Monday, December 26, 2011

ముత్యమంతాముద్దు--1989



సంగీతం::హంసలేఖ
రచన::వేటూరి
గానం::S.P.బాలు 
తారాగణం::రాజేంద్రప్రసాద్,సీత,

పల్లవి::

ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
నీ అందమే నాకు ఆలాపనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

చరణం::1

చిరునవ్వే చేమంతిగా విరజల్లే హేమంతమా
మునుపెరుగని ఏ బంధాలో ముడుపులు ఇచ్చావు
బాలా..శృంగార..మాలా
అరవిచ్చే అందాలతో మనసిచ్చే మందారమా
కలలను పరచీ హృదయాన్నే కలవర పరచావూ
భామా..రాశాడే బ్రహ్మా..నీ కోసమే తీపి ఆవేదనా
ఐ లవ్ యు ,ఐ లవ్ యు, ఐ లవ్ యు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా

చరణం::2

హరివిల్లు అందాలతో ఎదురొచ్చే ఆకాశమా
తొలకరి జల్లే గుండెల్లో అలజడి పెంచావూ
ప్రేమే నాకున్న ధీమా..ఆ
రవివర్మ చిత్రానివో నవ హంపీ శిల్పానివో
మదనుడు వేసే బాణంలా మనసును గిచ్చావూ
గుమ్మా..ఓ బాపు బొమ్మా..ఈ గీతమే నీకు ఆరాధనా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..అందమా
తెలుగింటీ దీపమా వెలుగింటి రూపమా నేనంటే కోపమా
ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు

Sunday, December 25, 2011

ముత్యమంతాముద్దు--1989

ముత్యమంతాముద్దు--1989

కార్తీక దీపం--1979






సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి 
గానం::S.P.బాలు, S.జానకి

పల్లవి::

చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
చిరునవ్వు చిలికించవే..నీ లేత సింగారమొలికించవే
నీ లేత సింగార మొలికించవే..

గోరొంక కూసింది..గోరింట పూసింది..
గోరొంక కూసింది..గోరింట పూసింది
ముత్యాల మనసీయ్యరా..నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా

చరణం::1

పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ
ఆ ఆ హా..హ..హా..ఆ..హ..
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ..
ఈ సిగ్గు బరువు నేనోపలేను..ఈ సిగ్గు బరువు నేనోపలేను
నీ కంటి పాపలో దాచుకో నన్నూ..దాచుకో నన్నూ

చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
ముత్యాల మనసీయ్యరా..నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా

చరణం::2

కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ
ఆ ఆ..హా..హ..హా..ఆ..హ..
కొండ వాగుదూకితే తెలిసిందీ..కోడె వయసు పొంగిందనీ
ఈ వయసు హోరు నేనాపలేను..ఈ వయసు హోరు నేనాపలేను
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ..దోచుకో నన్నూ

చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
గోరొంక కూసింది..గోరింట పూసింది
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా

కిరాయి కోటిగాడు--1983









సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి 
గానం::S.P.బాలు, p.సుశీల
నటీ,నటులు::కృష్ణ..శ్రీదేవీ 

పల్లవి:

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ఆ ఆ ఆ ఆ 
నమస్తే సుస్వాగతం..సమస్తం నీ అధీనం
అజంతా అందాలు..ఎల్లోర శిల్పాలు ఇస్తున్నా అంకితం
ఇదే ఇదే ఇదే..నా ఆహ్వానం

ఆఆఆఆఆఆఆఆఆఆఆఆ ఆ ఆ ఆ ఆ..ఓహో
నమస్తే ఓ సుందరి..క్షమిస్తా నీ అల్లరి
నీలోనీ అందాలు..అవి తీసే రాగాలు ఇస్తుంటే అంకితం
అదే కదా..సదా నీ అభిమానం

చరణం::1

పెళ్ళిపెద్దగారు లగ్గమేదో పెట్టి వస్తుంటే
ఖద్దరంచు పంచ..కండువాల ఠీవి చూస్తుంటే
పెళ్ళికానిపిల్ల తుళ్ళి తుళ్ళి మీదికొస్తుంటే
కళ్ళు పడ్డ చోట..గళ్ళు పడ్డ కోక చూస్తుంటే

తెల్ల మబ్బు గొడుగేస్తుంటే
ఆ ఆ..పిల్లగాలి మనసిస్తుంటే 
సిరిమల్లి చిరునవ్వులే..ఏ..చినదాని సిగపువ్వులై..ఈ
ఘుమా ఘుమా ఘుమా..విరిసే నా కోసం
నమస్తే..హ్హ..సుస్వాగతం..సమస్తం..హ్హ..నీ అధీనం 

చరణం::2 

ఒంపుకొక్క సొంపు వంతెనేసుకున్న అందాలే
వాలు పొద్దుకాడ లేత ముద్దులిస్తే..అందాలే
మల్లెచెండులోన మంచుతేనే పిండు చిన్నోడే
దోరనవ్వులిచ్చి దొండపండు దోచుకున్నాడే
చీకటమ్మ చిటికెస్తుంటే..

ఆ ఆ ఆ..ఆకలమ్మ అడిగేస్తుంటే
హే..మన పల్లే కలిపిందిలే..వలపల్లే మన జంటనే
ఇదే కదా..కలుసుకున్న అనుబంధం

నమస్తే..హ్హా..ఓ సుందరి..క్షమిస్తా..హ్హా..నీ అల్లరి 
అజంతా అందాలు..ఎల్లోర శిల్పాలు..ఇస్తున్నా అంకితం
అదే కదా..సదా నీ అభిమానం

Friday, December 23, 2011

శభాష్ రాముడు--1959



ఈ పాట ఇక్కడ వినండి..సుశీలమ్మగారి మెలోడి సాగ్

సంగీతము::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::P.సుశీల

పల్లవి::

రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా..ఆ.
హాయిగ నిదురించరా
రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా
హాయిగ నిదురించరా

చరణం::1

వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచే
వెల్లి విరిసీ వెన్నెల్లు కాసి
చల్లని చిరుగాలి మెల్లంగా వీచే

స్వప్నాల లోన స్వర్గాలు కంటూ
స్వర్గాలలోన దేవ గానాలు వింటూ
హాయిగ నీవింక నిదురించవోయి

రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా
హాయిగ నిదురించరా

చరణం::2

చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చీకటి వెంటా వెలుగే రాదా
కష్టసుఖాలు ఇంతే కాదా
చింతా వంతా నీకేలనోయి
అంతా జయమౌను శాంతించవోయి
హాయిగ నీవింక నిదురించవోయి

రేయి మించెనోయి రాజా
హాయిగ నిదురించరా
హాయిగ నిదురించరా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

దేవుడమ్మ--1973

















ఈ పాట ఇక్కడ వినండి


సంగీతం::సత్యం
రచన::రాజశ్రీ
గానం::S.P.బాలు


ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ............
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ............

ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు..సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఉ....

లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
లేనిపోని భ్రమలెన్నో కలిగిస్తావు..మమ్ము తోలుబొమ్మలను చేసి ఆడిస్తావు
అంతా మా సొంతమని అనిపిస్తావు ..
అంతలోనే మూడునాళ్ళ ముచ్చటగా..హ హ హ..చేసేస్తావు..సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు
చిత్రమైన గారడి చేస్తున్నావు..తమాష చూస్తున్నావు … సామీ …
ఎక్కడో దూరాన కూర్చున్నావు

పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
పెరుగుతుంది వయసనీ అనుకుంటాము..కాని తరుగుతుంది ఆయువని తెలుసుకోము
కళ్ళు తెరిచి నిజమేదో తెలిసే లోగా
మా కళ్ళముందు మాయతెరలు..కప్పేస్తావు … సామీ
ఎక్కడో దూరాన కూర్చున్నావు..ఎక్కడో దూరాన కూర్చున్నావు
ఎక్కడో దూరాన కూర్చున్నావు..సామీ..ఎక్కడో దూరాన కూర్చున్నావు

Thursday, December 22, 2011

కిలాడి బుల్లోడు--1972




సంగీతం::T.చలపతి్‌రావ్
సంగీతం::సినారె
గానం::S.P.బాలు,P.సుశీల

Film Directed By Ravi Raja Pinisetty 

పల్లవి::

ఓ మై లవ్లీ డార్లింగ్
లెట్ మీ టెల్ యు సమ్ ధింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్
లెట్ మీ టెల్ యు సమ్ ధింగ్
..ఊ..ఊ..

నీ బుగ్గలలో నిగనిగలాడే..సిగ్గుమొగ్గలే..బ్లూమింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్
లెట్ మీ టెల్ యు సమ్ ధింగ్
..ఊ..ఊ..
నీ కన్నులలో తళతళగాడే చిలిపి తలపులే..చామింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్

చరణం::1

మురిపించే నీ అందం..వేసిందీ తొలిబంధం
పిలుపులలో తీయదనం..చిలికిందీ మకరందం
ఆశలు పొంగే ఈ సమయంలో..నీ చిరునవ్వే..ఎగ్జైటింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్
లెట్ మీ టెల్ యు సమ్ ధింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్

చరణం::2

లా..లా..లా..లా..
ఆహ..ఆహ..ఆహ..ఆహ..
లా..లా..లా..లా..
ఆహ..ఆహ..ఆహ..ఆహ..

విరబూసే విరజాజి..తెలిపిందీ సందేశం
అందుకనే తుమ్మెదలో..కలిగిందీ ఆవేశం
జీవితమంతా చెరిగిపోనిదీ.. మధురమైనదీ..మీటింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్
లెట్ మీ టెల్ యు సమ్ ధింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్

చరణం::3

అదిగదిగో ఆకాశాం::వాలిందీ మనకోసం
కొండలలో కోనలలో..నిండిందీ అనురాగం
నీవు నేను కలిసినవేళా..నిముష నిముషమూ..ధ్రిల్లింగ్

ఓ మై లవ్లీ డార్లింగ్
లెట్ మీ టెల్ యు సమ్ ధింగ్
ఓ మై లవ్లీ డార్లింగ్

Monday, December 19, 2011

మేఘసందేశం--1982::కాఫీ::రాగం




సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి
గానం::K.J.ఏసుదాస్ 

Film Directed By::DasariNarayana Rao
అక్కినేని నాగేశ్వరరావు,కొంగర జగ్గయ్య,
బాలమురళికృష్ణ,జయసుధ,జయప్రద,
సుభాషిని,సలీమ. 

పల్లవి:: 

కాఫీ::రాగం 

( పీలూ హిందుస్తానీ~కాఫీ కర్ణాటక దేవగాంధారి)

నవరససుమమాలికా..నా జీవనాధార నవరాగ మాలికా
నవరససుమమాలికా..
సని సరి గరి సరి మపని పనిస గరి
గరి సనిద దని దపమ గరి నిసగ
నవరససుమమాలికా..
సగమ గమప గమ గప మగసగ సని
పనిసగ సగమ గమప నిని పమప

త్యాగయ్య..క్షేత్రయ్య..అన్నమయ్య తెలుగింటిలోన వెలిగించిన
తెలుగింటిలోన వెలిగించిన..నాదసుధామయ..రసగీతికా
నవరససుమమాలికా..

చరణం::1

అందాలు అలలైన మందాకినీ..మందార మకరంద రసవాహినీ
ఆమె చరణాలు అరుణకిరణాలు..ఆమె నయనాలు నీల గగనాలు
ఆ జవ్వనాలు నా జన్మకు దొరికిన..నైరుతి ఋతుపవనాలు
ఆ చిరునవ్వు లేత నెలవంక..
ఆ చిరునవ్వు లేత నెలవంక..దిగివచ్చెనేమో ఇలవంక!

నవరససుమమాలికా..నవరససుమమాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరససుమమాలికా..నవరససుమమాలికా.

చరణం::2

శృంగార రసరాజ కల్లోలినీ..కార్తీకపూర్ణేందు కలహారిణి
ఆమె అధరాలు ప్రణయమధురాలు..ఆమె చలనాలు శిల్పగమనాలు
ఆ దర్శనాలు నా జన్మకు..మిగిలిన సుందర సుఖ తరుణాలు
ఆ కనుచూపు నాకు కడదాక..
ఆ కనుచూపు నాకు కడదాక..పిలుపైన లేని ప్రియలేఖ!

నవరససుమమాలికా..నవరససుమమాలికా
నా జీవనాధార నవరాగ మాలికా
నవరససుమమాలికా..నవరససుమమాలికా.


Megha Sandesam::1982
Music::Ramesh Nayudu
Lyrics::VeturiSundararaammoorti
Singer::K.J.Yesudas
Film Directed By::DasariNarayana Rao
Cast::AkkinEni NaageswaraRao,Konkara Jaggayya,
Baalamuralikrshna,Jayasudha,Jayaprada,Subhaasini,Saleema.

::::::::::::::::::::::::::::::

navarasasumamaalikaa..naa jeevanaadhaara navaraaga maalikaa
navarasasumamaalikaa..

sani sari gari sari mapani panisa gari
gari sanida dani dapama gari nisaga
navarasasumamaalikaa..
sagama gamapa gama gapa magasaga sani 
panisaga sagama gamapa nini pamapa

tyaagayya..kshEtrayya..annamayya teluginTilOna veliginchina
teluginTilOna veliginchina..naadasudhaamaya..rasageetikaa
navarasasumamaalikaa..

::::1

andaalu alalaina mandaakinii..mandaara makaranda rasavaahinii
Ame charaNaalu aruNakiraNaalu..Ame nayanaalu neela gaganaalu
aa javvanaalu naa janmaku dorikina..nairuti Rtupavanaalu
aa chirunavvu lEta nelavanka..
aa chirunavvu lEta nelavanka..digivachchenEmO ilavanka! 

navarasasumamaalikaa..navarasasumamaalikaa
naa jeevanaadhaara navaraaga maalikaa
navarasasumamaalikaa..navarasasumamaalikaa.

::::2

SRngaara rasaraaja kallOlinii..kaarteekapoorNEndu kalahaariNi 
Ame adharaalu praNayamadhuraalu..Ame chalanaalu Silpagamanaalu
aa darSanaalu naa janmaku..migilina sundara sukha taruNaalu
aa kanuchoopu naaku kaDadaaka..
aa kanuchoopu naaku kaDadaaka..pilupaina lEni priyalEkha!

navarasasumamaalikaa..navarasasumamaalikaa
naa jeevanaadhaara navaraaga maalikaa

navarasasumamaalikaa..navarasasumamaalikaa. 

నమ్మినబంటు--1960








సంగీతం::S. రాజేశ్వరరావు 
రచన::కోసరాజు
గానం::జిక్కి అండ్‌ పార్టీ

పల్లవి::

లక్ష్మి::ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ 
తెల తెలవారెను లేవండమ్మా 
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా..ఆఆఆఆఆఆ
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

ఏ..కామాక్షీ ..ఓ..మీనాక్షీ 
ఓ..విశాలాక్షీ..ఓఓఓఓఓఓఓ 

ముద్దులు జిలికే ముచ్చట గొలిపే
ముగ్గులు తీరిచి దిద్దండమ్మా
ముద్దులు జిలికే ముచ్చట గొలిపే
ముగ్గులు తీరిచి దిద్దండమ్మా
చేయి దిరిగిన ఈ విద్యల్లో మన స్త్రీజాతికి సరి ఎవరమ్మా 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

చరణం::1

ఓఓఓఓఓఓఓఓఓఓఓ..ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ

రెక్కలు తటతట కొట్టుచు కొళ్ళూ
'కొక్కొరొకొ' యని కూసినవి...
రెక్కలు తటతట కొట్టుచు కొళ్ళూ
'కొక్కొరొకొ' యని కూసినవి...
అంబా అంటూ తల్లిపాలకై ఆవుదూడలల్లాడు చున్నవి 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

చరణం::2

హరి! హరిలోరంగ ! హరే - హరే హరేలోరంగ హరే హరే
హరి! హరిలోరంగ ! హరే - హరే హరేలోరంగ హరే హరే
అందెలు మోయగా..బిందెలతో నీలాటి రేవునకు తరాలండి
నీలాటి రేవునకు తరాలండి...
అందెలు మోయగా..బిందెలతో నీలాటి రేవునకు తరాలండి
 నీలాటి రేవునకు తరాలండి...
పందెం వేసి నేనూ..నేనని..పనిపాటలకై మరలండి 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా

చరణం::3

ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
తూరుపు దిక్కున బాల సూర్యుడు తొంగి తొంగి చూసేనమ్మ 
దొంగచూపు చూసేనమ్మా
తూరుపు దిక్కున బాల సూర్యుడు తొంగి తొంగి చూసేనమ్మ 
దొంగచూపు చూసేనమ్మా! కలవరపాటున దాగియున్న
ఆ కథయేమో అడగండమ్మా 

తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
అ అ అ ఆఆఆఅ 
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా