Tuesday, August 07, 2007

ఆత్మబలం--1964

సంగీతం::KVమహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Director::V. Madhusudhan Rao
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,బి.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి 

పల్లవి::

ఓ..హో..ఒ..హో..హో..హో...
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనస
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనస
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు..ఆ..హా..ఆ..హా..
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మన
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనస
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు..ఆ..హా..ఆ..హా..
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనస

చరణం:: 1

ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహొయని పలికెను నీ వలపు
ఓయని పిలిచే నీ వలపునకు తీయగ మారెను నా తలపు
తియతీయగ మారెను నా తలఫూ..ఒ..హో..హో..హో..ఓ..ఒ..
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం:: 2

తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవు
ఆహా దోబూచాడెను నా నగవు
దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు
దోరదోరగ పండెను నీ మరుల
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం:: 3

లేదనిపించె నీ నడుము..అహా..హా..
నాదనిపించెను ఈ క్షణమ..చొ చొ..మ్మ్..హు..
లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము
ఉందో లేదో ఈ జగము...ఉందో లేదో ఈ జగమూ..
ఉందువు నీవు నాలో సగము
ఇది నిజము కాదనుము
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనస
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగస
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఆ..హా..హా..హా..ఆ..హా..హా...ఆ..

No comments: