Friday, August 17, 2007

రాజమకుటం--1960


సంగీతం::మాస్టర్ వేణు
రచన::కోసరాజు రాఘవయ్య
గానం::P.లీల 
తారాగణం:N.T.రామారావు, రాజసులోచన,గుమ్మడి,కన్నాంబ,రాజనాల,పద్మనాభం

పల్లవి::

ఓఓఓఓఓఓఓ..ఓఓఓఓఓఓఓ..హేయ్ 
ఏడనున్నా..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు
ఏడనున్నా..ఎక్కడున్నాడో
చూడ చక్కని చుక్కల ఱేడు
ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
హేయ్.. 

చరణం::1

ఓహొహొహో..ఓహొహొహో
గాలి రెక్కల..పక్షుల్లారా..ఆ
గాలి రెక్కల..పక్షుల్లారా 
పాల వన్నెల మబ్బుల్లారా
ఓఓఓఓఓఓఓఓఓ
గాలి రెక్కల..పక్షుల్లారా
పాల వన్నెల..మబ్బుల్లారా
పక్షుల్లారా..మబ్బుల్లారా
మనసు చూరగొని మాయమైన మక్కువ ఱేడే
ఏడనున్నాడో..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు
ఏడనున్నాడో ఎక్కడున్నాడో
హేయ్.. 

చరణం::2

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
పొగడపొన్నల..పువ్వలవీడ
పొగడపొన్నల..పువ్వలవీడ
పూల వీధిలో..తుమ్మెదున్నాడా..ఆ
పొగడపొన్నల..పువ్వలవీడ
పూల వీధిలో..తుమ్మెదున్నాడా
గున్నమామిడి..కొమ్మలగూడా
గూటిలోన..గండు కోయిలలేడా
గున్నమామిడి..కొమ్మలగూడా
గూటిలోన..గండు కోయిలలేడా
కోయిలలేడా..తుమ్మెదున్నాడా
కులుకు బెలుకుగల కోడె ప్రాయపు కొంటివాడే
ఏడనున్నాడో..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు..ఏడనున్నాడో ఎక్కడున్నాడో
చూడచక్కని చుక్కలరేడు..ఈడు జోడు కలిసినవాడు
ఏడనున్నాడో..ఎక్కడున్నాడో
నా చుక్కల ఱేడు..ఏడనున్నాడో ఎక్కడున్నాడో..హేయ్ 

No comments: