Wednesday, June 25, 2008

శ్రీరంగ నీతులు--1983



ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం:::చక్రవర్తి
రచన:::ఆత్రేయ ఆచార్య
గానం:::SP.బాలు,P.సుశీల


తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
దోర దోర వయసులో చందమామా
ఆ తారలేమి చేసావు చందమామా
వావివరస చూసావ చందమామా
నీ వయసునాపుకొన్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీ కెందుకింత మచ్చరం చందమామా

తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా

వెన్నోల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
నిద్దర్ల్లో వేగముంది వద్దన్న ఆగకుంది పైడిబొమ్మా
పూలబాణాలు వేసుకొందామా ప్రేమ గాయాలు చేసుకొందామా
పూలబాణాలు వేసుకొందామా ప్రేమ గాయాలు చేసుకొందామా
కలిసే వుందామా కరిగే పోదామా హోయ్
చుప్పనాతి చుక్కల్నిదాటుదామా అది చూడలేని చంద్రుణ్ణి తరుముదామా

తొంగి తొంగి చూదమాకు చందమామా
నీ సంగతంత తెలుదుమాకు చందమామా
తొంగి తొంగి చూదమాకు చందమామా
నీ సంగతంత తెలుదుమాకు చందమామా

గుండెల్లో సారముంది గొంత్తుల్లో రాగముంది కలుపుదామా
పొద్దేంతో హాయిగుంది ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా
ముద్దుమురిపంలో ముణిగిపోదమా తీపిగా గాలిలో తేలిపోదమా
ముద్దుమురిపంలో ముణిగిపోదమా తీపిగా గాలిలో తేలిపోదమా
స్వర్గం చూద్దామా సొంతం చేద్దామా హా..
మచ్చరాలు మాననీ మచ్చెమామా
దండం పెట్టి ఇద్దరం కలుసుకోమా

తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
దోర దోర వయసులో చందమామా
ఆ తారలేమి చేసావు చందమామా
వావివరస చూసావ చందమామా
నీ వయసునాపుకొన్నావ చందమామా
అంత మచ్చ పెట్టుకొని చందమామా
నీ కెందుకింత మచ్చరం చందమామా

తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా
తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసుమాకు చందమామా

No comments: