Showing posts with label జీవిత చక్రం-1971. Show all posts
Showing posts with label జీవిత చక్రం-1971. Show all posts

Saturday, May 09, 2015

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్-జైకిషాన్  
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి:: 

కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా
ఆశలూ దాచకూ..ఆశలూ దాచకూ
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా ఓ పిల్లా

చరణం::1

ఆడపిల్లా..పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా..పూలతీగె ఒక్కలాగె చక్కనైనవి 
ఆడపిల్లా పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి..ఆహా     
అందమైన మగవాడు..పొందుకోరి వచ్చాడు 
ఎందుకలా చూస్తావు..ఓ పిల్లా
స్నేహమూ చేయవా..స్నేహమూ చేయవా....   
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది  
మూగమనసులో మాట..ఓ పిల్లా ఓ పిల్లా

చరణం::2

కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె 
కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి..ఆహా 
మెత్తనైన మనసు నీది..కొత్త చిగురు వేసింది 
మత్తులోన మునిగింది..ఓ పిల్లా..మైకమూ పెంచుకో 
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా..ఓ పిల్లా

చరణం::3

చెప్పలేని వింత వింత..అనుభవాలు విరగబూసె
చెప్పలేని వింత వింత..అనుభవాలు విరగబూసె , 
చెప్పలేని వింత వింత అనుభవాలు ఎదురుచూస్తున్నాయి..ఆహా
నువ్వు నన్ను చేరాలి..నేను మనసు యివ్వాలి 
ఎడము లేక వుండాలి..ఓ పిల్లా..ఆ 
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ పిల్లా..ఓ పిల్లా
వస్తావా..మురిపిస్తావా..వస్తావా..మురిపిస్తావా
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది
మూగమనసులో మాట..ఓ పిల్లా
వస్తావా..మురిపిస్తావా..వస్తావా..మురిపిస్తావా

Tuesday, June 05, 2007

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్-జైకిషాన్  
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,శారద 
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండె కలిపి చూడు
సందిట్లో బందీవై చూడు 
హాయ్ సందిట్లో బందీవై చూడు
సయ్యాటలాడి...చూడు

హోయ్..కళ్ళలో కళ్ళు పెట్టి చూశా
గుండెల్లో గుండె కలిపి..చూశా 
సందిట్లో బంధీనై..పోతా
సందిట్లో..బంధీనై పోతా
సయ్యాట...వేళ కాదు

చరణం::1

కానుకా ఇవ్వనా..వద్దులే దాచుకో
కోరికా చెప్పనా..అహ..తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు..వుండవా హద్దులు
కాదులే కలిసిపో..అహ..నవ్వరా నలుగురు
కావాలి కొంత చాటు..హోయ్

కళ్ళలో కళ్ళు పెట్టి..చూడు
గుండెల్లో గుండె కలిపి..చూడు
సందిట్లో బందీవై..చూడు 
హాయ్..సందిట్లో బందీవై చూడు
సయ్యాటలాడి..చూడు

హోయ్..కళ్ళలో కళ్ళు పెట్టి..చూశా
గుండెల్లో గుండి కలిపి..చూశా
సందిట్లో బంధీనై..పోతా
సందిట్లో బంధీనై..పోతా
సయ్యాట వేళ..కాదు

చరణం::2

నువ్వు నా జీవితం..నువ్వు నా ఊపిరి
నువ్విలా లేనిచో..ఏండలో చీకటి
పాలలో తేనెలా..ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో..ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు

హోయ్..కళ్ళలో కళ్ళు పెట్టి..చూశా
గుండెల్లో గుండి కలిపి..చూశా
సందిట్లో బంధీనై..పోతా
సందిట్లో బంధీనై..పోతా
సయ్యాట వేళ..కాదు

కళ్ళలో కళ్ళు పెట్టి..చూడు
గుండెల్లో గుండె కలిపి..చూడు
సందిట్లో బందీవై..చూడు
హొయ్..సందిట్లో బందీవై చూడు 
సయ్యాటలాడి..చూడు

లలల్ల్ల..లాల్లల్లాల్లా..లలలా

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్ జైకిషన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల 
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం 

చరణం::1

లోకాన పన్నీరు జల్లేవులే..నీకేమొ కన్నీరు మిగిలిందిలే
పెరవారి గాయాలు మాన్చేవులే..నీలోన పెనుగాయ మాయేనులే
నీలోన పెనుగాయ..మాయేనులే 
అణగారిపోవు ఆశ..నీవల్లనే ఫలించె 

సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం 

చరణం::2

ఒక కన్ను నవ్వేటి వేళలో..ఒక కన్ను చమరించసాగునా?
ఒకచోట రాగాలు వికసించునా..ఒక చోట హృదయాలు ద్రవియించునా ?
ఒకచోట హృదయాలు ద్రవియించునా?
ఎనలేని ప్రాణదానం..ఎద బాధ తీర్చునా?  
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం

చరణం::3

కల్లోల పవనాలు చెలరేగునా..గరళాల జడివాన కురిపించునా
అనుకొని చీకట్లు తెలవారునా..ఆనంద కిరణాలు ఉదయించునా
ఆనంద కిరణాలు ఉదయించునా 
విధికేమొ లీల అయినా..మది బరువు మోయునా
సుడిగాలిలోన దీపం..కడవరకు వెలుగునా..సుడిగాలిలోన దీపం

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్ జైకిషన్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,శారద  
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండలేదు..తనివి తీరలేదు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండునోయి..తనివి తీరునోయి
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

చరణం::1

నిను వీణచేసి కొనగోట మీటి..అనురాగ గీతాలే పలికించనా 
ఆ పాటలోని భావాలు నీవై..నీలోని వలపు నాలోన నిలువు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండునోయి..తనివి తీరునోయి
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

చరణం::2

చిరుకోర్కెలేవో చిగురించసాగే..ఎదలోన ఆశ ఊరించసాగే
నీ ఆశలన్నీ విరబూయగానే..పూమాల చేసి మేడలోన వేతు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండునోయి..తనివి తీరునోయి
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

చరణం::3

నా గుండెలోన..గుడి కట్టినాను
గుడిలోన దేవతలా..నివసించవా
గుడిలోన వున్నా..ఎడమేగి వున్నా
ఈ దేవి నీ కొరకే..జీవించులే
మధురాతి మధురం ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
మధురాతి మధురం..మన ప్రేమ మధువు 
మది నిండలేదు..తనివి తీరలేదు 
మధురాతి మధురం..మన ప్రేమ మధువు
మధురాతి మధురం..మన ప్రేమ మధువు

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్ జైకిషన్
రచన::ఆరుద్ర
గానం::శారద  
తారాగణం::N.T. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ రాజా
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ రాజా
ఆశలూ..దాచకూ..ఆశలూ..దాచకూ
కంటిచూపు చెపుతోంది..కొంటెనవ్వు చెపుతోంది 
మూగమనసులో మాట..ఓ రాజా

చరణం::1

ఆడపిల్లా పూలతీగె..ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా పూలతీగె..ఒక్కలాగె చక్కనైనవి
ఆడపిల్లా..పూలతీగే ఒక్కలాగే అండ కోరుకుంటాయి..ఓయ్ 
అందమైన జవరాలు పొందుకోరి వచ్చింది ఎందుకలా చూస్తావు..ఓ రాజా 
స్నేహమూ చేయవా..స్నేహమూ చేయవా  
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది మూగమనసులో మాట..ఓ రాజా

చరణం::2

కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక..రామచిలుక జోడు కూడె
కొమ్మమీద గోరువంక రామచిలుక ముద్దుపెట్టుకున్నాయి..ఓయ్ 
మెత్తనైన మనసు నాది కొత్త చిగురు వేసింది మత్తులోన మునిగింది..ఓ రాజా  
మైకమూ పెంచుకో..మైకమూ పెంచుకో
కంటిచూపు చెపుతోంది కొంటెనవ్వు చెపుతోంది మూగమనసులో మాట..ఓ రాజా

Thursday, May 17, 2007

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్ జైకిషన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల,S.P.బాలు  
Film Directed By::C.S.Rao
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

హేయ్ పిల్లా ఎక్కడికెళ్తున్నావ్
హోయ్ హోయ్ హోయ్..ఏమిటీ  
సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..హాయ్..హాయ్   
సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ 

ఆ ఆ ఆ ఆ ఆ..ఆ 
సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..ఆహా 
సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ 
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..ఆ..హేయ్..యహా

చరణం::1

ఊగే కొమ్మల్లోన..నీవే 
సాగే మబ్బుల్లోన..నీవే..ఆహా 
ఎగిరే గువ్వల్లోన..నీవే..ఆహాహాహాఏయ్ 
అదిరే గుండెల్లోన..నీవే..ఆఆఆ   
అరెరే కింద మీదా..నీవే..ఆఆఆఆ..హేయ్ 

సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..హాయ్  
సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడే ఓలమ్మీ..నువ్వే కావాలమ్మీ..ఈ..యాహ 

చరణం::2

అసలే నా వయసూ లేత..ఆపై చలిగాలి కోత 
అందుకే రాశాడు ఆ తాత..ఇద్దరం కలుసుకునే రాత 
ఇక పై మన బ్రతుకే మోత..ఆఆఆఆఆఆఆఆ 
సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ..యాహా 

సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..అహహాహా  

చరణం::3

నీవే అనార్కలివైతే..నేనే సలీంబాబు నౌతా..ఆహా 
నీవే షాజహానువైతే..నేనే ముంతాజునౌతా..ఆఆఆ 
నీకో తాజ్ మహల్...కడతా..ఆహా..ఏహే..య్య్హా

సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ 

సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..హాయ్..హాయ్ 

సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడే ఓలమ్మీ నువ్వే కావాలమ్మీ 

హోయ్..హోయ్..సువ్వీ సువ్వీ..సువ్వీ సువ్వీ
చూడర చిన్నోడా నువ్వే కావాలిరా..
ఏ..హే..అమ్మి వెల్లి పోతున్నావా మల్లి వస్తావా
హా..హోయ్..హోయ్..ఆహా..ఆ..హా..మ్మ్ మ్మ్..హాహా 

Wednesday, May 09, 2007

జీవిత చక్రం--1971

సంగీతం::శంకర్ జైకిషన్
రచన::D.C.నారాయణరెడ్డి 
గానం::P.సుశీల,B.వసంత   
తారాగణం::N.T.రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత

పల్లవి::

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో

నానోము పండింది ఉయ్యాలో నీనోము పండిందా ? ఉయ్యాలో 
మావారు వచ్చిరి ఉయ్యాలో మీవారు వచ్చిరా ? ఉయ్యాలో
మావారు వచ్చిరి ఉయ్యాలో మీవారు వచ్చిరా ? ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో

చరణం::1

ఊరంత ఈరోజు బతుకమ్మ పండుగ నాబావ వస్తే..వస్తే
నాబావ వస్తే..నా బతుకంత పండుగ..ఆఆఆ 
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావ..నాబావ వస్తాడు ఆగవే భామా అవునే అతడౌనే అందాల చందమామా..బావా

చరణం::2

మాబావ నవ్వితే మరుమల్లె లెందుకే మాబావ తాకితే సిరివెన్నెల లెందుకే
నింగిని దిగివస్తాడే ముంగిట అగుపిస్తాడే ఒక్కసారి చూశారా సొక్కి సోలి పోతారే..ఆ ఆ
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా
బావా..ఆ 

చరణం::3

ముత్యాల పందిరి వేయించమందువా మేఘాల పల్లకీ తెప్పించమందువా?
ఒంటరిగా వస్తాడే జంటగ కొనిపోతాడే ఊరిని మరిపిస్తాడే నీ వారిని మరిపిస్తాడే..ఆ..ఆ
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా 
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా నీ బావ వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా..నా బావా..వస్తాడు ఆగవే భామా ఔనే అతడౌనే అందాల చందమామా  
బావా..నీ..బావ..వస్తాడు ఆగవే భామా ఔనా అతడౌనా అందాల చందమామా
బావా..ఆ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో..ఆఆ 
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో
పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించవే తల్లి ఉయ్యాలో