Saturday, August 04, 2007

మేఘసందేశం--1982::రాగం::శివరంజని

చిమ్మటలోని ఈ ఆణిముత్యం మీకోసం వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::వేటూరి
గానం::
జేసుదాస్

Film DirectedBy::DasarinarayanaRaoరాగం::శివరంజని!!
కర్నాటక హిందుస్తాని !!


ఆకాశ దేశానఆషాఢ మాసాన
మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా
విరహమో దాహమో విడలేని మోహమో
వినిపించు నా చెలికి మేఘసందేశం మేఘసందేశం

వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై
ఈ యేడారి దారులలో ఎడద నేను పరిచానని
కడిమివోలే నిలిచానని
ఉరమని తరమని ఊసులతో ఉలిపిరి చినుకుల బాసలతో
విన్నవించు నా చెలికి విన్న వేదనా నా విరహ వేదనా

!! ఆకాశ దేశాన !!


రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీది నీడలలో నివురులాగ మిగిలానని
శిధిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాష్పజల దారలతో
ఆ..ఆ..ఆ..ఆ
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా

!! ఆకాశ దేశాన !!

మేఘసందేశం--1982::రాగం::సింధు బైరవి

చిమ్మటలోని మరో ఆణిముత్యం మీకోసం వినండి


సంగీతం::రమేష్ నాయుడు
రచన::దేవులపల్లి కృష్ణశాస్త్రి
రచన::వేటూరి
గానం::P.సుశీల

రాగం::సింధు బైరవి
(నటబైరవి చాయలు కలది )

నిన్నటిదాకా శిలనైనా నీ
పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా

!!నిన్నటిదాకా శిలనైనా!!

సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు
మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు
మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాతంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

!!నిన్నటిదాకా శిలనైనా!!

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు
నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు
నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల

Friday, August 03, 2007

ఇద్దరు మిత్రులు--1961





















సంగీతం::రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం.

పల్లవి::

ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో
విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి

విరజాజి గులాబి మన గుట్టే తెలుసుకున్నవి
చామంతి పూబంతి పరిహాసాలాడినవి
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో!!!!


చరణం::1

ఆ..ఆహా..ఓ..ఓహో..
పొదరింటన ఒంటరి పావురము
తన జంటను కలియగ వేచినది
మనసే తెలిసి తన ప్రేయసికై
మగ పావురమే దరిచేరింది..ఆ...
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో

ఆ..ఆహా..ఓ..ఓహో..మ్మ్


చరణం::2

నీ కురులను రేపిన చిరుగాలి
నామదిలో కోరిక రేపినది
వలపే తెలిపే కనుసైగలతో
నీ ఊసులు బాసలు చేసాయి
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో


చరణం::3

ఆహా..ఆ..ఆ..ఆ..ఆ..హా..ఆ..ఆ
నదిలో మెరిసే కదిలే కాంతి
నదిలో మెరిసే కదిలే కాంతి
నా మోమున తళ తళ లాడింది
నీ చక్కని చెక్కిలి అద్దాన
నా రూపము నేనే చూశాలే..ఆ..ఆ..
ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు
గుస గుసలాడినవి ఏమిటో

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::రాజేశ్వరరావ్
రచన::ఆరుద్ర
గానం::ఘంటసాల, P. సుశీల
తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 


పల్లవి::

హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి

ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకం‌లో ఆడవారిది పై చేయి


చరణం::1


నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరపాటు

నాటికీ నేటికీ మీకు అలవాటే
హలో హలో ఓ అమ్మాయి అవును మీదే పై చేయి


చరణం::2
బెట్టుచేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి
బెట్టుచేసే మగవారి గుట్టు మాకు తెలుసోయి

మనసులూ మమతలూ పైకి వేషాలూ
ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి


చరణం::3


లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి
లడాయి చేసే స్త్రీ జాతి రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు
గెలుపు కోసం మగవారు
కాళ్ళ బేరము లాడకపోరు

ఓహొ బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆదినుంచి లోకం‌లో ఆడవారిది పై చేయి

హలో హలో ఓ అమ్మాయి పాత రోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి

హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్‌బై

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::రాజేశ్వరరావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల,P.సుశీలతారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 

పల్లవి::

మ్మ్...మ్మ్...ఆహా..హా..
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా
వసంతవేళలా పసందు మీరగా
అపూర్వగానమే ఆలపించే తీయగా
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా


చరణం::1

అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే
అదా కోరికా వయ్యారి కోయిలా
జగాలే నీ చూపులో జలదిరించెలే
వరాల నవ్వులే గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన చిలకరించెనే
ఓహొ ఓహొ నిన్నే కోరెగా
కుహుకుహూ అనీ కోయిలా


చరణం::2


ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఫలించె నేను కన్న కలలు తీయతీయగా
సుఖాలలో సోలిపో హాయి హాయిగా
ఉయ్యాలలూగే నామది చిటారుకొమ్మలా
నివాళి అందుకో ఈవేళ పండుగా
సదా సుధా తరంగాల తేలిపోదమా
ఓహొ ఓహొ నిన్నే కోరితి
కుహుకుహు అనీ పాడితి

 ఆ హా హా ఆ..హా హా హా

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::దాశరథి
గానం::ఘంటసాల,P.సుశీల
తారాగణం::అక్కినేని,రాజసులోచన,ఇ.వి.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,జి.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 


పల్లవి::

ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనుల దానా
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే నిషా కనుల దానా


చరణం::1

ఓ..ఓ..ఓ..ఓ..
మేనాల్లోనా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీన
మేనాల్లోనా ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీన
నింగి దాటి ఆనంద సాగరం పొంగి పొరలె నాలోన
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ
హుషారు ఉందాములే నిషా కనుల వాడా!!!


చరణం::2
ఓ..ఓ..ఓ..ఓ..
ఓహొ చెలియా నీవు కూడా ఓ పెళ్ళి పల్లకి చూసుకో
ఓహొ చెలియా నీవు కూడా ఓ పెళ్ళి పల్లకి చూసుకో
హాయి గొలుపు సన్నాయి పాటలో వలపు బాటలే వేసుకో
నే వెళితే మరి నీవు మజ్ను అవుతావు
నే వెళితే మరి నీవు మజ్ను అవుతావు
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటలు రువ్వుతూ
హుషారు ఉందాములే నిషా కనుల వాడా!!!


చరణం::3

ఓ..ఓ..ఓ..ఓ..
ఆకాశంలో ఇంధ్ర దనసుపై ఆడుకొందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై తేలిపోద మీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా
ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకీ మాటాలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే హమేషా మజాగా !!!!!!!


Iddaru Mitrulu--1961
Music::Saluri Rajeshwara Rao
Lyricis::Dasaradhi
Singer's::Ghantasala,P.Susheela
Cast::Akkineni,Rajasulochana,E.V.Saroja,Gummadi,Padmanabham,Sarada,
G.Varalakshmii,Relangi,Alluraamalingayya,Ramanaareddi,Sooryakaantam. 

::::

khushikhushiga navvutu chalaki matalu ruvvutu
husharu golipevenduke nishaa kanuladanaa
oo...menaalona priyuni chera
vellindi na cheli meenaa
menaalona priyuni chera
vellindi na cheli meenaa
ningi dati ananda sagaram pongiporale nalona
khushikhushiga navvutu chalaki matalu ruvvutu
husharu golipevenduke nishaa kanuladanaa

::::1

o..oho cheliyaa neevu kuda o pelli pallaki chusuko
o..oho cheliyaa neevu kuda o pelli pallaki chusuko
hayigolupu sannayi patalo
valapubatale vesuko
ne velite mari nevu majnuvavutavu
ne velite mari nevu majnuvavutavu..
majnu nenaite oo lailaa lokame chekataipovune
khushikhushiga navvutu chalaki matalu ruvvutu
husharu golipevenduke nishaa kanuladanaa

::::2

oo..aakashamlo indhradhanasupai
adukondamaa nede
neelineeli meghala radhamupai telipodumeenade
chandrudu nenai nevu vennelai
kalisipodamaa hayigaa
nenu veenanai nevu naadamai yekamavudamaa teeyagaa
khushikhushigaa navvutuu chalaki matalu ruvvutu

husharuga undamule hameshaa majagaa

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::S.రాజేశ్వర రావ్
రచన::ఆరుద్ర
గానం::P.B.శ్రీనివాస్,P.సుశీల

తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 

పల్లవి::

చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే

ఉక్కిరి బిక్కిరి అయిపోతానే...

టక్కరిబావా కిక్కురుమనకు..ఇక్కడిమాట ఇతరులువింటే
ఉక్కిరి బిక్కిరి అయిపోతావే...

చరణం::1
అల్లరిపిల్లా ఆపవేలా..పుల్లవిరుపు మాటలు
అల్లరిపిల్లా ఆపవేలా..పుల్లవిరుపు మాటలు
పెళ్ళాం కనపడితే..ప్రేమే కలిగిందా..
పెళ్ళాం కనపడితే..ప్రేమే కలిగిందా..
పెళ్ళాం అంటే బెల్లమూ..తల్లీ తండ్రీ అల్లము
పెళ్ళాం అంటే బెల్లమూ..తల్లీ తండ్రీ అల్లము

టక్కరిబావా కిక్కురుమనకు..ఇక్కడిమాట ఇతరులువింటే
ఉక్కిరి బిక్కిరి అయిపోతావే...

చరణం::2

ముద్దులగుమ్మ మోహమాయే..పొద్దు చాలా పోయేనే
ముద్దులగుమ్మ మోహమాయే..పొద్దు చాలా పోయేనే
పెద్దలు గర్జిస్తే..పెడసరమవుతావా
పెద్దలు గర్జిస్తే..పెడసరమవుతావా
పెద్దల గొడవ ఎందుకే..ఇద్దరమొకటై ఉందామే

చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే
ఉక్కిరి బిక్కిరి అయిపోతానే...

చరణం::3

మీ నాయనగారి మీసమూ..చూస్తే సన్యాసమూ
మీ నాయనగారి మీసమూ..చూస్తే సన్యాసమూ
అబ్భా..అబ్భబ్భా..నీ మాటలు కొరడాదెబ్బలూ
అబ్భా..అబ్భబ్భా..నీ మాటలు కొరడాదెబ్బలూ
సూటిగ పెళ్ళాడీ..చాటుగ రానేలా
సూటిగ పెళ్ళాడీ..చాటుగ రానేలా
చేయకు నన్ను దూరమూ..తీయకు మీనా ప్రాణమూ
చేయకు నన్ను దూరమూ..తీయకు మీనా ప్రాణమూ

టక్కరిబావా కిక్కురుమనకు..ఇక్కడిమాట ఇతరులువింటే
ఉక్కిరి బిక్కిరి అయిపోతావే...
చక్కని చుక్క సరసకు రావే..ఒక్కసారి నవ్విన చాలే

ఇద్దరు మిత్రులు--1961




సంగీతం::S.రాజేశ్వరరావ్
రచన::శ్రీ శ్రీ
గానం::ఘంటసాల, P. సుశీల

తారాగణం::అక్కినేని,రాజసులోచన,E.V.సరోజ,గుమ్మడి,పద్మనాభం,శారద,G.వరలక్ష్మీ,రేలంగి,అల్లురామలింగయ్య,రమణారెడ్డి,సూర్యకాంతం. 


పల్లవి::

ఆ..ఆ..ఆ..ఆ..ఓ..ఓ..ఓ..
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా

చరణం::1
ఈ వసంత యామినిలో...ఈ వెన్నెల వెలుగులలో..ఓ..ఓ
ఈ వసంత యామినిలో..ఈ వెన్నెల వెలుగులలో

జీవితమే పులకించగా...జీవితమే పులకించగా
నీ వీణను సవరించి...పాడవేల రాధికా

గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి

ఏ మూలనో పొంచి పొంచి...ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని ఎంచి....పాడవేల రాధికా 


చరణం::2
వేణుగానలోలుడు నీ వీణా మృదు రవము విని..నీ
వేణుగానలోలుడు నీ వీణా మృదు రవము విని

ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా

పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా

Thursday, August 02, 2007

మనుషులు-మమతలు--1965



సంగీతం::T.చలపతిరావు 
రచన::దాశరథి 
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని,సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమాలత. 

పల్లవి::

రాధ::
వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమ ఘుమలు
వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమ ఘుమలు
ఘుమ ఘుమలో..ఓఓ..గుస గుసలు
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు

చరణం::1

నీ హృదయంలో..నిలవాలని..ఈఈఈఈ
నీ కౌగిలిలో..కరగాలని..ఈఈ
నీ హృదయంలో..నిలవాలని..ఈఈఈఈ
నీ కౌగిలిలో..కరగాలని..ఈఈ
నీవే నీవే..కావాలని..ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు

వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమ ఘుమలు
ఘుమ ఘుమలో..ఓఓ..గుస గుసలు
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు

చరణం::2

పూల పల్లకిలోన..తేలిపోయే సమయాన..ఆ
పూల పల్లకిలోన..తేలిపోయే సమయాన..ఆ
బుగ్గల సిగ్గులు తొణకాలని..అవి నీకే నీకే ఇవ్వాలని
ఏవేవో కోరికలు..ఏవేవో కోరికలు

వెన్నెలలో మల్లియలు..మల్లెలలో ఘుమ ఘుమలు
ఘుమ ఘుమలో..ఓఓ..గుస గుసలు
ఏవేవో కోరికలు..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::daaSarathi
Singer's::P.Suseela
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata

::::::

Raadha::

vennelalO malliyalu..mallelalO ghuma ghumalu
vennelalO malliyalu..mallelalO ghuma ghumalu
ghuma ghumalO..OO..gusa gusalu
EvevO kOrikalu..EvevO kOrikalu

::::1

nee hRdayamlO..nilavaalani..iiiiiiiii
nee kaugililO..karagaalani..iiiii
nee hRdayamlO..nilavaalani..iiiiiiiii
nee kaugililO..karagaalani..iiiii
neeve neeve..kaavaalani..EvevO kOrikalu..EvevO kOrikalu

vennelalO malliyalu..mallelalO ghuma ghumalu
ghuma ghumalO..OO..gusa gusalu
EvevO kOrikalu..EvevO kOrikalu

::::2

poola pallakilOna..telipOye samayaana..aa
poola pallakilOna..telipOye samayaana..aa
buggala siggulu toNakaalani..avi neeke neeke ivvaalani
EvevO kOrikalu..EvevO kOrikalu

vennelalO malliyalu..mallelalO ghuma ghumalu
ghuma ghumalO..OO..gusa gusalu
EvevO kOrikalu..mm mm mm mm mm mm

మనుషులు-మమతలు--1965



సంగీతం::T.చలపతిరావు 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::P.సుశీల
తారాగణం::అక్కినేని, సావిత్రి,జయలలిత,జగ్గయ్య,ప్రభాకర్‌రెడ్డి,గుమ్మడి,రమణారెడ్డి,రాజశ్రీ,హేమలత. 

పల్లవి::

రాధ::ఒంటరిగా ఉన్నావంటే..ఒంటికి మంచిది కాదు 
జంటగ నీ జత ఒకరుంటే..అన్నిటికి మేలన్నారు
ఒంటరిగా..వున్నావా?..ఆ ఆ ఆ ఆ

చరణం::1

వంతెన వేస్తావు..వారధి కడతావు
వంతెన వేసే..వారధి కట్టే ఇంజనీరు వవుతావు
మనసు మనసునకు మమతల వంతెన 
మనసు మనసునకు మమతల వంతెన
వేసావంటే మనిషవుతావు 

ఒంటరిగా ఉన్నావంటే..ఒంటికి మంచిది కాదు 
జంటగ నీ జత ఒకరుంటే..అన్నిటికి మేలన్నారు
ఒంటరిగా..వున్నావా?..ఆ ఆ ఆ ఆ

చరణం::2

ఇనప తలపుల ఆనకట్టతో..ఓ
ఇనప తలపుల ఆనకట్టతో..వరదలు ఆపేస్తావు
వలపు తలపులూ..ఊ..వయసు పొంగులూ..ఊ
వలపు తలపులూ..వయసు పొంగులూ
ఉరకలు వేస్తే..ఏం జేస్తావు?

ఒంటరిగా ఉన్నావంటే..ఒంటికి మంచిది కాదు 
జంటగ నీ జత ఒకరుంటే..అన్నిటికి మేలన్నారు
ఒంటరిగా..వున్నావా?..ఆ ఆ ఆ ఆ హోయ్

Manushulu-Mamatalu--1965
Music::T.ChalapatiRao
Lyrics::Achaarya-Atreya
Singer's::P.Suseela
Cast::Akkinaeni,Gummadi,PrabhaakarReddi,Jayalalita,saavitri,Jaggayya,Rajasree,Ramanareddi,Hemalata

:::: 

Raadha::onTarigaa unnaavanTe..onTiki manchidi kaadu 
janTaga nee jata okarunTe..anniTiki melannaaru
onTarigaa..vunnaavaa?..aa aa aa aa hOy

::::1

vantena vestaavu..vaaradhi kaDataavu
vantena vese..vaaradhi kaTTe injaneeru vavutaavu
manasu manasunaku..mamatala vantena
manasu manasunaku..mamatala vantena
vesaavanTe..manishavutaavu 

onTarigaa unnaavanTe..onTiki manchidi kaadu 
janTaga nee jata okarunTe..anniTiki melannaaru
onTarigaa..vunnaavaa?..aa aa aa aa hOy

::::2

inapa talapula..aanakaTTatO..O
inapa talapula aanakaTTatO..varadalu aapestaavu
valapu talapuloo..oo..vayasu ponguloo..oo
valapu talapuloo..vayasu ponguloo
urakalu veste..Em jestaavu?

onTarigaa unnaavanTe..onTiki manchidi kaadu 
janTaga nee jata okarunTe..anniTiki melannaaru
onTarigaa..vunnaavaa?..aa aa aa aa hOy