సంగీతం::S. రాజేశ్వరరావు
రచన::కోసరాజు
గానం::జిక్కి అండ్ పార్టీ
పల్లవి::
లక్ష్మి::ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
తెల తెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా..ఆఆఆఆఆఆ
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
ఏ..కామాక్షీ ..ఓ..మీనాక్షీ
ఓ..విశాలాక్షీ..ఓఓఓఓఓఓఓ
ముద్దులు జిలికే ముచ్చట గొలిపే
ముగ్గులు తీరిచి దిద్దండమ్మా
ముద్దులు జిలికే ముచ్చట గొలిపే
ముగ్గులు తీరిచి దిద్దండమ్మా
చేయి దిరిగిన ఈ విద్యల్లో మన స్త్రీజాతికి సరి ఎవరమ్మా
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చరణం::1
ఓఓఓఓఓఓఓఓఓఓఓ..ఓ..ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
రెక్కలు తటతట కొట్టుచు కొళ్ళూ
'కొక్కొరొకొ' యని కూసినవి...
రెక్కలు తటతట కొట్టుచు కొళ్ళూ
'కొక్కొరొకొ' యని కూసినవి...
అంబా అంటూ తల్లిపాలకై ఆవుదూడలల్లాడు చున్నవి
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చరణం::2
హరి! హరిలోరంగ ! హరే - హరే హరేలోరంగ హరే హరే
హరి! హరిలోరంగ ! హరే - హరే హరేలోరంగ హరే హరే
అందెలు మోయగా..బిందెలతో నీలాటి రేవునకు తరాలండి
నీలాటి రేవునకు తరాలండి...
అందెలు మోయగా..బిందెలతో నీలాటి రేవునకు తరాలండి
నీలాటి రేవునకు తరాలండి...
పందెం వేసి నేనూ..నేనని..పనిపాటలకై మరలండి
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చరణం::3
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ
తూరుపు దిక్కున బాల సూర్యుడు తొంగి తొంగి చూసేనమ్మ
దొంగచూపు చూసేనమ్మా
తూరుపు దిక్కున బాల సూర్యుడు తొంగి తొంగి చూసేనమ్మ
దొంగచూపు చూసేనమ్మా! కలవరపాటున దాగియున్న
ఆ కథయేమో అడగండమ్మా
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
అ అ అ ఆఆఆఅ
తెలతెలవారెను లేవండమ్మా
చెలియల్లారా రారండమ్మా
చెలియల్లారా రారండమ్మా
No comments:
Post a Comment