సంగీతం::K.V.మహాదేవన్ రచన::ఆత్రేయ గానం::S.P.బాలు తారాగణం::శోభన్ బాబు,జయచిత్ర,జయసుధ,అంజలీదేవి,రమాప్రభ,సత్యనారాయణ, రాజబాబు,నగేష్ పల్లవి:: ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా చరణం::1 నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు నువ్వేసిన ముడిని మనిషి తెంచేశాడు నీ సాక్ష్యం నమ్మనని కొట్టేశాడు అన్యాయం అన్యాయం అంటే వెళ్ళి దేవుడితో చెప్పుకో పొమ్మన్నాడు పో పొమ్మన్నాడు ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ శ్రీనివాసా చరణం::2 చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు చట్టం ఒప్పుకుని యిద్దరం కలవలేదు చట్టాన్ని అడిగి తాళి కట్టలేదు చట్టం ఒప్పుకుని యిద్దరం కలవలేదు మనిషి చేసింది చట్టము మాకు జరిగింది ద్రోహము నువ్వే నిలబెట్టాలి నీతీ న్యాయమూ లేదా నువ్వే శూన్యము ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ శ్రీనివాసా చరణం::3 మాటమీద నిలబడే మనిషినీ మనసు మార్చుకోను చేతకాని వాడినీ మాటమీద నిలబడే మనిషినీ మనసు మార్చుకోను చేతకాని వాడినీ చేపట్టి విడువలేను ఆడదానిని నీ మీద ఒట్టు నేనొంటరివాడ్ని ఒంటరివాడ్ని ఏడూ కొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పనిచేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో వుప్పును కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా కలిపినట్టే కలిపి వేరు చేశావయ్యా
అయ్యో పాపం అత్తకొడుకువని అడిగినదిస్తా నన్నాను..ఆ... అయ్యో పాపం అత్తకొడుకువని అడిగినదిస్తా నన్నాను అహ్..వరసావావి వుందికదా అని నేనూ ముద్దే..అడిగాను నాకు ఇద్దామని వుందీ కాని అడ్డేంవచ్చిందీ నాకు ఇద్దామని వుందీ కాని అడ్డేంవచ్చిందీ అంతటితో నువ్ ఆగుతావని నమ్మకమేముందీ... అబ్బాయీ...ఓ...అబ్బాయ్యీ
బస్తీకెళ్ళే మరదలుపిల్లా తిరిగొస్తావా మళ్ళీ ఇలా ఇంతకన్నా ఎన్నో ఎన్నో సొగసులు ఎదిగీవస్తాను
బస్తీకెళ్ళే మరదలుపిల్లా తిరిగొస్తావా మళ్ళీ ఇలా ఇంతకన్నా ఎన్నో ఎన్నో సొగసులు ఎదిగీవస్తాను ముడుపుకట్టుకొని తెస్తావా మడికట్టుకొని నువ్ వుంటావా ముడుపుకట్టుకొని తెస్తావా మడికట్టుకొని నువ్ వుంటావా ఈలకాచి నక్కలపాలు కాదని మాటిస్తావా అమ్మాయీ..ఓ..అమ్మాయీ
తిరిగి తిరిగి రేపట్టి నువ్ పొలముదున్నుతువుంటావూ... హేహేయ్.. తిరిగి తిరిగి రేపట్టి నువ్ పొలముదున్నుతువుంటావూ... అది తలుచుకొంటు నే ఇంట్లో రాతిరి ఎప్పుడెప్పుడని వుంటాను
ఒరెఒరెఒరెఒరె ఓరయ్యో... హుప్ అంటేనే వులిక్కిపడలేదూ మరి!!! నీ ఊపిరి తగిలి వొంపులుతిరిగానూ..
చెంగు చుట్టగా చుట్టి చేత్తో గంపను పట్టుకొని నడిచేవు ఆ గుట్టుగ వున్న అందాలూ.. నువ్వే రట్టుచేసుకొంటున్నావు పట్టపగలే గుట్టంతా అయినా నీకూ నాకూ తెలియనిదా రట్టుకాని కాపురము వెయ్యి పుట్టుకలైన కోరే వరము