Wednesday, August 12, 2015

దత్తపుత్రుడు--1972



సంగీతం::T.చలపతిరావు 
రచన::కోసరాజురాఘవయ్య
గానం::L.R.ఈశ్వరీ,మాధవపెద్దిసత్యం 
తారాగణం::అక్కినేని,వాణిశ్రీ,నాగభూషణం,రామకృష్ణ,పద్మనాభం,కైకాల సత్యనారాయణ,అల్లురామలింగయ్య,వెన్నిరాడైనిర్మల,రమాప్రభ,సూర్యకాంతం. 

పల్లవి::

చూడనీ..బాగా చూడనీ 
నీ సూపుల్లో సూపు కలిపి..సూడనీ
నీ చుక్కలాంటి చక్కదనం..సూడనీ

ఊరుకో..అబ్బ..ఊరుకో..కొంటె మాటల్లో ఏముందో గానీ
వింత చూపుల్లో ఏముందో గానీ..నీ చెయ్యి పైన పడితేనే
సిగ్గు..ముంచుకొస్తోందీ..ఊరుకో..అబ్బ..ఊరుకో

చరణం::1

మబ్బు కోక కట్టుకోని..మల్లెపూలు పెట్టుకోని
లేడి పిల్లలాగ గంతులేస్తుంటే..ఏ..సూపులన్ని నీ మీదే
సుళ్ళు తిరుగుతుంటాయి..తస్సాదియ్యా మళ్ళీ తిరిగి రానీ 
రానంటాయి...సూడని..ఎహా సూడనీ 

సిలిపి సూపు ఇసిరేసి..సిక్కున పెడుతుంటావు
పక్క పక్కగా వచ్చి..పైన పడతనంటావు
కొత్త మోజుగాడివిలే..పొద్దు తెలియకున్నదిలే
ఎళాపాళ లేకుండా..ఏంటయ్యో ఈ సరసం
ఊరుకో...అబ్బ...ఊరుకో

చరణం::2

పెద్దొళ్ళంతా కూడా పెళ్ళికి..సై అన్నారు
మొగుడూ పెళ్ళాలంటూ..ముద్దర కొట్టేశారు
లగా లగ్గీ జగా జగ్గీ..లగా లగ్గీ జగా జగ్గీ 
ఏళాపాళాలేదు..పొద్దాకా యిదే వరస
ఏళాపాళాలేదు..పొద్దాకా యిదే వరస
దగ్గిర దగ్గిర కొస్తుంటే..బెట్టు సేస్తవెందుకే సూడనీ

గుండెలోన వున్నదంత..కుమ్మరించి సెబుతున్నా
తుళ్ళిపడే గుర్రానికి..కళ్ళెం వెయ్యమంటున్నా
అయ్యో..అయ్యో..అయ్యో..ఎట్లా
ఎండాకాల మెళ్ళిపోయి..మూడు ముళ్ళు పడిపోతే..ఓహో
ఎండాకాల మెళ్ళిపోయి..మూడు ముళ్ళు పడిపోతే 
అబ్బులుకీ సుబ్బులుకీ..అడ్డమింక ఏముందీ
వూరుకో...ఇప్పటి కూరుకో                    
సూడనీ..బాగా...సూడనీ
నీ సూపుల్లో సూపు కలిపి సూడనీ
నీ చుక్కలాంటి చక్కదనం చూడనీ..ఊరుకో
చూడనీ..ఊరుకో.చూడనీ..ఊరుకో

Dattaputrudu--1972
Music::T.ChalapatiRaavu 
Lyrics::KosaraajuRaaghavayya
Singer's::L.R.Eswaree,Maadhavapeddisatyam 
Cast::Akkineni,Vaanisree,Naagabhooshanam,Raamakrshna,Padmanaabham,Kaikaala Satyanaaraayana,Alluraamalingayya,Venniraadainirmala,Ramaaprabha,Sooryakaantam. 

:::::

chooDanee..baagaa chooDanee 
nee soopullO soopu kalipi..sooDanee
nee chukkalaanTi chakkadanam..sooDanee

oorukO..abba..oorukO..konTe maaTallO emundO gaanee
vinta choopullO emundO gaanee..nee cheyyi paina paDitene
siggu..munchukostOndee..oorukO..abba..oorukO

::::1

mabbu kOka kaTTukOni..mallepoolu peTTukOni
lEDi pillalaaga gantulestunTe..E..soopulanni nee meede
suLLu tirugutunTaayi..tassaadiyyaa maLLee tirigi raanee 
raananTaayi...sooDani..ehaa sooDanee 

silipi soopu isiresi..sikkuna peDutunTaavu
pakka pakkagaa vachchi..paina paDatananTaavu
kotta mOjugaaDivile..poddu teliyakunnadile
eLaapaaLa lekunDaa..enTayyO ee sarasam
oorukO...abba...oorukO

::::2

peddoLLantaa kooDaa peLLiki..sai annaaru
moguDoo peLLaalanToo..muddara koTTeSaaru
lagaa laggee jagaa jaggee..lagaa laggee jagaa jaggee 
ELaapaaLaaledu..poddaakaa yide varasa
ELaapaaLaaledu..poddaakaa yide varasa
daggira daggira kostunTe..beTTu sestavenduke sooDanee

gunDelOna vunnadanta..kummarinchi sebutunnaa
tuLLipaDe gurraaniki..kaLLem veyyamanTunnaa
ayyO..ayyO..ayyO..eTlaa
enDaakaala meLLipOyi..mooDu muLLu paDipOte..OhO
enDaakaala meLLipOyi..mooDu muLLu paDipOte 
abbulukee subbulukee..aDDaminka Emundee
voorukO...ippaTi koorukO                    
sooDanee..baagaa...sooDanee
nee soopullO soopu kalipi sooDanee
nee chukkalaanTi chakkadanam chooDanee..oorukO
chooDanee..oorukO.chooDanee..oorukO

Tuesday, August 04, 2015

భలే తమ్ముడు--1969



సంగీతం::T.V.రాజు
రచనD.C.నారాయణరెడ్డి
గానం::మొహమ్మద్‌రఫీ,P.సుశీల
తారాగణం::N.T.రామారావు,K.R.విజయ,రేలంగి,రాజనాల,రమాప్రభ,మిక్కిలినేని,ప్రభాకరరెడ్డి 

పల్లవి::

నేడే..ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే 

నేడే..ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే 

చరణం::1
అ హ హా ఆ ఆ ఆ అ హ హా ఆ ఆ ఆ
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ అ

కనులముందున్న..రతనాలమూర్తిని
విలువలెరుగక..విసిరితిని
కనులముందున్న..రతనాలమూర్తిని
విలువలెరుగక..విసిరితిని
కనులు తెరచీ విలువ తెలసీ
కనులు తెరచీ విలువ తెలసీ
మనసే గుడిగా మలచితిని..ఈ   

నేడే..ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే

చరణం::2

మదిలో విరిసే..మమతల మాలలు
చెలిమికి..కానుక చేసెదను
మదిలో విరిసే..మమతల మాలలు
చెలిమికి..కానుక చేసెదను
ఆరని వలపుల హారతి వెలుగుల
ఆరని వలపుల హారతి వెలుగుల
కలకాలం నిను కొలిచెదను 

నేడే..ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే

చరణం::3

అ హ హా ఆఆ ఆ ఆ ఆ
అ హ హా ఆఆ ఆ ఆ ఆ
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆఅ
చిలిపిగ కసిరే..ఏఏఏ
చిలిపిగ కసిరే..చెలియ విసురులో
అలకలు గని నవ్వుకున్నాను..అహాహా
చేతులు సాచీ చెంతకు చేరిన 
చేతులు సాచీ చెంతకు చేరిన
ఆ చెలినే అందుకున్నాను..ఊ 
ఆ చెలినే అందుకున్నాను..ఊఊఉ
నేడే..ఈనాడే
మురిపించె నన్ను..చెలి తానే
నేడే..ఈనాడే
కరుణించె నన్ను చెలికాడే
నేడే..ఈనాడే
మురిపించె నన్ను..చెలి తానే

అ హ హా ఆఆ ఆ ఆ ఆ
అ హ హా ఆఆ ఆ ఆ ఆ
ఒ హొ ఓ ఓ ఒ హొ హో ఒ హో ఓ ఒహోహో

Bhale Tammudu--1969
Music::T.V.Raju
Lyrics::D.C.Narayanareddi
Singer's::P.Suseela,Mohammed Rafi.  
Cast::N.T.Ramarao,K.R.Vijaya,Relangi,Rajanala,Ramaaprabha,Mikkilineni,PrabhakarReddi.

:::::

nEDE..eenaaDE
karuninche nannu chelikaaDe 

naeDe..eenaaDe
karuninche nannu chelikaaDe 

::::1

a ha haa aa aa aa a ha haa aa aa aa
AA AA AA AA AA a

kanulamundunna..ratanaalamoortini
viluvalerugaka..visiritini
kanulamundunna..ratanaalamoortini
viluvalerugaka..visiritini
kanulu terachee viluva telasee
kanulu terachee viluva telasee
manase guDigaa malachitini..ii   

naeDe..eenaaDe
karuninche nannu chelikaaDe

::::2

madilO virise..mamatala maalalu
chelimiki..kaanuka chesedanu
madilO virise..mamatala maalalu
chelimiki..kaanuka chesedanu
aarani valapula haarati velugula
aarani valapula haarati velugula
kalakaalam ninu kolichedanu 

neDe..eenaaDe
karuninche nannu chelikaaDe

::::3

a ha haa aaaaaa aa aa aa
a ha haa aaaaaa aa aa aa
AA AA AA AA AAa
chilipiga kasire..EEE
chilipiga kasire..cheliya visurulO
alakalu gani navvukunnaanu..ahaahaa
chetulu saachee chentaku cherina 
chaetulu saachee chentaku cherina
aa cheline andukunnaanu..uu 
aa cheline andukunnaanu..uuuuu
neDe..eenaaDe
muripinche nannu..cheli taane
neDe..eenaaDe
karuninche nannu chelikaaDe
neDe..eenaaDe
muripinche nannu..cheli taane

a ha haa aaaaaa aa aa aa
a ha haa aaaaaa aa aa aa
o ho O O o ho hO o hO O ohOhO

షావుకారు--1950



సంగీతం::ఘంటసాలవేంకటేశ్వర రావు 
రచన::సముద్రాలరాఘావాచార్య(సీనియర్)  
గానం::P.baశాంతకుమారి,R.బాలసరస్వతిదేవి,బృందం  
తారాగణం:N.T.రామారావు,జానకి, S.V. రంగారావు, రేలంగి,మోపర్రు దాసు,పద్మనాభం, గోవిందరాజుల సుబ్బారావు,వంగర, కనకం,వల్లభజోస్యుల శివరాం, P.శాంతకుమారి

పల్లవి::

దీపావళీ..దీపావళి 
దీపావళీ..దీపావళి
ఇంటింట ఆనంద..దీపావళీ
ఇంటింట ఆనంద..దీపావళీ
మా ఇంట మాణిక్య..కళికావళి
మా ఇంట మాణిక్య..కళికావళి
దీపావళీ..దీపావళి 
దీపావళీ..దీపావళి

చరణం::1

జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు
జిలుగుల వలువల అళ్ళుళ్ళ తళుకు 
కూతుళ్ళ..కులుకు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు
పలుకుల వయ్యారి వదినెల వన్నెలు 
మురిసిపడు..చిన్నెలు
రంగు మతాబుల..శోభావళి
రంగు మతాబుల..శోభావళి

దీపావళీ..దీపావళి
ఇంటింట ఆనంద..దీపావళి
మా ఇంట మాణిక్య..కళికావళి
దీపావళీ..దీపావళి
  
చరణం::2

చిటపట రవ్వల..ముత్యాలు కురియ
చిటపట రవ్వల..ముత్యాలు కురియ 
రత్నాలు..మెరయ
తొలకరి స్నేహాలు..వలుపుల వానగ
తొలకరి స్నేహాలు..వలుపుల 
వానగ కురిసి..సెలయేరుగ
పొంగే ప్రమోద..తరంగావళీ
పొంగే ప్రమోద..తరంగావళి

దీపావళీ..దీపావళి
దీపావళీ..దీపావళి
ఇంటింట ఆనంద..దీపావళీ
ఇంటింట ఆనంద..దీపావళీ
మా ఇంట మాణిక్య..కళికావళీ
మా ఇంట మాణిక్య..కళికావళీ
దీపావళీ..దీపావళి
దీపావళీ..దీపావళి

సి.ఐ.డి.(C.I.D.)--1965



సంగీతం::ఘంటసాలవేంకటేశ్వర రావు
రచన::పింగళినాగేద్రరావు 
గానం::P.సుశీల
తారాగణం::N.T.రామారావు,జమున,గుమ్మడి,పండరీబాయి,రాజనాల,
మిక్కిలినేని,హేమలత,రమణారెడ్డి

పల్లవి::

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే
మనసు నిండిపోయెనే

నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే
మనసు నిండిపోయెనే

చరణం::1 

ఆశాలత మొగ్గలేసి..పూలు విరగపూసెనే
ఆశాలత మొగ్గలేసి..పూలు విరగపూసెనే
తలపులెల్ల వలపులై..పులకరింపజేసెనే
తలపులెల్ల వలపులై..పులకరింపజేసెనే
పరవశించి..పోతినే..ఏఏఏ
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే
మనసు నిండిపోయెనే

చరణం::2

చందమామ నేడేలనో..చలి వెన్నెల కాయడే
చందమామ నేడేలనో..చలి వెన్నెల కాయడే
గాలి కూడా ఎందుకనో..నులి వెచ్చగ వీచెనే
గాలి కూడా ఎందుకనో..నులి వెచ్చగ వీచెనే
మేను..కందిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
కనుల పండువాయెనే
మనసు నిండిపోయెనే
నిను కలిసిన నిముసమున
నిను తెలిసిన క్షణమున
ఆ ఆ ఆ ఆ..ఓ ఓ ఓ ఓ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

C.I.D.--1965
Music::::GhantasalaVenkateswara rao
Lyrics::PingaliNagendra Rao
Sunger::P.Suseela
Cast::N.T.RaamaaRao,Jamuna,Gummadi,PandareeBaayi,Raajanaala,
Mikkilineni,Hemalata,RamanaaReddi

::::

ninu kalisina nimusamuna
ninu telisina kshaNamuna
kanula panDuvaayene
manasu ninDipOyene

ninu kalisina nimusamuna
ninu telisina kshaNamuna
kanula panDuvaayene
manasu ninDipOyene

::::1 

aaSaalata moggalesi..poolu viragapoosene
aaSaalata moggalesi..poolu viragapoosene
talapulella valapulai..pulakarinpajesene
talapulella valapulai..pulakarinpajesene
paravaSinchi..pOtine..EEE

ninu kalisina nimusamuna
ninu telisina kshaNamuna
kanula panDuvaayene
manasu ninDipOyene

::::2

chaNdamaama neDelanO..chali vennela kaayaDe
chaNdamaama neDelanO..chali vennela kaayaDe
gaali kooDaa endukanO..nuli vechchaga veechene
gaali kooDaa endukanO..nuli vechchaga veechene
menu..kandipOyene

ninu kalisina nimusamuna
ninu telisina kshaNamuna
kanula panDuvaayene
manasu ninDipOyene

ninu kalisina nimusamuna
ninu telisina kshaNamuna
aa aa aa aa..O O O O..mm mm mm mm

Sunday, August 02, 2015

నర్తనశాల--1963



సంగీతం::సుసర్ల దక్షణామూర్తి
రచన::సముద్రాల,శ్రీశ్రీ కోసరాజు
గానం::ఘంటసాల గారు
తారాగణం::N.T.రామారావు,సావిత్రి,శోభన్‌బాబు,L.విజయలక్ష్మీ,S.V.రంగారావు.

:::: 

ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు

ఎవ్వాని వాకిట..ఎవరి వాకిట్లో..ఇభ..ఏనుగుల..మద..మద ధారల చేత ఏర్పడిన
పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, 
రజము - ధూళి, రాజి- గుట్ట , అడగు - అణగు (అణిగిపోతుందో)
ఎవ్వాని చారిత్రము - ఎవరి చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై 
గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు
గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవ్వని కడకంట - ఎవరి కను తుదల, నివ్వటిల్లెడు
వ్యాపించే , చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన
సంపదలు- సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవ్వాని గుణలతలు - ఎవరి గుణములనే లతలు, ఏడు వారాశుల 
సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు అంతటా ప్రాకుతున్నాయో
అతడు - ధర్మరాజు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు
కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాజుకు కొడుకైన యుధిష్టిరుడు.
ధర్మరాజు వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.
అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా... కాదు. స్వయానా యమధర్మ రాజు కొడుకు అని అర్థం. అంటే ధర్మానికి ప్రతీకే ధర్మరాజు అని చెప్పడమే.
ఇది తిక్కనగారి పద్యము. ఈ మాట ద్రౌపది భీమార్జునలతో అంటుంది. నర్తనసాల సినిమాలో మాత్రము అర్జునుడు(బృహన్నల) ద్రౌపది, భీముడితో ధర్మరాజు గురించి చెప్పిన పద్యము.

Saturday, August 01, 2015

వసంత గీతం--1984



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామమూర్తి  
గానం::S.P.బాలు,S.జానకి
సినిమా దర్శకత్వం::సింగీతం శ్రీనివాసరావు
తారాగణం::అక్కినేని,రాధ,పండరీబాయి,నాగేష్,శ్రీలక్ష్మీ.

పల్లవి::

ఓ..హోహోహోహో..ఓఓఓ
ఆఆఆ..హాహాహా..ఆఆ
లలలలాలాలలలలలలలలల
లాలాలాలా..ఆఆ

ఊర్వశివో..ఉదయానివో
మువ్వల నవ్వుల మోహినివో

ఊర్వశివో..ఉదయానివో
మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..రసధ్వనివో
బృందావనికే ఆమనివో

ఊర్వశివో..ఉదయానివో
మువ్వల నవ్వుల మోహినివో

చరణం::1

ఆలయఘంటలో లయలో పుట్టిన సంగీతానికి హారతివో
మదనబాణము మదికి ప్రాణమై సాగివచ్చిన ఆరతివో

తూరుపుదిక్కున కుంకుమవీణలు మీటిన సంధ్యభానుడివో 
వెలుగు కావ్యమున బ్రతుకునాట్యమై పరిమళించిన భరతుడివో

కనులు పండే కలవు నీవై కదలిరావే కళవు నీవై
స్వరమూ షుఖమూ జతగా కలిసే నీ పద సన్నిధిలో

ఊర్వశిలా..ఉదయినిలా మువ్వల నవ్వుల మోహినిలా 
ఊర్వశిలా..ఉదయినిలా మువ్వల నవ్వుల మోహినిలా 
కవితలము నా ఎదలో కదిలిక లూరిన ఊపిరివో
ఊర్వశిలా..ఉదయినిలా మువ్వల నవ్వుల మోహినిలా 

చరణం::2

నీ పెదవులనే పదములు కోరిన అష్టపదములలో గోపికనో 
పదముపాదమై నటనవేదమై నీవు పలికిన గీతికనో..ఒ
శిలలధుళిలో శిల్పకాంతలా చిగురువేసిన శైలికవో..ఒ
పిరికి నేలగా భువికి నింగిలా మేనువిరిచినా మేనకవో
జలదరించే జల్దనాదం కదలిరానా నెమలినేనై
రుతులు జతులు సుధలై పొంగే నీ సుధవీక్షణలో

ఊర్వశివో..ఉదయానివో
మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..రసధ్వనివో
బృందావనికే ఆమనివో

ఊర్వశిలా..ఉదయినిలా మువ్వల నవ్వుల మోహినిలా 
కవితలము నా ఎదలో కదిలిక లూరిన ఊపిరివ్

ఊర్వశివో..ఉదయానివో
మువ్వల నవ్వుల మోహినివో

Vasanta Geetam--1984
Music::Chakravarti
Lyrics::Veetuurisundararaamamoorti  
Singer's::S.P.Baalu,S.Jaanaki
Film Directed By::Singeetam SreenivasRao
Cast::Akkineni,Raadha,Pandariibaayi,Naagesh,Sreelakshmii.

:::::::::

O..hOhOhOhO..OOO
AAA..haahaahaa..aaaaaa
lalalalaaalaalalalalalalalalala
laalaalaalaa..aaaaaa

UrvaSivO..udayaanivO
muvvala navvula mOhinivO

UrvaSivO..udayaanivO
muvvala navvula mOhinivO
raagiNivO..rasadhwanivO
bRndaavanikE AmanivO

UrvaSivO..udayaanivO
muvvala navvula mOhinivO

::::1

AlayaghanTalO layalO puTTina sangeetaaniki haarativO
madanabaaNamu madiki praaNamai saagivachchina ArativO

toorupudikkuna kunkumaveeNalu meeTina sandhyabhaanuDivO 
velugu kaavyamuna bratukunaaTyamai parimaLinchina bharatuDivO

kanulu panDE kalavu neevai kadaliraavE kaLavu neevai
swaramuu shukhamuu jatagaa kalisE nee pada sannidhilO

UrvaSilaa..udayinilaa muvvala navvula mOhinilaa 
UrvaSilaa..udayinilaa muvvala navvula mOhinilaa 
kavitalamu naa edalO kadilika loorina UpirivO
UrvaSilaa..udayinilaa muvvala navvula mOhinilaa 

::::2

nee pedavulanE padamulu kOrina ashTapadamulalO gOpikanO 
padamupaadamai naTanavEdamai neevu palikina geetikanO..o
SilaladhuLilO Silpakaantalaa chiguruvEsina SailikavO..o
piriki nElagaa bhuviki ningilaa mEnuvirichinaa mEnakavO
jaladarinchE jaldanaadam kadaliraanaa nemalinEnai
rutulu jatulu sudhalai pongE nee sudhaveekshaNalO

UrvaSivO..udayaanivO
muvvala navvula mOhinivO
raagiNivO..rasadhwanivO
bRndaavanikE AmanivO

UrvaSilaa..udayinilaa muvvala navvula mOhinilaa 
kavitalamu naa edalO kadilika loorina Upiriv

UrvaSivO..udayaanivO
muvvala navvula mOhinivO

Friday, July 31, 2015

విచిత్రకుటుంభం--1969



సంగీతం::T.V.రాజు
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::P.సుశీల
Film Directed By::K.S.prakaasha Rao
తారాగణం::N.T.రామారావి,సావిత్రి,విజయలలిత,జ్యోతిలక్ష్మి,విజయనిర్మల,శోభన్‌బాబు,కృష్ణ,

కాఫీ::రాగం

పల్లవి::

నలుగురు నవ్వేరురా..ఆ..స్వామి
నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..అవ్వ..
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ

చరణం::1

వెన్నచిలికే వేళ..చక్కిలిగిలి చేసి
దండలల్లేవేళ రెండూ..కళ్ళూ మూసి
వెన్నచిలికే వేళ..వెన్నచిలికే వేళ
వెన్నచిలికే వేళ..చక్కిలిగిలి చేసి
దండలల్లేవేళ రెండూ..కళ్ళూ మూసి
ఒంటిగా ఏమన్నా..ఆఆఆ..ఒంటిగ ఏమన్నా
ఓరకుంటినిగాని..రచ్చపట్టున నన్ను
రవ్వచేయు పాడికాదులేరా..ఆఅ

నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..అవ్వ..ఆ ఆ ఆ ఆ
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ 

చరణం::2

పొన్నచెట్టున చేరి..పొంచినటుల కాదు
చీరలను కాజేసి..చేరినటుల కాదు
పొన్నచెట్టున చేరి..పొంచినటుల కాదు
చీరలను కాజేసి..చేరినటుల కాదు
కన్నెమనసే వెన్న..గమనించరా కన్నా
అన్నీ తెలిసిన నీవే..ఆగడాలు చేయనేల ఔనా..ఆ

నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో..నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ
నలుగురు నవ్వేరురా..ఆ..అవ్వ
నలుగురు నవ్వేరురా..ఆ ఆ ఆ ఆ

Vichitrakutumbham--1969
Music::T.V.Raaju 
Lyrics::D.C.Naaraayanareddi
Singer::P.Suseela
Film Directed By::K.S.prakaasha Rao
Cast::N.T.Raamaaraavi,Saavitri,Vijayalalita,Jyotilakshmi,Vijayanirmala,Sobhanbaabu,Krishaa.

kaaphii::raagam

::::::::::::::::::::::::::::::::::::::::

naluguru navvEruraa..aa..swaami
naluguru navvEruraa..gOpaala
naDiveedhilO..naa kaDakongu laagina
naDiveedhilO..naa kaDakongu laagina
naluguru navvEruraa..avva..
naluguru navvEruraa..aa aa aa aa

::::1

vennachilikE vELa..chakkiligili chEsi
danDalallEvELa renDoo..kaLLuu moosi
vennachilikE vELa..vennachilikE vELa
vennachilikE vELa..chakkiligili chEsi
danDalallEvELa renDoo..kaLLuu moosi
onTigaa Emannaa..aaaaaaaa..onTiga Emannaa
OrakunTinigaani..rachchapaTTuna nannu
ravvachEyu paaDikaadulEraa..aaaa

naluguru navvEruraa..gOpaala
naDiveedhilO..naa kaDakongu laagina
naluguru navvEruraa..avva..aa aa aa aa
naluguru navvEruraa..aa aa aa aa 

::::2

ponnacheTTuna chEri..ponchinaTula kaadu
cheeralanu kaajEsi..chErinaTula kaadu
ponnacheTTuna chEri..ponchinaTula kaadu
cheeralanu kaajEsi..chErinaTula kaadu
kannemanasE venna..gamanincharaa kannaa
annii telisina neevE..AgaDaalu chEyanEla ounaa..aa

naluguru navvEruraa..gOpaala
naDiveedhilO..naa kaDakongu laagina
naluguru navvEruraa..aa aa aa aa
naluguru navvEruraa..aa..avva
naluguru navvEruraa..aa aa aa aa

జగదేకవీరుని కథ--1962 ::కాఫీ::రాగం



సంగీతం::పెండ్యాలనాగేశ్వరరావు
రచన::పింగళి నాగేంద్రరావు
గానం::P.లీల,P.సుశీల
Film Directed by::Kadiri Venkata Reddy
తారాగణం::N.T.రామారావు,రాజనాల,C.S.R.ఆంజనేయులురేలంగి,ముక్కామల,మిక్కిలినేని,నల్లరామమూర్తి,B.సరోజ,కన్నాంబ,జయంతిL.విజయలక్ష్మి,బాల,ౠష్యంద్రమణి,గిరిజ.

కాఫీ::రాగం 

పల్లవి::


ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా..ఆఆ

కలుగునే నీవంటి సాద్వి..అత్తగామాకూ..ఊఊఉ
తొలిమేము జేసిన పుణ్యమునగాక..ఆఆఆఅ

ఆ..మందారమాలతీపారిజాతలతో..ఓఓఓఓఓఓఓ
అందముగ ముడివేసి..అలరజేసేమూ..ఊఊఊ

ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా..ఆఆ

మనసు చల్లనకాగ..మంచి గంధముపూసీ..ఈఈఇ
మా ముచ్చటలు తీర్ప..మనవి చేసేమూ..ఊ
ఆఆ..పారాణి వెలయించీ..పాదపూజను జేసీ..ఈఈఈ
కోరికలు తీరునని..పొంగిపోయేమూ..ఊఊఊఊఊ

ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
సేవాలంది మాకు వరమూలియవమ్మా
ఆదిలక్ష్మి వంటి అత్తాగారివమ్మా..ఆఆ 

Jagadekaveerunu Katha--1961
Music::Pendyaalanaageswararaavu
rachana::Pingali Naagendraraavu
gaanam::P.leela,P.Suseela
Film Directed by::Kadiri Venkata Reddy
Cast::N.T.Raamaaraavu,Raajanaala,C.S.R.AnjanEyulu,Relangi,Mukkaamala,Mikkilineni,Nallaraamamoorti,B.Saroja,Kannaamba,Jayanti,L.Vijayalakshmi,Baala,Rushyndramani,Girija.

:::::::::::::::::::::::::::::::::::::::::::

Adilakshmi vanTi attaagaarivammaa
Adilakshmi vanTi attaagaarivammaa
sEvaalandi maaku varamooliyavammaa
sEvaalandi maaku varamooliyavammaa
Adilakshmi vanTi attaagaarivammaa..aaaaa

kalugunE neevanTi saadwi..attagaamaakoo..uuuuu
tolimEmu jEsina puNyamunagaaka..aaaaaaaaaa

aa..mandaaramaalatiipaarijaatalatO..OOOOOOO
andamuga muDivEsi..alarajEsEmoo..uuuuuu

Adilakshmi vanTi attaagaarivammaa
sEvaalandi maaku varamooliyavammaa
Adilakshmi vanTi attaagaarivammaa..aaaaa

manasu challanakaaga..manchi gandhamupoosii..iiiii
maa muchchaTalu teerpa..manavi chEsEmoo..uu
AA..paaraaNi velayinchii..paadapoojanu jEsii..iiiiii
kOrikalu teerunani..pongipOyEmoo..oooooooooo

Adilakshmi vanTi attaagaarivammaa
sEvaalandi maaku varamooliyavammaa
sEvaalandi maaku varamooliyavammaa
Adilakshmi vanTi attaagaarivammaa..aaaaa 

కన్నతల్లి--1972



సంగీతం::K.V.మహాదేవన్ 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::J.V.రాఘవులు,P.సుశీల 
తారాగణం::శోభన్‌బాబు,సావిత్రి,చంద్రకళ,నాగభూషణం,రాజబాబు,సంధ్యారాణి,M.ప్రభాకర్‌రెడ్డి 

పల్లవి::

వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూంది
వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూంది

చరణం::1

నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ 
నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ 
అల్లరల్లరిగ తిరగాలంటే సరదాగుంటుందీ
హద్దులన్నా పెద్దలన్న కోపంవస్తుందీ
పైట నిలవదూ పక్క కుదరదూ
పగలు తరగదూ రాత్రిగడవదూ
ఏదో గుబులుగుబులుగా వుందీ
ఎదలో గుబగుబమంటుందీ
వచ్చిందమ్మా దోరదోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుందీ
లోపల తికమక పెడుతూందీ

చరణం::2

ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ
ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ
కళ్ళుకలిస్తే గుండె ఎందుకో ఝల్లుమంటుందీ
నీ కౌగిలిలోనా కన్నెతనం కరిగేపోతుందీ
నినుమెచ్చాను మనసిచ్చాను
నిలువున దోచి నీకే యిచ్చాను
ఏదో హాయిహాయిగా వుందీ
ఎక్కడికో తేలితేలి పోతుందీ
హాయిహాయిగా..వుందీ 
తేలితేలి....పోతుందీ
వచ్చిందమ్మా దోరదోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు 
పెద్దలులేక హద్దులు తెలియక
చిందరవందర అయింది బ్రతుకు
అమ్మా...అమ్మా...అమ్మా

Thursday, July 30, 2015

పల్నాటి పౌరుషం--1994



సంగీతం::A.R.రెహమాన్
రచన::శివగణేష్ 
గానం::మనో,సుజాత.
తారాగణం::కృష్ణంరాజు,రాధిక,చరణ్‌రాజ్,బ్రహ్మానందం. 

పల్లవి::

మేనత్త కూతిరివే మెరుపంటి మరదలివే
మదిలోన మదనుడికే మరుమల్లె జాతరవే
పొట్టిజల్ల పాలపిట్ట పైటకొచ్చెనెప్పుడంట
చిన్ని చిన్ని చంద్రవంక పున్నమెప్పుడయ్యెనంట
నీ మాట మూగబోతె నా మనసు ఆగెదెట్టా..ఆ

రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా
రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా..ఆ
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపించే

రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా

చరణం::1

కంటికీ కునుకే రాదాయే
నోటికీ మెతుకే చేదాయే
ఒంటిలో తాపం ఏదో మొదలాయే..ఏ
ఎక్కడో కాకులు కూస్తున్నా
ఎవ్వరో తలుపులు తీస్తున్నా
నువ్వనే వెతికే గుండెకి గుబులాయే..ఏ
నావకడ గట్టిగ అరిచానూ
బావ సడి గుట్టుగ అడిగానూ
గాలితో కబురులు పంపానూ
మబ్బుతో మనసులు తెలిపానూ
దేనికీ బాదులే రాకా కుదురే లేకా కన్నీరొలికానూ
ముద్దుల బావా నన్నిక ఇడిసి పోవద్దూ
ఈ మరదలి ప్రాణం నీపై ఉందని మరవద్దూ

రాగాల సిలకా రంగేలి మొలకా..ఆ
రాయంచ నడకా రాబ్యాకు తళుకా..ఆ

చరణం::2


కళ్ళలో కలతలు తీరేనా
కాళ్ళపై వాతలు మాసేనా
రాళ్ళపై రాసిన రాతలు గురుతేనా
దాగనీ సొగసులు పొంగేనా
దాగినా దారులు తెరిచేనా
కొంగులో కోలాటాలే కోరేనా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ఆశగా ఆరా తీస్తున్నా అందమే ఆరాధిస్తున్నా
ముందుగా బంధం వేసిన హృదయం లోనికి విందుకు వస్తున్నా
మరదలు పిల్లా నిన్నిక విడిచీ వెళ్ళనులే
మన పెళ్ళికి లగ్గం దగ్గరిలోనే ఉన్నదిలే

రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా
ఎదలోన ఎలుగునీడలా ఎదుట ఎవరు ఇది
ఎంకి పాటలా జాలువారుతున్న జాబిలంటి జాణతనమా
జారు పైట వేసుకున్న జానపదమా
రాగాలేవో నీలో నాలో వినిపించే
అనురాగాలేగా నిన్నూ నన్నూ కనిపించే
రాగాల సిలకా రంగేలి మొలకా
రాయంచ నడకా రాబ్యాకు తళుకా