Monday, September 03, 2007

శ్రీవారికి ప్రేమలేఖ--1984



Manasa Thullipadake by rampandu-bellary

సంగీతం::రమేష్ నాయుడు.
రచన::వేటూరి.
గానకోకిల::S.జానకి

Film Directed By::Jandyaala
తారాగణం::నరేష్,పూర్ణిమ,సుత్తి వీరభద్రరావు,నూతనప్రసాద్,ముచ్చెర్ల అరుణ,రాళ్ళపల్లి,సంగీత,శ్రీలక్ష్మీ,సుత్తివేలు.


పల్లవి::

శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా
ప్రియానందభోజ
మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి.... మిము వరించి....
మీ గురించి ఎన్నో కలలు గన్న కన్నె బంగారూ

భయముతో.. భక్తితో.. అనురక్తితో
సాయంగల విన్నపములూ.... !!

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభ ముహూర్తాన..


తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ..
ఎన్నెన్నో కధలూ........
జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో

చరణం::1


నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక
ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ..ప్రేమ లేఖ 


తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ
ఎన్నెన్నో కధలూ.....


చరణం::2


ఏ తల్లి కుమారులో తెలియదు గాని
ఎంతటి సుకుమారులో తెలుసు నాకూ
ఎంతటి మగధీరులో తెలియలేదు గాని
నా మనసును దోచిన చోరులు మీరూ

వలచి వచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ
చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ
ఎన్నెన్నో కధలూ.....

చరణం::3


తలలోన తురుముకున్న తుంటరి మల్లే
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే.. ఆహ్ అబ్బా
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే.. ఆహ్ ఆహ్

మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండీ.. ఇప్పుడే బదులివ్వండి

!! తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ
ఎన్నెన్నో కధలూ....... !!

5 comments:

braahmii said...

త్రియానందభోజ కాదనుకుంటాను
ప్రియానందభోజ అని జ్ఞాపకం

బ్రాహ్మీ

Shakthi said...

NamastE Braahmii gaaru

మీరు చెప్పిందే కరెక్టే అండి
మీకు చాలా థాంక్స్
ఇలాగే మాకు తప్పులు చూపుతుంటే సరిదిద్దుకొనే అవకాశలు ఇచ్చినట్లు అవుతుంది ఎనివే మరోమారు థాంక్స్

కమల్ said...

chaalaa manchi paatanu ikkada post chaesaaru..chaalaa thanksandi

Shakthi said...

చాలా థాంక్స్ kamskam గారు
మీ comments. మాకు ఉత్సాహము ఇస్తున్నది ఇలాగె తప్పులున్నా క్షమించి చెప్పగలరని ఆశిస్తున్నాను :)

sl.swamy said...

super chaalaa bagundi