Saturday, June 02, 2007

దేవుడులాంటి మనిషి--1975


సంగీతం::K.V.మహాదేవన్
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల,S.P.బాలు
తారాగణం::కృష్ణ,మంజుల, శ్రీదేవి,నాగభూషణం,రాజబాబు,చంద్రమోహన్, మాడ 

పల్లవి::

చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
చూచుకున్న అందమేమి చేసుకుంటావూ
కాటుకలా రంగరించి పూసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
సింగారి సింగారి పిల్లా
బంగారు బంగారు మామా
సింగారి సింగారి పిల్లా
బంగారు బంగారు మామా

చరణం::1

ఏటికి ఎదురీదే గండుమీనులా
ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ
ఏటికి ఎదురీదే గండుమీనులా
ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ
తగినోడు కాదగినోడూ - తగినోడు కాదగినోడూ 
నే జిక్కేది ఎప్పుడని చూస్తున్నానూ
చేజిక్కితే వాణేమి చేసుకుంటావూ?
నా కొప్పులో గుప్పున ముడిచేసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ

చరణం::2

పట్టు దొరకని పరువంలాగా
పడవెళ్ళిపొతుందే పడుచుదానా
వీలుచూసీ వాలుచూసీ
వీలుచూసీ వాలుచూసీ
ఎత్తరా తెరచాప బుల్లిరాయడా
ఓ నా బుజ్జి నాయనా
నేను బుజ్జోణ్ణయితే ఎమిచేసుకుంటావూ
పాల బువ్వెట్టి ఎదలో దాచేసుకుంటానూ

చరణం::3

పంట చేనిపై పైర గాలిలా
ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ
పంట చేనిపై పైర గాలిలా
ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ
మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా
మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా 
మూడు ముళ్ళు ఎప్పుడని అడుగుతున్నానూ
ఆ మూడు ముళ్ళు వేసి ఏమి చేసుకుంటావూ
నిన్ను ప్రతి జన్మకు నా దానిగ చేసుకుంటానూ
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ
ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ
సింగారి సింగారి పిల్ల
బంగారు బంగారు మామా
సింగారి సింగారి పిల్ల
బంగారు బంగారు మామా

No comments: