Tuesday, June 05, 2007

జీవిత చక్రం--1971




సంగీతం::శంకర్ జైకిషన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,శారద  
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండలేదు..తనివి తీరలేదు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండునోయి..తనివి తీరునోయి
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

చరణం::1

నిను వీణచేసి కొనగోట మీటి..అనురాగ గీతాలే పలికించనా 
ఆ పాటలోని భావాలు నీవై..నీలోని వలపు నాలోన నిలువు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండునోయి..తనివి తీరునోయి
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

చరణం::2

చిరుకోర్కెలేవో చిగురించసాగే..ఎదలోన ఆశ ఊరించసాగే
నీ ఆశలన్నీ విరబూయగానే..పూమాల చేసి మేడలోన వేతు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండునోయి..తనివి తీరునోయి
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

చరణం::3

నా గుండెలోన..గుడి కట్టినాను
గుడిలోన దేవతలా..నివసించవా
గుడిలోన వున్నా..ఎడమేగి వున్నా
ఈ దేవి నీ కొరకే..జీవించులే
మధురాతి మధురం ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండలేదు..తనివి తీరలేదు 
మధురాతి మధురం..మన ప్రేమ మధువు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

2 comments:

Dr.Suryanarayana Vulimiri said...

ఈ చిత్రంలో ఘంటసాల గారితో పాడిన గాయని పేరు శారద. లతామంగేష్కర్ గారు కాదు.

srinath kanna said...

నమస్తే సూర్యనారాయణ గారు __/\__

చాలా థాంక్స్ అండీ మీకు
నేను లతామంగేష్కర్ అనుకొన్నానండీ
నా స్నేహితురాలు కూడా లతామంగేష్కర్ అనే చెప్పింది
మీరు చెప్పారంటే అందులో ఇక తప్పులు ఉండవని నా నమ్మకం
ఇప్పుడే పేరు మార్చేస్తాను :)నా బ్లాగులో కాలు మోపినందుకు ,
గాయని పేరు చెప్పినందుకు మరో మారు కృతగ్నతలు తెలుపుతు

ప్రేమతో
శక్తి