Tuesday, August 07, 2007

ఆత్మబలం--1964

సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య,ఆత్రేయ
గానం::P.సుశీల

Film Director::V. Madhusudhan Rao
తారాగణం::అక్కినేని,జగ్గయ్య,B.సరోజాదేవి,కన్నాంబ,రేలంగి 

పల్లవి::

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాన ఏమీ లేనిదాననైనాను
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

చరణం:: 1

కనులకు కలలేబరువైనాయి కన్నీళ్ళయినా కరువైనా
కనులకు కలలేబరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయ
రెండూ లేక పండు రేకులై ఎందుకు నాకీ కనుదోయ ఇంకెందుకు నాకీ కనుదోయ
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

చరణం:: 2

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని
కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని
నిలువుగ నన్ను దోచుకుంటివి నిరుపేదగ నే
నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాన ఏమీ లేనిదాననైనాన

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి

No comments: