Showing posts with label Singer::Renuka. Show all posts
Showing posts with label Singer::Renuka. Show all posts

Tuesday, April 12, 2011

గాలిమేడలు--1962





సంగీతం::T.G.లింగప్ప
రచన::సముద్రాల రాఘవాచార్య( సీనియర్)
గానం::రేణుక

తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,
M.V.రాజమ్మ,రాజనాల

కృష్ణా..ఆ..కృష్ణా..ఆఆఆ
మంచిమాటేరా..మంచిమాటేరా..రారా
మంచిమాటేరా..
చెలియమనసు తెలుసుకోరా..
చెలియమనసు తెలుసుకోరా..
పిలుపువినరారా.....
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా..ఆఆ
మనసులోని మమతలన్ని..పూలుపూసెనురా
అలుకఏలా..పలుకవేలా..అలుకఏలా..పలుకవేలా
పిలుపు వినరారా.....ఆ...
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా..ఆ..
కన్నెరాధా నిన్నుకోరి..వేచియున్నదిరా
నీదుతలపే..మధురబాధై..మదినితలెచెనురా..ఆ
నీవులేకా..నిలువలేను..పిలుపు వినరారా..ఆ
మంచిమాటేరా..రారా..మంచిమాటేరా..

Tuesday, September 04, 2007

గాలిమేడలు--1962::ద్వజావంతి::రాగం



సంగీతం::T.G.లింగప్ప

రచన::సముద్రాల రాఘవాచార్య( సీనియర్)
గానం::ఘంటసాల,రేణుక
తారాగణం::N.T.రామారావు,దేవిక,S.V.రంగారావు,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,

M.V.రాజమ్మ,రాజనాల

రాగం::ద్వజావంతి
ఈ రాగాన్ని "జయ్ జయ్ వంతి" అనికూడా అంటారు


ఈ మూగ చూపేలా బావా మాటాడగా నేరవా
ఓ.. హో.. మాటాడవదే బొమ్మా నీ దరి నే చేరి మాటాడనా
ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా

1:రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
రెప్పెయ్యకుండా ఒకే తీరున నువ్వు చూస్తే నాకేదో సిగ్గౌతది
ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే … ఈ సిగ్గు ఈ ఎగ్గు ఎన్నాళ్ళులే
చెయ్యి చేయీ చేరా విడిపోవులే

!! ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా !!

2:చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
ఆ.హా.. హా…హా… ఆఆఆఆ
చల్లగ నీ చేయి నన్నంటితే చటుకున నా మేను ఝల్లంటది
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే ..
నా ముందు నిలుచుండి నువ్వు నవ్వితే
నా మనసే అదోలాగ జిల్లంటదే…

!! ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదే బొమ్మా !!

3:జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
ఓ.. హో.. హో… హో … ఓఓఓఓ
జాగ్రత్త బావా చెయీ గాజులు ఇవే కన్న చిన్నారి తొలి మోజులూ
చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే చాటే నీ ఎలుగెత్తి ఈ గాజులే
ఈ వేళా మరేవేళా మన రోజులే ….

!! ఈ మూగ చూపేలా బావా మాటాడగానే రావా
ఓ.. హో.. మాటాడదీ బొమ్మా !!