Wednesday, October 03, 2007

బంగారు కలలు--1974

సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::ఆత్రేయ
గానం::ఘంటసాల 
తారాగణం::అక్కినేని,లక్ష్మి,వహీదా రెహమాన్ ( హిందీ తార), ఎస్.వి.రంగారావు

పల్లవి::

మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ
మనసుకు మమతకు వెలువేలేదూ..ఏదీలేని బ్రతుకే చేదూ
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ

చరణం::1
    
నీకు తెలుసు నిన్నెందుకు..ఆదరంచినానో
నీకు తెలుసు నిన్నెందుకు..ఆదరంచినానో
నాకు తెలుసు నన్నెందుకు..దూరంచేశావో
తెలియని దొకటే మనకు..లోకం విసిరిన యీ బాకు
ఎంత గాయం చేస్తుందో..ఎవరి బ్రతుకు ఏమౌతుందో    
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ

చరణం::2

అనుమానానికి అనురాగాన్నే..బలిచేశావూ
అనుమానానికి అనురాగాన్నే..బలిచేశావూ
నీకిచ్చిన మనసు ఎంత స్వచ్చమ్మో..ఎరుగక నిందించావూ
నిజమన్నది నిప్పువంటిది..నివురు గప్పి అది వుంటుందీ
ఎవరి గుండెలో ఎంత రగులుతుందో..ఏమి మిగులుతుందో        
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ

చరణం::3

నాకు తెలుసు ఆప్తులే..శత్రువులౌతారని
నాకు తెలుసు ఆప్తులే..శత్రువులౌతారని
నీకు తెలుసు..సంఘానికి కళ్ళేలేవని
తెలియని దేదీలేదూ..తెలిసీ ఫలితం లేదూ
మనసుకు మరుపేలేదూ..ఏదీలేని బ్రతుకే చేదూ    
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ
మనసుకు మమతకు వెలువేలేదూ..ఏదీలేని బ్రతుకే చేదూ
మంచితనానికి తావేలేదూ..మనిషిగ మసలే వీలులేదూ  

No comments: