Wednesday, November 21, 2007

కులగోత్రాలు--1962


సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::D.C.నారాయణ రెడ్డి
గానం::ఘంటసాల, P. సుశీల


బలె..బలె..బలె.బలె..బలేయ..
ఓయ్..యహా.ఓయ్..యహాఓయ్..యహా.

ఓ..వన్నెల చిన్నెల కన్నియా..
నీ నల్లని జడలో పూలు..
నా గుండెలలో బాణాలూ
ఓ పిల్లా..నీ నల్లని జడలో పూలు..
నా గుండెలలో బాణాలూ
ఎవరికి మనసిచ్చావే..
నీ వెవరికి మనసిచ్చావే..యహా

ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
ఓ రాజ..ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే..
నా సొగసులు నీకొరకేలే..యహా

ఆ చక్కని చుక్కలరేడు..
నీ అందము చూచెను నేడు..అహా..ఆ
ఆ చక్కని చుక్కలరేడు..
నీ అందము చూచెను నేడు..
ఎదో కలతపడి..తన మనసు చెడి
ఎదో కలతపడి..తన మనసు చెడి
ఎదలో దాగే ఎందుకే?

నీ నల్లని జడలో పూలు..
నా గుండెలలో బాణాలూ
ఎవరికి మనసిచ్చావే..
నీ వెవరికి మనసిచ్చావే..యహా

నీ చక్కని మనసులు చూసి..
తన మచ్చను మదిలో తలచి..ఆహ్హా
నీ చక్కని మనసులు చూసి..
తన మచ్చను మదిలో తలచి.
ఏదో కలతపడి..తన మనసుచెడి
ఏదో కలతపడి..తన మనసుచెడి
తెరలోదాగే..అందుకే..ఓహో..

ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే..
నా సొగసులు నీకొరకేలే..యహా

ఆఆఆ ఆఆఆఅ..ఓఓఓఓఓఓ
నీవలచిన వాడే నవాబు
నీవు మరచిన నాడు గరీబూ..
నీవు మరచిన నాడు గరీబూ..
నీవు పిలిచిన నాకు ఉషారూ..
నను తలవనిచో బేజారూ..
మము తలవనిచో బేజారూ..
నే మెచ్చినాను రావే..
నీవు నచ్చినావు లేవోయ్..
నే మెచ్చినాను రావే..
నీవు నచ్చినావు లేవోయ్
పదవే..పోదాం..హాయిగా

ఈ చల్లని వెన్నెలరేయి..
నా మనసును దోచితివోయి
నా సొగసులు నీకొరకేలే..
నా సొగసులు నీకొరకేలే..యహా

హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హాయ్ హాయ్ జిగిలగి జిగిలగి జిగీ
హ్హ్హా హ్హా హ్హా హ్హా బలె బలె బలే...

No comments: