వు..కను విప్పగానే
వెతికినావట నన్నే..
ఎదిగావు కన్నెవై..పదహారు వన్నెవై
హద్దులేని తుంటరివై..ముద్దులాడు అల్లరివై
వంపుల సొంపుల ఒళ్ళంత వలుపై
తడబడు అడుగుల టక్కరి నడకై
నీకన్న పుడుతున్న మనసైన కష్టలైతే
ఒకే..ఒకే..ఒకే..
కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..
నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన నాపైన నీకున్న
తాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..
నునుసిగ్గు మొగ్గై నువ్ పక్క నేస్తై
విచ్చుకొంటిని నీకై
నినునీవు వయసై నూరేళ్ళ తపస్సై
కాచుకొంటిని నీకై
కొండంత కోరికై గుండెల్లో చోటుకై
చేరినావు నా చెలివై..మారినావు కౌగిలివై
వురకల పరుగుల పరుగై నురుగై
వలపుల మెలకుల వయ్యారి జతవై
నీకళ్ళు నాకళ్ళు నిలువెత్తు అద్దాలైతే
ఒకే..ఒకే..ఒకే.......
మాట ఒకే..ఆట ఒకే..
వయసు ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్న
తాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..
కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..
నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని
అందాలన్నీ ఒకే..ఒకే..ఒకే..
Labels:
P.Suseela,
SP.Baalu,
శ్రీరంగ నీతులు--1983
శ్రీరంగ నీతులు--1983
ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం::చక్రవర్తి
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలూ,P.సుశీల
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా...
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
సిత్తరాలు చూపించాలమ్మా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
సన్నజాజి రమ్మంటుందీ సందె పొద్దు సయ్యంటుందీ.
సన్నజాజి రమ్మంటుందీ సందె పొద్దు సయ్యంటుందీ.
ఆశలన్నీ నువ్వే కన్నయ్యా...
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
చరణం:;1
చూపూ చూపూ చేరాలీపూటా రోజూ మోజూ తీరాలీచోటా
నీలో నేను నిండుగ నిండాలి నీతో నేనూ నీడగ సాగాలి
పాడాలి ముచ్చట్లే పసిడి తలపు తలుపు తెరచి
కొట్టాలి చప్పట్లే మూగ మనసు ఆద మరిచి..
చిందాలి సందళ్ళే చిలిపి చిలిపి వలపు చినుకు
వెయ్యాలి బంధాలే నింగీ నేల నిలుచు వరకు
ఆయోగం నాదీ అనురాగం నీదీ అదే అదే పదే పదే నా గుండె కోరేది
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా
చరనాం::2
పూచే పువ్వు నీలా నవ్విందీ..పోంగే తేనే నాదే నంటుందీ..
పారే వాగు నీలా దూకిందీ రేగే జోరూ నాదే నంటూందీ..
చూడాలి చూపుల్లో గడుసు వయసు సొగసులన్నీ
తీరాలి నవ్వుల్లో దుడుకు మనసు ఛణుకులన్నీ
చూసానూ నీలోనూ కన్నుల ఎరుపు కలల మెరుపు
విన్నాను నీలోను మమత తెలుపు మనసు పిలుపు
ఇంకెందుకంటా ఈ వాదులాట అంతే చాలు అంతే చాలు నా పంట పండిందీ
అందాలమ్మా నువ్వు నాకు చెందాలమ్మా
నిన్ను నేను పొందాలమ్మా నీ మీదొట్టమ్మా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
ఉత్తరాన మబ్బుల్లాగా కొత్తనీటు పొంగుల్లాగా
సిత్తరాలు చూపించాలమ్మా
అందాలయ్యా నువ్వు నాకు చెందాలయ్యా
నిన్ను నేను పొందాలయ్యా నీ మీదొట్టయ్యా
Labels:
P.Suseela,
SP.Baalu,
శ్రీరంగ నీతులు--1983
Saturday, June 14, 2008
నాగమల్లి--1980
సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల
Film Directred By::Devadas Kanakaala
చంద్రమోహన్,దీప,మేనక.
పల్లవి::
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
చరణం::1
ఆషాడ మాసాన...మిల మిల మన్నా
మెరుపే చూసి...నీవను కొన్నా..ఆ ఆ ఆ ఆ ఆ
కార్తీక దీపాన కాంతులలోనా..కళలే చూసి నీవనుకొన్నా
ఆ ఆరు రుతువుల ఆలాపనగా..కనులే తెరచి నే కలలే కన్నా
మా మ్మ మా మ్మ మమ..మా మ్మ మా మ్మ మమ..రిరినిస్సాస్స
కాల మేఘములు..కామ దాహములు..పెరిగినా మధుర గీతం
ససమమమమ రిరిదదదద మమమనీనినీ సాస్సా...
నిను నను కల్పిన నిముషము వలపున యుగయుగాల సంగీతం..
తనువు నీ వేణువే..మనసు నీ రాగమే..మల్లి నీ కోసమే
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
చరణం::2
మధుమాసంలో కుహు కుహు మన్నా
పిలుపేదని నే కబురనుకొన్నా.. ఆ ఆ ఆ ఆ
వైషాఖమాసాన వేసవిలోనా
వడగాలులు నే ఉసురనుకొన్నా
ఇన్నాళ్ళ కన్నీళ్ళ ఆవేదనగా
నను నే మరచీ నీ కౌగిట ఉన్నా
మదమరాళినీ పద నివాళికై తలలువాల్చి తరియించగా
వనమయూరములు నీ వయారములు వగలు నేర్చి నటియించగా
గగనసీమ నీ జఘనమై..చందమామ నీ వదనమై..
సిరులు మువ్వలై..గిరులు నవ్వులై..ఝరులు నడకలై..
అరెరెరెరెరె అల్లన మెల్లన పిల్లన గ్రోవికి
ఆరవ ప్రాణము నీవుగా..ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కదలిరా శిల్పమై..ఆ ఆ ఆ ఆ
సంగీతమై..నాట్యమై..ససస మమమ నినిని రిరిరి
కదలిరా శిల్పమై..సంగీతమై..నాట్యమై
కలసిపో నీవుగా..నేను నీ మేనుగా
నీవే...నేనుగా.......
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మదిలో మెదిలే అనురాగ వల్లీ..
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
మల్లీ మల్లీ..నా నాగ మల్లీ
Nagamalli--1980
Music::Rajan Nagendra
Lyrics::Veturi
Singer's::S.P.Balu,P.Suseela
Film Directred By::Devadas Kanakaala
Cast::Chandramohan,Deepa , Menaka
:::
mallii mallii..naa naaga mallii
mallii mallii..naa naaga mallii
madilO medilE anuraaga vallii..
madilO medilE anuraaga vallii..
mallii mallii..naa naaga mallii
mallii mallii..naa naaga mallii
:::1
aashaaDa maasaana...mila mila mannaa
merupE chUsi...neevanu konnaa..aa aa aa aa aa
kaarteeka deepaana kaantulalOnaa..kaLalE chUsi neevanukonnaa
aa aaru rutuvula aalaapanagaa..kanulE terachi nE kalalE kannaa
maa mma maa mma mama..maa mma maa mma mama..ririnissaassa
kaala mEghamulu..kaama daahamulu..periginaa madhura geetam
sasamamamama riridadadada mamamaniininii saassaa...
ninu nanu kalpina nimushamu valapuna yugayugaala sangeetam..
tanuvu nee vENuvE..manasu nee raagamE..malli nee kOsamE
mallii mallii..naa naaga mallii
mallii mallii..naa naaga mallii
madilO medilE anuraaga vallii..
madilO medilE anuraaga vallii..
mallii mallii..naa naaga mallii
mallii mallii..naa naaga mallii
:::2
madhumaasamlO kuhu kuhu mannaa
pilupEdani nE kaburanukonnaa..aa aa aa aa
vaishaakhamaasaana vEsavilOnaa
vaDagaalulu nE usuranukonnaa
innaaLLa kanniiLLa aavEdanagaa
nanu nE marachii nee kougiTa unnaa
madamaraaLinii pada nivaaLikai talaluvaalchi tariyinchagaa
vanamayUramulu nee vayaaramulu vagalu nErchi naTiyinchagaa
gaganaseema nee jaghanamai..chandamaama nee vadanamai
sirulu muvvalai..girulu navvulai..jharulu naDakalai
arerererere allana mellana pillana grOviki
aarava praaNamu neevugaa..aa aa aa aa aa aa aa aa
kadaliraa Silpamai..aa aa aa aa
sangeetamai..naaTyamai..sasasa mamama ninini ririri
kadaliraa Silpamai..sangeetamai..naaTyamai
kalasipO neevugaa..nEnu nee mEnugaa
neevE...nEnugaa
mallii mallii..naa naaga mallii
mallii mallii..naa naaga mallii
madilO medilE anuraaga vallii
madilO medilE anuraaga vallii
mallii mallii..naa naaga mallii
mallii mallii..naa naaga mallii
నాగమల్లి--1980
సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు, P.సుశీల
పల్లవి::
రాగం తీసే కోయిలా..కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా..రగిలే ఎండలా
బాసలెన్నో చేసుకొన్న..ఆశే మాయెగా
బాసలెన్నో చేసుకొన్న..ఆశే మాయెగా
పిలవని పిలుపుగా..రాకే నీవిలా
రాగం తీసే కోయిలా..కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా..రగిలే ఎండలా
చరణం::1
జంటని ఎడబాసినా..ఒంటరి నా బ్రతుకునా
మల్లెల సిరివెన్నెల..మంటలు రేపగా
వయసుల నులి వెచ్చని..వలపుల మనసిచ్చిన
నా చెలి చలి వేణువై..వేదనలూదగా
తొలకరి పాటలే..తోటలో పాడకే..పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా..కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా..రగిలే ఎండలా
చరణం::2
పగిలిన నా హృదయమే..రగిలేనే ఒక రాగమై
అడవిలో వినిపించిన..ఆమని పా5టగా
అందమే నా నేరమా..పరువమే నా పాపమా?
ఆదుకోమని చెప్పవే..ఆఖరి మాటగా
గుండెలో మురళిని..గొంతులో ఊదకే..పదే పదే పదే పదాలుగా
రాగం తీసే కోయిలా..కోయకు గుండెలు తీయగా
రాతిరి వేళలా..రగిలే ఎండలా
Nagamalli--1980
Music::Rajan Nagendra
Lyrics::Veturi
Singer's::S.P.Balu,P.Suseela
Cast::Chandramohan,Deepa , Menaka
:::
raagam teesE kOyilaa..kOyaku gunDelu teeyagaa
raatiri vELalaa..ragilE enDalaa
baasalennO chEsukonna..aaSE maayegaa
baasalennO chEsukonna..aaSE maayegaa
pilavani pilupugaa..raakE neevilaa
raagam teesE kOyilaa..kOyaku gunDelu teeyagaa
raatiri vELalaa..ragilE enDalaa
:::1
janTani eDabaasinaa..onTari naa bratukunaa
mallela sirivennela..manTalu rEpagaa
vayasula nuli vechchani..valapula manasichchina
naa cheli chali vENuvai..vEdanalUdagaa
tolakari paaTalE..tOTalO paaDakE..padE padE padE padaalugaa
raagam teesE kOyilaa..kOyaku gunDelu teeyagaa
raatiri vELalaa..ragilE enDalaa
:::2
pagilina naa hRdayamE..ragilEnE oka raagamai
aDavilO vinipinchina..aamani paa5Tagaa
andamE naa nEramaa..paruvamE naa paapamaa?
aadukOmani cheppavE..aakhari maaTagaa
gunDelO muraLini..gontulO UdakE..padE padE padE padaalugaa
raagam teesE kOyilaa..kOyaku gunDelu teeyagaa
raatiri vELalaa..ragilE enDalaa
Labels:
P.Suseela,
SP.Baalu,
నాగమల్లి--1980
నాగమల్లి--1980
సంగీతం::రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు
పల్లవి::
నిదురోయే నదులన్ని
నిదురోయే నదులన్ని..కదలని అలజడిలో
సందె గాలులే..సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
ఝుమ్మని పాడుతు తుమ్మెదలాడగా
గువ్వలు రివ్వున గుసగుసలాడగా
సందె గాలులే..సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
చరణం::1
పాటలలోన..సిరి పైటలలోన
కురిసిన అందం కుసుమప రాగం..విరిసే వేళా
లాలనగా ఆలాపనగా..ప్రాణం వేణువు ఊదేనులే
సందె గాలులే..సన్నాయి పాట పాడాలి
ఆ పాట విన్న నాగమల్లి తోట నవ్వాలి
చరణం::2
కోనలలోన జడివానలలోన
జలతరంగం అలల మృదంగం..పలికే వేళా
వేణువులోని అదరేణువు లెన్నో..
విన్న మయూరం విడుపు వయ్యారం..చిలికే వేళా
గాలుల ఈలల వేళలో
నా ఎద వెల్లువలాయెనులే
లాల్ల.....లాలా..లాల్ల..లాల..
Nagamalli--1980
Music::Rajan Nagendra
Lyrics::Veturi
Singer's::S.P.Balu
Cast::Chandramohan,Deepa , Menaka
:::
nidurOyE nadulanni
nidurOyE nadulanni..kadalani alajaDilO
sande gaalulE..sannaayi paaTa paaDaali
aa paaTa vinna naagamalli tOTa navvaali
jhummani paaDutu tummedalaaDagaa
guvvalu rivvuna gusagusalaaDagaa
sande gaalulE..sannaayi paaTa paaDaali
aa paaTa vinna naagamalli tOTa navvaali
:::1
paaTalalOna..siri paiTalalOna
kurisina andam kusumapa raagam..virisE vELaa
laalanagaa aalaapanagaa..praaNam vENuvu UdEnulE
sande gaalulE..sannaayi paaTa paaDaali
aa paaTa vinna naagamalli tOTa navvaali
:::2
kOnalalOna jaDivaanalalOna
jalatarangam alala mRdangam..palikE vELaa
vENuvulOni adarENuvu lennO..
vinna mayUram viDupu vayyaaram..chilikE vELaa
gaalula iilala vELalO
naa eda velluvalaayenulE
laalla.....laalaa..laalla..laala..
Labels:
SP.Baalu,
నాగమల్లి--1980
నాగమల్లి--1980
సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,p.సుశీల
పల్లవి::
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారీ
నవ్వులో యవ్వనం .. పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి..నవ్వవె చంద్ర చకోరీ
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారీ
రాకతో జీవనం..రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి..ముద్దుల మోహన మురళీ
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
చరణం::1
మిన్నల్లే పాడు..జాణల్లే ఆడు..
రసధునివై నీవు నాలోనా..ఊగాలీ రాగడోలా
నీలో నాదాలు..ఎన్నో విన్నాను..
పరువపు వేణువు లీవేళా..నువ్వే నా రాసలీలా
మేను వేణువై నిను వరించగా..అలిగిన అందెల సందడిలో
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం..రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి..ముద్దుల మోహన మురళీ
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
చరణం::2
నువ్వే నా ఈడు..నవ్వే నా తోడు..
కలిసిన కాపురమీవేళా..కావాలీ నవ్య హేలా
నీలో అందాలు..ఎన్నో గ్రంధాలు..
చదివిన వాడను ఈ వేళా .. నువ్వే నా కావ్యమాలా..
పువ్వు పువ్వునా పులకరింతలే విరిసెను మన చిరునవ్వులలో
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
ఓ .. నవ్వులో యవ్వనం .. పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి..నవ్వవె చంద్ర చకోరీ
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ..నీదే రాజకుమారీ
నీవే రాజకుమారీ..నీదే రాజకుమారీ
Labels:
P.Suseela,
SP.Baalu,
నాగమల్లి--1980
నాలాగా ఎందరో--1978
సంగీతం M.S.విశ్వనాధన్
రచన::ఆత్రేయ
గానం::S.P.బాలు,p.సుశీల
పల్లవి::
కళ్యాణిని...కళ్యాణిని
కనులున్న మనసుకు కనిపించు రూపాన్ని
మనసున్న చెవులకు వినిపించు రాగాన్ని
చరణం::1
నీ ఆశల కుంచెలతో ... అనురాగాల రంగులతో
ఊహించుకో .. నను చిత్రించుకో .. ఎదలోన పదిలంగా నను దాచుకో ..కళ్యాణిని !!
చందమామ మోము.. ఆ ..ఆ
చారడేసి కళ్ళు ..ఆ..ఆ
దొండపండు పెదవి ...పండు నిమ్మ పసిమి ..ఆ..ఆ
కడలి అలల కురులు .... కానరాని నడుము
కన్నె సొగసులని కవులన్నారు అవి అన్నో కొన్నో ఉన్నదానను .....కళ్యాణిని..... !!!
చరణం::2
" చందమామ మోము.. చారడేసి కళ్ళు ..ఉహూ..దొండపండు పెదవి ..పండు నిమ్మ పసిమి "
చల్లదనం పేరే .. ఆ..ఆ .. చందమామ కాదా
చారడేసి కళ్ళే .. ఆ..ఆ .. శాంతి ఝల్లు కాదా
పిలుపులోని వలపే .. పెదవి ఎరుపు కాదా
కనుగొన్నాను శిలగాని శిల్పాన్ని ...కవులైన కనరాని కళ్యానిని .. కళ్యాణిని !!!
Labels:
P.Suseela,
SP.Baalu,
నాలాగా ఎందరో--1978
Saturday, June 07, 2008
ముద్దుల కొడుకు--1979
సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,మురళీమోహన్,జయసుధ,శ్రీదేవి,గిరిజ,జయమాలిని
పల్లవి::
ఇంతే సంగతులు..చిత్తగించవలెను..అహాహాహా
ఏయ్..ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవా
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆహా..ఆ
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవా
చరణం::1
పూనకాల స్వామికి..పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి..వందనాలు చెయ్యరా
పూనకాల స్వామికి..పానకాలు పొయ్యరా
తందనాల స్వామికి..వందనాలు చెయ్యరా
వినోదానికి ఇది విందురా..మనోవ్యాధికి ఇదే మందురా..ఆహాహా
వినోదానికి ఇది విందురా..మనోవ్యాధికి ఇదే మందురా
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవా
చరణం::2
తప్పతాగినోడే..దానకర్ణుడు..తాగి కుప్పకూలినోడే..కుంభకర్ణుడు
తప్పతాగినోడే..దానకర్ణుడు..తాగి కుప్పకూలినోడే..కుంభకర్ణుడు
చెప్పకు తిప్పలు మహదేవా..చేతికి చిప్పరా గురుదేవా..ఆహాహా..ఆ
చెప్పకు తిప్పలు మహదేవా..చేతికి చిప్పరా గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
చరణం::3
కులాసాలు మితి మీరాయంటే..కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శృతిమించాయంటే..శివమెత్తిన శివతాండవాలు
కులాసాలు మితి మీరాయంటే..కురుక్షేత్ర రణరంగాలు
విలాసాలు శృతిమించాయంటే..శివమెత్తిన శివతాండవాలు
శంభో శంకర మహదేవా..సాంబసదా శివ గురుదేవా
శంభో శంకర మహదేవా..సాంబసదా శివ గురుదేవా
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
గుటకలేసి గంతులేయ్ గురుదేవా..ఆ ఆ
చిటికేసి చిందులేయ్ మహాదేవా..ఆ..హా..ఆ
ఒక్కసారి మందుకొట్టు మహదేవా
నిన్నొదలి పెడితే..ఒట్టు పెట్టు గురుదేవోయ్..గురుదేవా
ఇంతే సంగతులు..చిత్తగించవలెను
Muddula Koduku--1979
Music::K.V.Mahadevan
Lyrics::Veturi Sundararamamoorti
Singer's::S.P.Balu,P.Suseela
Cast::Akkineni,Sridevi,Jayasudha,Muralimohan,Girija,Jayamaalini.
:::
intE sangatulu..chittaginchavalenu..ahaahaahaa
Ey..okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvaa
okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvaa
guTakalEsi gantulEy gurudEvaa..aa aa aa aa
chiTikEsi chindulEy mahaadEvaa..aahaa..aa
guTakalEsi gantulEy gurudEvaa..aa aa
chiTikEsi chindulEy mahaadEvaa..
okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvaa
:::1
poonakaala swaamiki..paanakaalu poyyaraa
tandanaala swaamiki..vandanaalu cheyyaraa
poonakaala swaamiki..paanakaalu poyyaraa
tandanaala swaamiki..vandanaalu cheyyaraa
vinOdaaniki idi vinduraa..manOvyaadhiki idE manduraa..aahaahaa
vinOdaaniki idi vinduraa..manOvyaadhiki idE manduraa
okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvaa
:::2
tappataaginODE..daanakarNuDu..taagi kuppakoolinODE..kumbhakarNuDu
tappataaginODE..daanakarNuDu..taagi kuppakoolinODE..kumbhakarNuDu
cheppaku tippalu mahadEvaa..chEtiki chipparaa gurudEvaa..aahaahaa..aa
cheppaku tippalu mahadEvaa..chEtiki chipparaa gurudEvaa
guTakalEsi gantulEy gurudEvaa..aa aa
chiTikEsi chindulEy mahaadEvaa..aa..haa..aa
okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvOy..gurudEvaa
:::3
kulaasaalu miti meeraayanTE..kurukshEtra raNarangaalu
vilaasaalu SRtiminchaayanTE..Sivamettina SivataanDavaalu
kulaasaalu miti meeraayanTE..kurukshEtra raNarangaalu
vilaasaalu SRtiminchaayanTE..Sivamettina SivataanDavaalu
SambhO Sankara mahadEvaa..saambasadaa Siva gurudEvaa
SambhO Sankara mahadEvaa..saambasadaa Siva gurudEvaa
okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvOy..gurudEvaa
guTakalEsi gantulEy gurudEvaa..aa aa
chiTikEsi chindulEy mahaadEvaa..aa..haa..aa
okkasaari mandukoTTu mahadEvaa
ninnodali peDitE..oTTu peTTu gurudEvOy..gurudEvaa
intE sangatulu..chittaginchavalenu
Sunday, June 01, 2008
ముద్దుల కొడుకు--1979
సంగీతం::K.V.మహదేవన్
రచన::వేటూరి సుందరరామమూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
తారాగణం::అక్కినేని,మురళీమోహన్,జయసుధ,శ్రీదేవి,గిరిజ,జయమాలిని
పల్లవి::
దగాలుచేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
దగాలుచేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా..చిన్నోడా..ఆ..దసరాబుల్లోడా
చరణం::1
మనసునే కదిలించావు..మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు..ప్రేమకై జీవించావు
మనసునే కదిలించావు..మమతలే వెలిగించావు
మనిషిలా ప్రేమించావు..ప్రేమకై జీవించావు
ఆరాధనే మరచీ..ఈ..అంతస్తులే వలచీ..ఈ
ఆరాధనే మరచీ..అంతస్తులే వలచీ ఆస్తిపరుల
ముద్దులకొడుకై..ఆదమరచి ఉన్నావా? ఆత్మబలం విడిచావా?
లేదు..లేదు..మరచిపోలేదు..Never
చిన్నోడా..దసరబుల్లోడా..చిన్నోడా..దసరబుల్లోడా
దగాలుచేసి దిగాలుపడ్డ దసరాబుల్లోడా
సవాలు చేస్తా జవాబు చెప్పర సరదా చిన్నోడా
చరణం::2
బంగారుబాబుల ఆట..బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే..అల్లరిచిల్లరి వేలంపాట
బంగారుబాబుల ఆట..బంగారుబొమ్మల వేట
అదృష్టవంతులు పాడే..అల్లరిచిల్లరి వేలంపాట
నీ ఆటపాటలలో..ఓ..నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
నీ ఆటపాటలలో..ఓ..నీ ఆడుగుజాడలలో..ఓఓఓ
అందాల జాబిలి బ్రతుకే..అమావాస్య చేసావా సమాధి కట్టేసావా
నేను సమాధి కట్టానా..NO..NO
ఉన్న మాటకే ఉలికిపడి..లేని మనసునే
తడుముకునే..మోసగాడు ఒక మనిషేనా..ఆ
ఏమిటి..ఏవర్ని గురించి నువ్వనేది?
నిప్పులాంటిది నీ గతం..తప్పతాగినా ఆరదు
ఎంత దాచినా దాగదు..నిన్ను దహించక తప్పదు
Stop it
తప్పదు
Stop it
తప్పదు
Stop it
తప్పదు
I Say Stop it
Muddula Koduku--1979
Music::K.V.Mahadevan
Lyrics::Veturi Sundararamamoorti
Singer's::S.P.Balu,P.Suseela
Cast::Akkineni,Sridevi,Jayasudha,Muralimohan,Girija,Jayamaalini.
:::
dagaaluchEsi digaalupaDDa dasaraabullODaa
savaalu chEstaa javaabu cheppara saradaa chinnODaa
dagaaluchEsi digaalupaDDa dasaraabullODaa
savaalu chEstaa javaabu cheppara saradaa chinnODaa
chinnODaa..aa..dasaraabullODaa..chinnODaa..aa..dasaraabullODaa
:::1
manasunE kadilinchaavu..mamatalE veliginchaavu
manishilaa prEminchaavu..prEmakai jeevinchaavu
manasunE kadilinchaavu..mamatalE veliginchaavu
manishilaa prEminchaavu..prEmakai jeevinchaavu
AraadhanE marachii..ii..antastulE valachii..ii
AraadhanE marachii..antastulE valachii Astiparula
muddulakoDukai..Adamarachi unnaavaa? Atmabalam viDichaavaa?
lEdu..lEdu..marachipOlEdu..Never
chinnODaa..dasarabullODaa..chinnODaa..dasarabullODaa
dagaaluchEsi digaalupaDDa dasaraabullODaa
savaalu chEstaa javaabu cheppara saradaa chinnODaa
::::2
bangaarubaabula ATa..bangaarubommala vETa
adRshTavantulu paaDE..allarichillari vElampaaTa
bangaarubaabula ATa..bangaarubommala vETa
adRshTavantulu paaDE..allarichillari vElampaaTa
nee ATapaaTalalO..O..nee ADugujaaDalalO..OOO
nee ATapaaTalalO..O..nee ADugujaaDalalO..OOO
andaala jaabili bratukE..amaavaasya chEsaavaa samaadhi kaTTEsaavaa
nEnu samaadhi kaTTaanaa..NO..NO
unna maaTakE ulikipaDi..lEni manasunE
taDumukunE..mOsagaaDu oka manishEnaa..aa
EmiTi..Evarni gurinchi nuvvanEdi?
nippulaanTidi nee gatam..tappataaginaa Aradu
enta daachinaa daagadu..ninnu dahinchaka tappadu
Stop it
tappadu
Stop it
tappadu
Stop it
tappadu
I Say Stop it
Subscribe to:
Posts (Atom)