Saturday, November 17, 2007

పవిత్ర బంధం--1971:::ఆరభి::రాగం

















సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల

ఆరభి::రాగం

పచ్చబొట్టు చెరిగిపోదులే"నా రాజా"
పడుచు జంట చెదరిపోదులే
పచ్చబోట్టు చెరిగిపోదులే"నా రాణీ"
పడచుజంట చెదరిపోదులే "నా రాణీ"
పచ్చబొట్టు చెరిగిపోదులే

పండిన చేలూల పసుపుపచ్చ
పండిన చేలూల పసుపుపచ్చ
నా నిండు మమతలో మెండు సొగసులు
లేతపచ్చా..ఆ..ఆ..ఆ..ఆ
నీ మెడలో పతకం చిలకపచ్చా..ఆ..ఆ
మన మేలిమి గురితి వలపుల పచ్చా
పచ్చబోట్టు చెరిగిపోదులే"నా రాణీ"
పడచుజంట చెదరిపోదులే"నా రాజా"
పచ్చబోట్టు చెదరిపోదులే

కలిసిన కలయిక తలవని తలపు
మన కలిసిన కలయిక తలవని తలపు
నీ చెలిమి విలువచే చేతి చలువచే చిగిర్చె నా మనసు
తిరిగెను బ్రతుకే క్రొత్త మలుపు
ఇది తియ్యని వాడని మన తొలివలపు
పచ్చబొట్టు చెరిగిపోదులే"నా రాజా"
పడుచు జంట చెదరిపోదులే.."నారాణీ"
పచ్చబోట్టు చెరిగిపోదులే

నూరేళ్ళు వెలుగు నుదిటిబోట్టు
నూరేళ్ళు వెలుగు నుదిటిబోట్టు
అది నోచిన నోములు పూచిన రోజున
పెళ్ళిబొట్టు కట్టేను నీ చేయి తాళికట్టు
కట్టేను నీ చేయి తాళికట్టు...
అది కలకాలం కాంతుల కలిమిచెట్టు
పచ్చబోట్టు చెరిగిపోదులే"నా రాణీ"
పడచుజంట చెదరిపోదులే"నా రాజా"
పచ్చబోట్టు చెదరిపోదులే

No comments: