Monday, August 06, 2007

చదువుకొన్న అమ్మాయిలు--1963







సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల

కిలకిల నవ్వులు చిలికిన, పలుకును నాలో బంగారువీణ
కరగిన కలలే నిలిచిన, విరిసెను నాలో మందారమాల
రమ్మని మురళీరవమ్ములు పిలిచె
రమ్మని మురళీరవమ్ములు పిలిచె


అణువణువున బృందావని తోచె
తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె
కిలకిల నవ్వులు చిలికిన..పలుకును నాలో బంగారువీణ


నీవున్న వేరే సింగారములేల
నీవున్న వేరే సింగారములేల
నీ పాదధూళి సింధూరము కాదా
మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే
కరగిన కలలే నిలిచిన..విరిసెను నాలో మందారమాల


నీ కురులే నన్ను సోకిన వేళ
నీ కురులే నన్ను సోకిన వేళ
హాయిగ రగిలేను తీయని జ్వాల
గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ
కిలకిల నవ్వులు చిలికిన..పలుకును నాలో బంగారువీణ
కిలకిల నవ్వులు చిలికిన

No comments: