Wednesday, June 25, 2008

శ్రీరంగ నీతులు--1983



ఈ పాట వినాలని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి

సంగీతం::చక్రవర్తి
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::SP.బాలు,P.సుశీల


కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..
నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని
అందాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

మాట ఒకే..ఆట ఒకే..
వయసు ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్న
తాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

నీ కన్న తల్లీ నిను కన్న నాడే
అడిగినావట నన్నే..
తొలిసారి నువ్వు..కను విప్పగానే
వెతికినావట నన్నే..
ఎదిగావు కన్నెవై..పదహారు వన్నెవై
హద్దులేని తుంటరివై..ముద్దులాడు అల్లరివై
వంపుల సొంపుల ఒళ్ళంత వలుపై
తడబడు అడుగుల టక్కరి నడకై
నీకన్న పుడుతున్న మనసైన కష్టలైతే
ఒకే..ఒకే..ఒకే..
కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..
నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన నాపైన నీకున్న
తాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

నునుసిగ్గు మొగ్గై నువ్ పక్క నేస్తై
విచ్చుకొంటిని నీకై
నినునీవు వయసై నూరేళ్ళ తపస్సై
కాచుకొంటిని నీకై
కొండంత కోరికై గుండెల్లో చోటుకై
చేరినావు నా చెలివై..మారినావు కౌగిలివై
వురకల పరుగుల పరుగై నురుగై
వలపుల మెలకుల వయ్యారి జతవై
నీకళ్ళు నాకళ్ళు నిలువెత్తు అద్దాలైతే
ఒకే..ఒకే..ఒకే.......

మాట ఒకే..ఆట ఒకే..
వయసు ఒకే..మనసు ఒకే..
ఆపైన నాపైన నీకున్న
తాపాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

కళ్ళు ఒకే...పళ్ళు ఒకే..
నడుము ఒకే...నడక ఒకే..
ఆపైన వర్ణించ వీల్లేని
అందాలన్నీ ఒకే..ఒకే..ఒకే..

No comments: