రచన::వేటూరి
సంగీతం::ఇళయరాజ
గానం::S.P.బాలు,S.జానకి
దర్శకత్వం::కోదండ రామి రెడ్డి
మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
మల్లి జాజి అల్లుకున్న రోజు
జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నాకు వెన్నెలేది
ఎదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటం లో
వెళ్ళలేను..ఉండలేను.. ఏమి కాను
!! మళ్ళి మళ్ళి ఇది రాని
రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు !!
చేరువైన రాయబారాలే
చెప్పబోతే మాట మౌనం
దూరమైన ప్రేమ ద్యానాలే
పాడలేని భావ గీతం
ఎండల్లొ వెన్నెల్లొ ఎంచేదో
ఒక్కరం ఇద్దరం అవుతున్నా
వసంతాలు ఎన్నొస్తున్నా
కోకిలమ్మ కబురేది
గున్నమావి విరబూస్తున్నా
తోటమాలి జాడేది
నాయెదే తుమ్మేదై సన్నిదే చేరగా
!! మళ్ళి మళ్ళి ఇది రాని
రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు !!
కళ్ళ నిండ నీలి స్వప్నాలే
మోయలేని వింత మోహం
దేహమున్న లేవు ప్రాణాలే
నీవు కాదా నాకు ప్రాణం
సందిట్లొ ఈ మొగ్గే పూయనీ
రాగలే బుగ్గలో దాయనీ
గులాబీలు పూయిస్తున్న
తేనెటీగ అతిధేది
సందె మబ్బులెన్నోస్తున్నా
స్వాతిచినుకు తడుపేది
రేవులో నావలా నీ జతే కోరగా
!!జాబిలంటి ఈ చిన్నదాన్ని
చూడకుంటే నీకు వెన్నెలేది
ఎదో అడగాలని ఎంతో చెప్పాలని
రగిలే ఆరాటం లో
వెళ్ళలేను...ఉహు...
ఉండలేను...ఉహు.. ఏమి కాను
హాయ్...మళ్ళి మళ్ళి ఇది రాని
రోజు మల్లి జాజి అల్లుకున్న రోజు
లాలలాల లాలలాలాలా
ఉహు ఉహు అహ అహ....!!
No comments:
Post a Comment