సంగీతం::K.V.మహాదేవన్
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::S.P.బాలు,P.సుశీల
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా
ఆ...ఆ...ఆ...ఆ...
ఆ...ఆ...ఆ...ఆ...
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా
చిలకమ్మ తట్టితే తలుపుతీసా
మళ్ళి చేయ్ జారిపోకుండ కట్టేసా
చిలకమ్మ తట్టితే తలుపుతీసా
మళ్ళి చేయ్ జారిపోకుండ కట్టేసా
ఆ...గోరింక గూటిలోకి వచ్చేసా
దాచివున్నదంత మనసిచ్చి ఇచ్చేసా
గోరింక గూటిలోకి వచ్చేసా
దాచివున్నదంత మనసిచ్చి ఇచ్చేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగట్టిలిక వదలనని మొండికేసా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేసా
సోగట్టిలిక వదలనని మొండికేసా
వేంకటేశా...తిరుమలేశా...
తిరుమలేశా... శ్రీనివాసా
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీచేయి కొచ్చేసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా
పూల చెండల్లే నీచేయి కొచ్చేసా
ఆ...ఒళ్ళంత ముద్దులతో ముద్దరేసా
నీవు ఓపకుంటే పెనవేసి ఒకటిచేసా
ఒళ్ళంత ముద్దులతో ముద్దరేసా
నీవు ఓపకుంటే పెనవేసి ఒకటిచేసా
కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
హోయ్..కన్నెతనం పక్కమీద పరిచేసా
దాన్ని కడదాక కాస్తానని ఒట్టేసా
వేంకటేశా...తిరుమలేశా...
తిరుమలేశా... శ్రీనివాసా
ఏడుకొండలవాడ వేంకటేశా
ఓరయ్యో ఎంతపని చేసావు తిరుమలేశా
చెట్టుమీద కాయనూ సముద్రంలో ఉప్పును
కలిపినటే కలిపావు శ్రీనివాసా
No comments:
Post a Comment