Tuesday, January 30, 2007

బొబ్బిలి యుద్ధం--1964





సంగీతం::సాలూరి
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల P.సుశీల

అ:::సొగసు కేల్జడదానా సోగ కన్నులదానా
వజ్రాలవంటి పల్వరుసదానా
బంగారుజిగిదానా సింగారములదానా
నయమైన ఒయ్యారి నడలదానా
తోరంపుకటిదానా తొణకు సిగ్గులదానా
పిడికిట నడుగునన్ నడుముదానా
ఆ...ఆ...ఆ..

అ:మురిపించే అందాలే అవి నన్నే చెందలే
మురిపించే అందాలే అవి నన్నే చెందలే
నా దానవు నీవేలే నీవాడను నేనేలే
దరీచేర రావే సఖి నా సఖి..ఈ...
ప్రేయసి సిగ్గేల
ఆ:మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈవేళా..ఆ...ఆ...
అదే హాయికాదా? సఖా నాసఖా!

అ:మురిపించే అందాలే అవి నన్నే చెందలే
మురిపించే అందాలే అవి నన్నే చెందలే

అ:చెలి తొలిచూపే మంత్రించినే
ఆ:ప్రియసఖురూపే మదినేలెనే
అ:చెలి తొలిచూపే మంత్రించినే
ఆ:ప్రియసఖురూపే మదినేలెనే

ఇ:ఇది యెడబాటు కనలేని ప్రేమ
ఇల మనకింక సురలోక సీమ
ఇ:ఇది యెడబాటు కనలేని ప్రేమ
ఇల మనకింక సురలోక సీమ
ఆ:ఇదే హాయి కాదా సఖా నాసఖా

అ:మురిపించే అందాలే అవి నన్నే చెందలే
మురిపించే అందాలే అవి నన్నే చెందలే

అ:అనురాగాల రాగాలలో
ఆ:నయగారాల గారాలలో
అ:అనురాగాల రాగాలలో
ఆ:నయగారాల గారాలలో

ఇ:మధుమాధుర్యమే నిండిపోయే
హృదయానందమే పొంగిపోయే
ఇ:మధుమాధుర్యమే నిండిపోయే
హృదయానందమే పొంగిపోయే
అ:దరిచేరరావే సఖీ నాసఖీ!

అ:మురిపించే అందాలే అవి నన్నే చెందలే
మురిపించే అందాలే అవి నన్నే చెందలే

5 comments:

నిషిగంధ said...

VERY nice song! chAlA rOjula tarvAta vinnaanu.. Thanks for refreshing my memory :-)

gsmanyam said...

nice songs shakti garu, meeku veelaitae amma ani pilichanaa song full gaa chepparuuuuu

Shakthi said...

HellO ...subbU...

meeku nachchinanduku chaalaa Thanks:)
tappakunDagaa meeru kOrina paaTa raayagalanu

Shakthi said...

HellO kiraN gaarU
chalaa thanks anDii paaTalu nachchinanduku :)

gsmanyam said...

thankq sakti jee