Friday, September 21, 2007

ఆత్మీయులు--1969


సంగీతం::శ్రీరాజేశ్వర రావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీల


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే

నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో
పెదవిపై కదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే


సన్నాయి చల్లగ మ్రోగి సన్నీటి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగ మ్రోగి సన్నీటి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాడి
కడుతూంటే జీవితాన పూలవాన


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే


వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే
భావియే నందన వనమైతే
జీవితాన పూలవాన


కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే మహూర్తం మదిలో కదలాడే

No comments: