సంగీతం::K.V.మహదేవన్ రచన::Dr.C.నారాయణ రెడ్డి గానం::P.సుశీల.S.P.బాలు తారాగణం:: N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని ::::::: కృష్ణా ………! నీ పేరు తలచినా చాలు..నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు చరణం::1 ఏమి మురళి అది ఏమి రవళిరా ఏమి మురళి అది ఏమి రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా ఏమి మురళి అది ఏమీ రవళిరా పాట వినగ ప్రాణాలు కదలురా మురళీధరా నీ స్వరలహరులలో మరణమైనా మధురమురా నీ పేరు తలచినా చాలు చరణం::2 వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనా వెదురు పొదలలో తిరిగీ తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనా ఎదపానుపుపై పవళించరా నా పొదిగిన కౌగిట పులకించరా నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు నీ పేరు తలచినా చాలు గోపాలా..!నందబాలా! నవమంజుల మురళీలోలా! మృదు సమీర సంచిత మనోజ్ఞ కుంతల నమాల పల్లవ జాలా కృష్ణా..!నీ పేరు తలచినా చాలు చరణం::3 ఏమి పిలుపు అది ఏమి పిలుపు బృందానికుంజముల పూలు పూచి శరబిందుచంద్రికల చేయిచాచి తరుణాంతరంగమున దాగిదాగి చెలి అందెలందు చెలరేగి రేగి నను తొందరించెరా..తొలకరించెరా తొందరించెరా తొలకరించెరా వలపు జల్లుగా పలుకరించెరా చల్లని రమణి చల్లని ఉల్లము అల్లన ఝల్లన పరవశించెరా… కృష్ణా..నీ పేరు తలచినా చాలు…
సంగీతం::K.V.మహాదేవన్ రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి గానం::P.సుశీల, బృందం తారాగణం::N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని :::::::
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి
ఆమ్మచెల్ల తెలిసేది ఎన్నెలాడి వగలు
ఎన్నదిలో దాచాలని కమ్మని కోరికలు
వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలో
వాలుకన్ను రెప్పలలో వాలాడే తొందరలో
దోరపెదవి అంచుల చిరునవ్వుల దోబూచులు
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి ఔనే చెలియ సరి సరి
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి
ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు
ఈ చెక్కిటిపై పూచే ఈ గులాబి నిగ్గులు
ఏ చోట దాచేవే ఈవరకి సిగ్గులు
ఈ చెక్కిటిపై ఈ గులాబి నిగ్గులు
మాపటి బిడియాలన్ని రేపటికి వుండవులే
మాపటి బిడియాలన్ని రేపటికి వుండవులే
నేటి సోయగాలు మరునాటికి ఒడిలేనులే
ఔనే చెలియ సరి సరి
ఆ హంసల నడకలిప్పుడా సొగసరి
ఔనే చెలియ సరి సరి
సంగీతం::K.V.మహాదేవన్ రచన::దేవులపల్లి క్రిష్ణ శాస్త్రి గానం::ఘంటసాల,S.P.బాలు తారాగణం::N.T.రామారావు, జమున, కాంతారావు, K.R. విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని :::
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
బ్రతుకంతా ప్రతి నిముషం పాట లాగ సాగాలి
ప్రతి నిముషం ప్రియా ప్రియా పాట లాగ సాగాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
నీలో నా పాట కదలి నాలో నీ అందె మెదలి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
లోలోన మల్లె పొదలా పూలెన్నో విరిసి విరిసి
మనకోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి
మనకోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైరగాలి
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చరణం::1
నవ్వులా అవికావు..నవపారిజాతాలు
నవ్వులా అవికావు..నవపారిజాతాలు
రవ్వంత సడిలేని..రసరమ్య గీతాలు
రవ్వంత సడిలేని..రసరమ్య గీతాలు
ఆ రాజు ఈ రోజు..అరుదెంచునా
ఆ రాజు ఈ రోజు..అరుదెంచునా
అపరంజి కలలన్ని..చిగురించునా..
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
చరణం::2
చాటుగా పొదరింట..మాటూగా ఉన్నాను
చాటుగా పొదరింట..మాటూగా ఉన్నాను
పాటలా ధరరాగ..భావనలు కన్నాను
చాటుగా పొదరింట..మాటూగా ఉన్నాను
పాటలా ధరరాగ..భావనలు కన్నాను
ఎల నాగ నయనాల..కమలాలలోదాగి
ఎల నాగ నయనాల..కమలాలలోదాగి
ఎదలోన కదలే..తుమ్మెద పాట విన్నాను
ఎదలోన కదలే..తుమ్మెద పాట విన్నాను
ఆ పాట నాలో..తియ్యగ మృగనీ...
ఆ పాట నాలో..తియ్యగ మృగనీ...
అనురాగ మధుధారయై..సాగనీ
ఊహూహూ..ఊహూహూ..ఊహూహూ..ఊహూహూ..
తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు
Ekaveera (1969) Music Direcor : K.V.Mahadevan Lyricist : Devulapalli Krishna Sastry Singers : Ghantasala, P.Susheela Cast::N.T.Ramarao,Kantarao,Dhulipaali,K.R.Vijaya,Jamuna,Satyanarayana,Santakumari,Sreeranjani. :::::: thotalo na raju thongi chusenu nadu neetilo aa raju needa navvenu nedu thotalo na raju thongi chusenu nadu neetilo aa raju needa navvenu nedu navvulaa avi kaavu navapaarijaataalu navvulaa avi kaavu navapaarijaataalu ravvanta sadi leni rasaramya geetalu aa raju eeroju arudenchunaa aa raju eeroju arudenchunaa aparanji kalalanni chivurinchunaa chatugaa podarinti matugaa unnanu chatugaa podarinti matugaa unnanu paatalaaghara raaga bhaavanalu kannanu yela naaga nayanaala kamalaalalo dagi yela naaga nayanaala kamalaalalo dagi yedalona kadale tummeda pata vinnanu yedalona kadale tummeda pata vinnanu aa pata nalo tiyyaga mroganee aa pata nalo tiyyaga mroganee anuraga madhu dharaye saganee thotalo na raaju thongi chusenu nadu
ఈ పాట ఇక్కడ వినండి సంగీతం::T.చలపతిరావ్ రచన::సినారె గానం::S.P.బాలు తారాగణం::N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని పల్లవి::
ఏపారిజాతమ్ములీయగలనో..సఖీ గిరి మల్లికలు తప్ప..గరికపూవులు తప్ప ఏ కానుకలందించగలనో..చెలీ గుండెలోతుల దాచుకొన్న వలపులు తప్ప
జగతిపై నడయాడు చంచలా వల్లికా తరుణి ఆకృతి దాల్చు..శరదిందు చంద్రికా శరదిందు చంద్రికా
చరణం::1
నీవు లేని తొలి రాతిరి..నిట్టూర్పుల పెను చీకటి నీవు లేని విరిపానుపు..నిప్పులు చెరిగే కుంపటి విరులెందుకు..సిరులెందుకు తలపెందుకు..తనువెందుకు నీవు లేక..నేనెందుకు...... నీవు లేక..నేనెందుకు.......
ఈ పాట ఇక్కడ వినండి సంగీతం::T.చలపతిరావ్ రచన::D.C.నారాయణ రెడ్డి గానం::ఘంటసాల,P.సుశీల తారాగణం::N.T. రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని పల్లవి::
ఒక దీపం వెలిగిందీ..ఒక రూపం వెలసింది ఒక దీపం వెలిగిందీ..ఒక రూపం వెలసింది స్నేహంలో రేకులు విరిసీ..చిరునవ్వుల వెలుగు కురిసి స్నేహంలో రేకులు విరిసీ..చిరునవ్వుల వెలుగు కురిసి ఒక దీపం వెలిగిందీ..ఒక రూపం వెలసింది
ఒక దీపం మిలిగింది..ఒక రూపం తొలగింది ఒక దీపం మిలిగింది..ఒక రూపం తొలగింది వేకువ ఇక లేదని తెలిసి..చీకటితో చేతులు కలిపి వేకువ ఇక లేదని తెలిసి..చీకటితో చేతులు కలిపి ఒక దీపం మిలిగింది..ఒక రూపం తొలగింది
చరణం::1
మంచు తెరలే కరిగిపోగా..మనసు పొరలే విరిసిరాగా మంచు తెరలే కరిగిపోగా..మనసు పొరలే విరిసిరాగా చెలిమి పిలుపే చేరుకోగా..చెలియ వలపే నాదికాగా అనురాగపు మాలికలల్లి..అణువణువున మధువులు చల్లి అనురాగపు మాలికలల్లి..అణువణువున మధువులు చల్లి ఒక ఉదయం పిలిచింది..ఒక హృదయం ఎగసింది
చరణం::2
నింగి అంచులు అందలేక..నేలపైన నిలువరాక నింగి అంచులు అందలేక..నేలపైన నిలువరాక కన్నె కలలే వెతలు కాగా..ఉన్న రెక్కలు చితికిపోగా కనిపించని కన్నీట తడిసి..బడబానల మెడలో ముడిచి కనిపించని కన్నీట తడిసి..బడబానల మెడలో ముడిచి ఒక ఉదయం ఆగింది..ఒక హృదయం ఆరింది ఒక ఉదయం ఆగింది..ఒక హృదయం ఆరింది
ఈ పాట ఇక్కడ వినడీ సంగీతం::T.చలపతిరావ్ రచన::D.C.నారాయణ రెడ్డి గానం::S.P.బాలు,P.సుశీల తారాగణం::N.T.రామారావు, జమున, కాంతారావు, K.R.విజయ,సత్యనారాయణ, ధూళిపాళ,శాంతకుమారి,శ్రీరంజని దేశి::రాగం పల్లవి::
ఎంత దూరమో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో పరిమలించు పానుపులకు నిరీక్షించు చూపులకు పరిమలించు పానుపులకు నిరీక్షించు చూపులకు వేసిన తలుపులకు వేచిన తలపులకు ఎంత చేరువో అది ఎంత దూరమో
ఎంత దూరమో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో ఉదయనించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు ఉదయనించే కిరణాలకు ఉప్పొంగే కెరటాలకు కలలుగనే చెలునికీ కలతపడే చెలియకు ఎంత చేరువో అది ఎంత దూరమో
చరణం::1
ఎంత దూరమో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి మనసు పడని సంపంగికి మరులు విడని భ్రమరానికి ఉన్నదానికి అనుకున్నదానికి ఎంత చేరువో అది ఎంత దూరమో
చరణం::2
ఎంత దూరమో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు అల్లనాటి ఆశలకు అణగారిన బాసలకు మరువరాని అందానికి చెరిగిపోని బంధానికి ఎంత చేరువో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో ఎంత దూరమో అది ఎంత దూరమో