Saturday, July 23, 2011
నాలుగు స్తంభాలాట ---1982
సంగీతం::రాజన్-నాగేంద్ర
సాహిత్యం::వేటూరి
గానం::SP.బాలసుబ్రమణ్యం, P.సుశీల
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను
మరిచి పోబోకుమా..మమత నీవే సుమా
!! చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ !!
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనె నే వేచి వుంటానులే
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే..వెల్లువౌతానులే
హిమములా రాలి సుమములై పూసి
రుతువులై నవ్వి మధువులై పొంగి
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా శిధిలమైనా విడిచి పోబోకుమా.. విరహమైపోకుమా
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
పున్నమి నేడై రేపటి నీడై ఆ ముద్దు తీరాలిలే..ఆ తీరాలు చేరాలిలే
మౌనమై వెలిసి గానమై పిలిచి
కలలతో అలిసి ఎగనమై ఎగసి
ఈ ప్రేమ..నా ప్రేమ..తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమ మయమే సుమా..ప్రేమ మనమే సుమా
!! చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పోయి కడలిగా పొంగు
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా..మమత నీవే సుమా !!
Labels:
P.Suseela,
SP.Baalu,
నాలుగు స్తంభాలాట --1982
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
chaalaa chaala manchi paatandi idi..veturi gaariki kuuda baagaa nachina paat..many many thanks andi..teluguloa elaa type cheyaaloa cheppagalaraa..plzzz..?
Post a Comment