Monday, August 06, 2007

చదువుకొన్న అమ్మాయిలి--1963::మొహన::రాగం




సంగీతం S.రాజేశ్వర రావ్
రచన::దాశరథి
గానం::P.సుశీ


మొహన::రాగం::

ఓహో...ఓ..ఆ..హా..ఆ..ఆ..
ఓహో...ఓ..ఆ..హా..ఆ..ఆ..


వినిపించనిరాగాలే కనిపించని అందాలే
అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే
వినిపించన్ని రాగాలే....

తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
తొలిచూపులు నాలోనే వెలిగించె దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచి మనసే మనసే..వినిపించని రాగాలే..


వలపే వసంతములా పులకించి పూసినది
వలపే వసంతములా పులకించి పూసినది
చెలరేగిన తెమ్మరలే గిలిగింతలు రేపినవీ
విరిసే వయసే వయసే...వినిపించని రాగాలే


వికసించెను నా వయసే మురిపించెను ఈ సొగసే
విరితేనేల వెన్నెలలో కొరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే...
వినిపించని రాగాలే కనిపించెని అందాలే
అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే.........

No comments: