Tuesday, January 30, 2007

బొబ్బిలి యుద్ధం--1964::హిందోళ::రాగం





సంగీతం::సాలూరి రాజేశ్వర రావ్
గానం
:: భానుమతి
రచన::సముద్రల రామానుజా చార్య

రాగం:::హిందోళ

శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా
శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా
సిరులు యశము సోభిల దీవించు మమ్ములా

!! శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా !!

కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం
కాకతీయ వైభవం హంపి వేంగీ ప్రాభవం
కన్నతండ్రి కలలు నిండి
మా కన్నతండ్రి కలలు నిండి కలకాలం వర్ధిల్లగా

!! శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా
సిరులు యశము సోభిల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా !!

పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా
పెరిగి మాబాబు వీరుడై ధరణి సుఖాల ఏలగా
తెలుగు కీర్తి తేజరిల్లి తెలుగు కీర్తి తేజరిల్లి దిశలా విరాజిల్లగా
!! శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా
సిరులు యశము సోభిల దీవించు మమ్ములా
శ్రీకర కరుణాలవాల వేణు గోపాలా !!

No comments: