Monday, September 03, 2007

శ్రీవారికి ప్రేమలేఖ--1984



Lipi Leni Kanti Baasa by rampandu-bellary


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::S.P.బాలు.S.జానకి

Film Directed By::Jandyaala
తారాగణం::నరేష్,పూర్ణిమ,సుత్తి వీరభద్రరావు,నూతనప్రసాద్,ముచ్చెర్ల అరుణ,రాళ్ళపల్లి,సంగీత,శ్రీలక్ష్మీ,సుత్తివేలు.

పల్లవి::

లిపి లేని కంటి బాసా
తెలిపింది చిలిపి ఆశా
నీ కన్నుల కాటుక లేఖలలో
నీ సొగసుల కవితా రేఖలలో
ఇలా.. ఇలా
చదవనీ.. నీ లేఖని.. ప్రణయ రేఖనీ


బదులైన లేని లేఖా
బ్రతుకైన ప్రేమ లేఖా
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా.. ఇలా
రాయనీ.. నా లేఖని.. ప్రణయ రేఖనీ
లిపి లేని కంటి బాసా..తెలిపింది చిలిపి ఆశా 

చరణం::1


అమావాస్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
వెదుకుతు ఉందీ వేదన తానై విదియ నాటి జాబిలి కోసం
వెలుగు నీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
మ్ము...హూ...లలలలా ఆ...ఆ...
లలలలా ఆ...ఆ...ఆ...
తనన తనన తనన
వెదుకుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం
లిపి లేని కంటి బాసా..తెలిసింది చిలిపి ఆశా 

చరణం::2


అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకునీ
ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకునీ
నీ కంటికి పాపను నేనై
నీ ఇంటికి వాకిలి నేనై
గడపదాట లేకా నన్నే గడియవేసుకున్నాను
ఘడియైనా నీవు లేక గడపలేక ఉన్నాను


బదులైన లేని లేఖా
బ్రతుకైన ప్రేమ లేఖా
నీ కౌగిట బిగిసిన శ్వాసలతో
నీ కవితలు నేర్పిన ప్రాసలతో
ఇలా..ఇలా
రాయనీ....నీ లేఖని....ప్రణయ రేఖనీ
లిపి లేని కంటి బాసా..తెలిసింది చిలిపి ఆశా

No comments: