సంగీతం : రాజన్-నాగేంద్ర
రచన::వేటూరి
గానం::S.P.బాలు,p.సుశీల
పల్లవి::
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారీ
నవ్వులో యవ్వనం .. పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి..నవ్వవె చంద్ర చకోరీ
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారీ
రాకతో జీవనం..రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి..ముద్దుల మోహన మురళీ
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
చరణం::1
మిన్నల్లే పాడు..జాణల్లే ఆడు..
రసధునివై నీవు నాలోనా..ఊగాలీ రాగడోలా
నీలో నాదాలు..ఎన్నో విన్నాను..
పరువపు వేణువు లీవేళా..నువ్వే నా రాసలీలా
మేను వేణువై నిను వరించగా..అలిగిన అందెల సందడిలో
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం..రాగమై పలుకగా
ఏదీ ఇంకొకసారి..ముద్దుల మోహన మురళీ
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
చరణం::2
నువ్వే నా ఈడు..నవ్వే నా తోడు..
కలిసిన కాపురమీవేళా..కావాలీ నవ్య హేలా
నీలో అందాలు..ఎన్నో గ్రంధాలు..
చదివిన వాడను ఈ వేళా .. నువ్వే నా కావ్యమాలా..
పువ్వు పువ్వునా పులకరింతలే విరిసెను మన చిరునవ్వులలో
నాగమల్లివో..తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
ఓ .. నవ్వులో యవ్వనం .. పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి..నవ్వవె చంద్ర చకోరీ
నాగమల్లినో..తీగమల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ..నీదే రాజకుమారీ
నీవే రాజకుమారీ..నీదే రాజకుమారీ
No comments:
Post a Comment