రచన::D.C.నారాయణ రెడ్డి
సంగీతం::S.రాజేశ్వర రావ్
గానం::P.సుశీల,ఘంటసాల
Director :: Kotayya Pratyagatma
రాగ::కల్యాణి
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా
!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా !!
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ
!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా !!
నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...
!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా !!
నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....హహా ఒహో...అ ఆ . .
!! చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా నన్నే తెలుపమంటావా !!
2 comments:
బాగుంది పెద్దమ్మా ఇప్పుడు మీ బ్లాగు...కలర్ సెలక్షన్ కూడా బాగుంది
1.ఫాంట్ కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది...
2.ఎవర్ గ్రీన్ సింగర్స్ లో ' ఏ.ఏం.రాజా , లీల , జిక్కి ' మిస్సయ్యారు :(
3.అలాగే ఆ పాట ఏ రాగంలో ఉందో చెబితే బాగుంటుంది.
4.సంగీత దర్శకుడి పేరు కూడా ఆడ్ చెయ్యచ్చు
5. బ్లాగ్ రెజిస్ట్రేషను మెయిన్ పేజ్ లో పెడితే బాగుంటుంది
థాంక్స్ మహేష్ :)
తప్పకుండగ నీవడిగిన Singers పాడిన పాటలు వేస్తాను .
పాటకు రాగం , Music Director : Rajeswara Rao S అని రాసానుగా ? బహుశా నీవు చూసినప్పుడు రాసివుండకపోవచ్చు
మళ్ళి చూసి అన్నీ బాగున్నాయా లేదా చెప్పాలి
మీరు చూసి comment రాస్తేనే మాకూ ఉత్షాహం
వస్తుంది కబాట్టి మళ్ళి మళ్ళి వస్తుండాలని కోరుతున్నాను
Post a Comment