Sunday, September 30, 2007

కోడలు దిద్దిన కాపురం--1970 రాగం::సింధుబైరవి


సంగీతం:T.V.రాజు
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం:Pసుశీల

తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ, జగ్గయ్య,సావిత్రి,రేలంగి,సూర్యకాంతం 

రాగం::సింధుబైరవి!!

నీ ధర్మం నీ సంఘం
నీదేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన
మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

1)సత్యంకోసం సతినే అమ్మిన దెవరూ ?
" హరిశ్చంద్రుడు "
2)తండ్రిమాటకై కానలకేగిన దెవరూ ?
" శ్రీరామచంద్రుడు "
3)అన్నసేవకై అంకితమైనది ఎవరన్నా ?
" లక్ష్మన్న "
4)పతిఏదైవమని తపించిపోయిన దెవరమ్మా ?
" సీతమ్మా "
ఆ పుణ్యమూర్తులు చూపిన మార్గం
అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం

!!నీ ధర్మం నీసంగం !!

చేపకూటితో సమతను నేర్పిన
నాటి పలనాటి " బ్రహ్మన్న "
మేడిపండులా మెరిసే సంఘం
గుట్టువిప్పెను " వేమన్నా "
వితంతువుల విధి వ్రాతలు మార్చి
బ్రతుకును పండించే " కందుకూరి "
తెలుగు భారతిని ప్రజల భాషలో
తీరిచి దిద్దెను " గురుజాడా "
ఆ సంస్కర్తల ఆశయరంగం
నీవు నిలిచిన సంఘం
నీవునిలిచిన ఈ సంఘం

!! నీ ధర్మం నీ సంఘం !!

స్వతంత్ర భారత రథసారధియై
సమరాన ధూకే " నేతాజి "సత్యగ్రహమే సాధనమ్ముగా
స్వరాజ్యమే
తెచ్చె " బాపూజీ "
గుండె కెదురుగా గుండె నిలిపెను
" ఆంద్రకేసరి టంగుటూరి "తెలుగువారికొక రాష్రం కోరి
ఆహుతి ఆయెను " అమరజీవి "
ఆ దేశభక్తులు వెలసిన దేశం
నీవు పుట్టిన భారత దేశం
నీవు పుట్టిన భారత దేశం
!! నీ ధర్మం నీ సంఘం !!

No comments: