Friday, September 21, 2007

ఆత్మీయులు--1969

సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::ఘంటసాల,P.సుశీల

ఆమె::అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను
బంగారుకాంతులేవో నేడే తొంగి చూసెను అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను

ఆమె::తోడునీడ నీవై లాలించే అన్నయా
తోడునీడ నీవై లాలించే అన్నయా
తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్యా
నీ కన్న వేరే పెన్నిధి లేనే లేదు
నా పూర్వపుణ్యాల రూపమే నీవు
అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను

అతడు::రతనాల సుగుణాల రాణివినీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
రతనాల సుగుణాల రాణివినీవే
అన్నయ్య నయనాల ఆశవు నీవే
నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు
నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్లు

ఆమె::అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను
బంగారుకాంతులేవో నేడే తొంగి చూసెను అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను

ఆమె::మా అన్నయ్య మనసె సిరిమల్లె పూవ్వెను
మా అన్నయ్య మనసె సిరిమల్లె పూవ్వెను
చెల్లి కంట తడివుంటే తల్లడిల్లేను

అతడు::నీ పూజలే నన్ను నడిపించు తల్లి
శతకోటి విజయాలు సాధించు చెల్లి

అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను
బంగారుకాంతులేవో నేడే తొంగి చూసెను అన్నయ్యకలలే పండెను చెల్లాయిమనసే నిండెను

No comments: