సంగీతం::పెండ్యాల
రచన::సముద్రాల
గానం::జిక్కి
సింధుభైరవి::రాగం
రావోయి మా యింటికి
రావోయి మా ఇంటికి మావా
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది
నిలుసుంటె నిమ్మచెట్టు నీడున్నది
నువు కూసుంటే కుర్చీల పీటున్నది
నువ్వు తొంగోంటే పట్టెమంచం పరుపున్నది
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది
ఆకలేస్తే సన్నబియ్యం కూడున్నది
అందులోకి అరకోడి కూరున్నది
ఆపైన రొయ్యపొట్టు చారున్నదీ
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది
రంజైన మీగడ పెరుగున్నది
నంజుకోను ఆవకాయ ముక్కున్నది
నీకు రోగమొస్తే ఘాటైన మందున్నదీ
మాటున్నది మంచి మాటున్నది
రావోయి మా ఇంటికి..మావోయ్
మాటున్నది మంచి మాటున్నది
No comments:
Post a Comment