Tuesday, August 21, 2007
ఘర్షణ--1998
సంగీతం::ఇళయరాజ
గానం::వాణీజయరాం
దర్శకత్వం::మణిరత్నం
నటీ నటులు::ప్రభు,కార్తీక్,అమల,నిరోష.
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే
ఊసులాడు నాకళ్ళు,నీకు నేడు సంకెళ్ళు
పాలపొంగు చెక్కిళ్ళు,వేసె పూలపందిళ్ళు
లవ్ లవ్ ఈ కథ,ఒహో మన్మధ
మైకం సాగనీ,దాహం తీరని
మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయెనే
నేడు పువ్వాయెనే,తోడుకల్లాడెనే
సందేళ వయసెందుకో చిందులేస్తున్నది
అందాల సొగసేమితో అందుకోమన్నది
క్షణంక్షణం ఇలాగే,వరాలు కోరుతున్నది చిన్నది
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే
ముద్దుమురిపాలలో సద్దులే చేసుకో
వేడి పరువాలలో పండగే చేసుకో
నా చూపులో ఉన్నవి కొత్త కవ్వింతలు
నా నవ్వులో ఉన్నవి కోటి కేరింతలు
ఇవే ఇవే ఇవేళ సుఖాలపూల వేడుక..వేడుక
రోజాలో లేతవన్నెలే రాజాకే తేనెవిందులే
ఊసులాడు నాకళ్ళు,నీకు నేడు సంకెళ్ళు
పాలపొంగు చెక్కిళ్ళు,వేసె పూలపందిళ్ళు
లవ్ లవ్ ఈ కథ,ఒహో మన్మధ
Labels:
ఘర్షణ--1988
ఘర్షణ--1998
సంగీతం::ఇళయరాజ
గానం::SP.బాలు
దర్శకత్వం::మణిరత్నం
నటీ నటులు::ప్రభు,కార్తీక్,అమల,నిరోష.
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా
కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
ఎదురూ లేదు బెదురూ లేదు ,లేదు నాకు పోటి
లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి
ఎదురూ లేదు బెదురూ లేదు ,లేదు నాకు పోటి
లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి
ఆడి పాడేనులే అంతు చూసేనులే
చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు
ఉన్నది ఒకటే ఉల్లాసమే
చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు
ఉన్నది ఒకటే ఉల్లాసమే
నింగీ నేల నేరు నిప్పు గాలి ధూలి నాకే తోడు
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా
కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
రైకా కోకా రెండూ లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది
రైకా కోకా రెండూ లేవు అయినా అందం ఉంది
మనసు మంచి రెండూ లేవు అయినా పరువం ఉంది
కలలూరించెనే కథలూరించెనే
కళ్ళు వలవేసెనే ఒళ్ళు మరిచేనులే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
రచ్చకు ఎక్కే రాచిలుకలే
వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
రచ్చకు ఎక్కే రాచిలుకలే
నింగీ నేల నేరు నిప్పు గాలి ధూలి నాకే తోడు
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా
నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా
కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా
రాజా రాజాధి రాజాధి రాజా
పూజ చెయ్యాలి కుర్రకారు పూజ
Labels:
ఘర్షణ--1988
ఘర్షణ--1998
సంగీతం::ఇళయరాజ
గానం::వాణీజయరాం
దర్శకత్వం::మణిరత్నం
నటీ నటులు::ప్రభు,కార్తీక్,అమల,నిరోష.
ఒక బృందావనం సోయగం
ఎద కోలాహలం క్షణక్షణం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
నే సందెవేళ జాబిలి నా గీత మాల ఆమని
నా పలుకు తేనె కవితలే నా పిలుపు చిలక పలుకులే
నే కన్న కలల నీడ నందనం
నాలోని వయసు ముగ్ధ మోహనం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
నే మనసు పాడిన వెంటనే ఓ ఇంధ్రధనుసు పొంగునే
ఈ వెండి మేఘమాలనే నా పట్టు పరుపు చెయనే
నే సాగు బాట జాజి పూవులే
నాకింక సాటి పోటి లేదులే
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
ఒకే స్వరం సాగేను తీయగ
ఒకే సుఖం విరిసేను హాయిగ
ఒక బృందావనం సోయగం
Labels:
ఘర్షణ--1988
ఘర్షణ--1988~~రాగం:::మోహన:::
సంగీతం::ఇళయరాజ
గానం::చిత్ర
దర్శకత్వం::మణిరత్నం
నటీ నటులు::ప్రభు,కార్తీక్,అమల,నిరోష.
రాగం:::మోహన:::
నిన్నుకోరి వర్ణం వర్ణం
సరి సరి కలిసే నీ నయనం నయనం
వురికిన వాగల్లే తొలకరి కవితల్లే
తలపులు కదిలేనే చెలిమది విరిసేనే
రవికుల రఘురామ అనుదినము
!! నిన్ను కోరి !!
వుడికించే చిలకమ్మ నిన్నూరించే
వొలికించే అందాలే ఆలాపంచే
ముత్యాలా బంధాలే నీకందించే
అచట్లు ముచట్లు తానాలకించే
మోజుల్లోన చిన్నది నీవే తాను అన్నది
కల్లలే విందు చేసనే నీతో పొందు కోరనే
వుండాలనీ నీ తోడు చేరిందిలే ఈనాడు సరసకు
!! నిన్ను కోరి !!
ఈ వీణ మీటేది నీవే నంట
నా తలపూ నా వలపు నీదే నంట
పరువాల పరదాలు తీసేపూట
కలవాలి కరగాలి నీలో నంట
పలికించాలి స్వాగతం పండించాలి జీవితం
నీకు నాకు ఈ క్షణం కానీరాగ సంగమం
నీ జ్ఞపకం నా లోనే సాగేనులే ఇవేళ సరసకు
!! నిన్ను కోరి !!
Labels:
ఘర్షణ--1988
ఘర్షణ--1988::రాగం:అమౄత వర్షిణి
గానం::వాణిజయరం
సంగీతం::ఇళయరాజ
రాగం::అమౄత వర్షిణి
కర్నాటక హిందుస్తాని
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శౄంగార మునకీవె శ్రీకారమే కావె
ఆకుల పై రాలు ఆ..
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
నా చెలి వొడిలోన పవళించనా
రాతిరి పగలు మురిపాలు పండించు
చెలికాడిని ఎద చేర్చి లాలించనా
నేను నీకు రాగ తాళం
నీవు నాకు వేద నాదం ఆ..
కన్నుల కదలాడు ఆశలు శౄతి పాడు
వన్నెల మురిపాల కధ యేమిటో
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
ఊహలు పలికించు కలలేమిటో
పెదవుల తెరలోన మధురాల సిరివాన
మధురిమ లందించు సుధలేమిటో
ప్రవశమే సాగి పరువాలు చెలరేగి
మనసులు కరిగించు సుఖమేమిటో
పల్లవించే మోహ బంధం
ఆలపించే రాగ బంధం ఆ..
కురిసేను విరి జల్లులే
ఒకటయ్యేను ఇరు చూపులే
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
శౄంగార మునకీవె శ్రీకారమే కావె
Labels:
ఘర్షణ--1988
Monday, August 20, 2007
జీవన గంగ--1980
సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరి
గానం::S.జానకి
పల్లవి::
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ..వయస్సులో..వయస్సులో ఉన్నా క లు నను జతగా
మనస్సులో ఉన్న..సొద విను కథగా
తొలి ప్రేమో..ఏమో..పూవల్లె పూసింది ఆశగా
వయస్సులో ఉన్నా..కలు నను జతగా
మనస్సులో ఉన్న సొద విను కథగ
తొలి చూపో..ఏమో..ఈనాడే తగిలింది తొలికరి కలి మెరుపై
వయస్సులో ఉన్నా..కలు నను జతగా
చరణం::1
నిన్ను చూసి..మూగ రాగం..నరాలలో రేగే
ఏదో ఏదో వింత మౌనం..స్వరాలుగా..సాగే
జవరాలి వివరాలే..ప్రియా విను..విడువకు కడవరకు
వయస్సులో ఉన్నా..కలు నను జతగా
మనస్సులో ఉన్న సొద విను కథగ
చరణం::2
ఒడ్డు తాకే..కడలి లాగ..స్ప్రుసించని నిన్నే
ఒడిని చేరే..కన్నె లాగా..తరించని నన్నే
పరువాలే పరిచానే..ఏఏఏఏ..అదేమని
అడగకు..ఇది తొలి..వలపు
వయస్సులో ఉన్నా..కలు నను జతగా
మనస్సులో ఉన్న సొద విను కథగ
తొలి చూపో..ఏమో..ఈనాడే తగిలింది తొలికరి కలి మెరుపై
వయస్సులో ఉన్నా..కలు నను జతగా
మనస్సులో ఉన్న సొద విను కథగ
Labels:
జీవన గంగ--1980
పరమానందయ్య శిష్యుల కథ--1966
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
సంగీతం: ఘంటసాల.
రచన: సముద్రాల.
గానం: ఘంటసాల, లీల.
రాగం::(కానడ )( రాగ::కాఫీ )
ఆ..ఆ..ఆ..
కామినీమదన రారా
నీ కరుణకోరి పిలిచేరా (2)
నాటి తొలిప్రేమ మురిపాల తేల
నాదు జతజేరి లాలించు వేళ (2)
నెరపిన నీ సరాగాలన్ని (2)
నీటిపై వ్రాతలేనా
!! కామినీమదన రా రా !!
మోము కనకున్న మనలేని స్వామి
ప్రేమ విడనాడి పెడమోములేమి (2)
ఏమైనా జగమ్మేమన్న (2)
నీకై జీవించుగాద
!! కామినీమదన రా రా !!
పరమానందయ్య శిష్యుల కథ--1966::ఆభేరి::రాగం
సంగీతం::ఘంటసాల
రచన::సముద్రాల
గానం::ఘంటసాల,P.సుశీల
:: ఆభేరి రాగం ::
ఓహో...ఓహో..ఓ...ఓ..
నాలోని రాగం నీవే నడయాడు తీగనీవే
పవళించెలోన బంగారు వీణ పిలికించ నీవు రావె
నెలరాజువైన నీవే చెలికాడవైన నీవే
చిరునవ్వులోన తొలిచూపులోన కరగించివేసి నావె
నెలరాజువైన నీవె
నీ నీడ సోకగానె నీ మేను తాకగానె
ము..అహ..ఆ..ఒహొ..ఆ..ముహు...
నీ నీడ సోకగానె నీ మేను తాకగానె
మరులేవొ వీచె మనసేమొపూచె విరివానలోన కురిసేనె
నెలరాజు..కరగించివేసి నావే..నెలరాజువైన నీవే!!
నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను
ఆ..అహ..ఆ..ఒహొ..ఆ..ముహు..
నీ చేయి విడువలేను ఈ హాయి మరువలేను
కనరాని వింత ఈ పులకరింత నను నిలువనీయదేమోయి
నాలోని..నీవు రావే..నాలోని రాగం నీవే
ఆహా...ఓహొ..మూహు..హు..
Sunday, August 19, 2007
మనుషులు మారాలి--1969::చక్రవాకం::రాగం
సంగీతం::K.V.మహదేవన్
రచన::శ్రీశ్రీ
గానం::ఘంటసాల
చక్రవాకం::రాగం
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..
మనసున పెంచిన మమతలు పోయె
మమతలు పంచిన మనిషే పోయె
మనసున పెంచిన మమతలు పోయె
మమతలు పంచిన మనిషే పోయె
మనిషే లేని మౌనంలోన
మనుగడ చీకటి మయమైపోయె
లేరెవరూ..నీకెవరూ..
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..
జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చెరకువు నీవే
జాలరి వలలో చేపవు నీవే
గానుగ మరలో చెరకువు నీవే
జాలే లేని లోకంలోన
దారే లేని మనిషివి నీవే
లేరెవరూ..నీకెవరూ..
చీకటిలో కారు చీకటిలో
కాలమనే కడలిలో శోకమనే పడవలో
ఏ దరికో..ఏ దెసకో..
మనషులు మారాలి--1969
సంగీతం::KV.మహాదేవన్
రచన::C.నారాయణ రెడ్డి
గానం::SP.బాలు,P.సుశీల
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం
మరల మరల ప్రతిఏట మధుర మధుర గీతం జన్మదిన వినోదం
మరల మరల ప్రతిఏట మధుర మధుర గీతం జన్మదిన వినోదం
!!తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం!!
వేలవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో
వేలవేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో
వీచె మలయమారుతాలు పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే మలిచే కాంతి తోరణాలు
!!తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం!!
వలపులోన పులకరించు కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించె ప్రియురాలు
జీవితమై స్నేహమయం … ఈ జగమే ప్రేమమయం
ప్రేమంటే ఒక భోగం .. కాదు కాదు అది త్యాగం
!!తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం!!
Subscribe to:
Posts (Atom)