Tuesday, January 30, 2007

శ్రీ పాండురంగ మహత్యం--1957::నటబైరవి::రాగం


















సంగీతం::T.V.రాజు
రచన::సముద్రాల రామానుజాచార్య(జునియర్)
గానం::ఘంటసాల,P.సుశీల


రాగం::నటబైరవి::

నీవని నేనని తలచితిరా
నీవే నేనని తెలిసితిరా
నీవని నేనని తలచితిరా
నీవే నేనని తెలిసితిరా
నిజమిది

అ::-రుజువేదీ...ఉహూ హూహూ....అహాహహ
ఆ::-నీవని నేనని తలచితిరా
నీవే నేనని తెలిసితిరా


ఆ::-కలయగ జూచితి నీకొరకై
నే కలయగ జూచితి నీకొరకై నే
కనుపాపలలో కనుగొన్నారా
కనుపాపలలో కనుగొన్నారా
అ::-ఔనో కాదో నే చూడనా
అ::-నీవని నేనని తలచితినే
నీవే నేనని తెలిసితినే


అ::-కలవరపాటున కల అనుకొందు
కలవరపాటున కల అనుకొందు
కాదనుకొందు కళా నీ ముందు
కాదనుకొందు కళా నీ ముందు
ఆ:కాదు సఖా కల నిజమేలే

ఆ::-నీవని నేనని తలచితిరా
నీవే నేనని తెలిసితిరా
నీవే నేనని తెలిసితిరా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ.......
మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్..మ్మ్....

No comments: