Tuesday, August 07, 2007

ఆత్మబలం--1964



సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::ఘంటసాల,P.సుశీల

Film Director::V. Madhusudhan Rao
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,B.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి 

పల్లవి:: 

ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవా
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ

చరణం:: 1


కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్ళలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
మారినా మనిషిగా బతకలేవు
ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో
చిక్కుకున్న పిల్లవాడా


చరణం:: 2


నన్నిడిచి నువ్వెళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట..ఆ..ఆ..ఆ..
నన్నిడిచి నువ్వెళితే నీ వెంట నేనుంటా
నిన్నిడిచి నే వెళితే నువ్వు బతకలేవంట
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
ఎక్కడికి పోతావు చిన్నదానా..హ్హు..
నా చుపుల్లో చిక్కుకున్న పిల్లదాన
ఎక్కడికి పోతావు చిన్నదానా
నా చుపుల్లో చిక్కుకున్న పిల్లదానా

చరణం:: 3


పాడు..ఊ..పాడూ.....
పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆటకాదు
పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆటకాదు
ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు
పువ్వైనా నవ్వైనా నీ కోసం పూయదు..హ్హా..
ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా
నీ చూపులను ఓపలేను పిల్లవాడా
ఎక్కడికి పోలేను చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా
ఎక్కడికి పోలేను చిన్నదాన
నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా

No comments: