సంగీతం::సత్యం
రచన::మైలవరపు గోపి
గానం::S.P.బాలు, S.జానకి
పల్లవి::
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
చిరునవ్వు చిలికించవే..నీ లేత సింగారమొలికించవే
నీ లేత సింగార మొలికించవే..
గోరొంక కూసింది..గోరింట పూసింది..
గోరొంక కూసింది..గోరింట పూసింది
ముత్యాల మనసీయ్యరా..నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
చరణం::1
పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ
ఆ ఆ హా..హ..హా..ఆ..హ..
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ..
ఈ సిగ్గు బరువు నేనోపలేను..ఈ సిగ్గు బరువు నేనోపలేను
నీ కంటి పాపలో దాచుకో నన్నూ..దాచుకో నన్నూ
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
ముత్యాల మనసీయ్యరా..నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
చరణం::2
కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ
ఆ ఆ..హా..హ..హా..ఆ..హ..
కొండ వాగుదూకితే తెలిసిందీ..కోడె వయసు పొంగిందనీ
ఈ వయసు హోరు నేనాపలేను..ఈ వయసు హోరు నేనాపలేను
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ..దోచుకో నన్నూ
చిలకమ్మ పలికింది..చిగురాకు కులికింది
గోరొంక కూసింది..గోరింట పూసింది
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా
No comments:
Post a Comment