Showing posts with label సీతామాలక్ష్మి --- 1978. Show all posts
Showing posts with label సీతామాలక్ష్మి --- 1978. Show all posts

Friday, December 18, 2009

సీతామాలక్ష్మి--1978,



సంగీతం::K.V.మహాదేవన్
రచన::జాలాది రాజారావ్
గానం::P.సుశీల


అలలు కదిలినా పాటే..ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే..కలత చెందినా పాటే
ఏ పాట నే పాడనూ..బ్రతుకే ఆటైన పసివాడనూ..
ఏ పాట నే పాడనూ..బ్రతుకే ఆటైన పసివాడనూ..
ఏ పాటైన నే పాడనూ..

ఏలుకొంటే పాట..మేలుకొంటే పాట
పాడుకొంటే పాట..మా దేవుడూ..2

శ్రీమనభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదైకదయైకసింధో
శ్రీదేవతాగౄహ బుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటా చలపతే తవసుప్రభాతం

ఆ సుప్రభాతాలు ఆ భక్తి గీతాలు
పాడకుంటే మేలుకోడు మం మేలుకోడు....
ఏ పాట నే పాడనూ....

తల్లడిల్లేవేళా..తల్లిపాడే జోలా
పాలకన్నాతీపి పాపాయికీ...2
రామలాలీ మేఘశ్యామ లాలీ..
తామరస నయనా దశరథ తనయాలాలీ
ఆఆఆఆఆ ఆ రామలాలికీ..ఆ ప్రేమ గీతికీ

Wednesday, August 15, 2007

సీతామాలక్ష్మి--1978,::హిందోళం::రాగం






!! రాగం: హిందోళం !! 

సంగీతం:K.V.మహాదేవన్

రచన: దేవులపల్లి కౄష్ణశాస్త్రి
గానం: S.P.బాలు. P. సుశీల


మావి చిగురు తినగానే....
మావి చిగురు తినగానే
కోవిల పలికేనా
మావి చిగురు తినగానే
కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే
మావి చిగురు తొడిగేనా....
కోవిల గొంతు వినగానే
మావి చిగురు తొడిగేనా....
ఏమో ఏమనునో కానీ
ఆమనీ..ఈ వని

!! మావి చిగురు తినగానే
కోవిల పలికేనా..కోవిల పలికేనా !!

తెమ్మెరతో తారాటలా....
తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా....
తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా....
సయ్యాటలా తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు
ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలూ..బిడియాలూ....
పొంకాలూ..పోడుములూ
ఏమో ఎవ్వరిదో గానీ ....
ఈ విరి..గడసరి

!! మావి చిగురు తినగానే
కోవిల పలికేనా....
కోవిల పలికేనా !!

ఒకరి వళ్ళు ఉయ్యాలా
వేరొకరి గుండె జంపాలా
ఉయ్యాలా జంపాలా....
జంపాలా ఉయ్యాలా
ఒకరి వళ్ళు ఉయ్యాలా
వేరొకరి గుండె జంపాలా
ఒకరి పెదవి పగడాలో....
వేరొకరి కనుల దివిటీలో
ఒకరి పెదవి పగడాలో
వేరొకరికనులదివిటీలో
పలకరింతలూ..పులకరింతలూ....
పలకరింతలూ..పులకరింతలూ....
ఏమో..ఏమగునో కానీ
ఈ కథ..మన కథా

!!మావి చిగురు తినగానే
కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే
మావి చిగురు తొడిగేనా
ఏమో ఏమనునో కానీ
ఆమనీ..ఈ వని
మావి చిగురు తినగానే
కోవిల పలికేనా..కోవిల పలికేనా..... !!

సీతామాలక్ష్మి--1978,



సంగీతం::K.V.మహాదేవన్
రచన::జాలాది రాజారావ్
గానం::S.P.బాలు,P.సుశీల




సీతాలు సింగారం ..
మా లచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే
శ్రీలచ్చిమవతారం 2
మనసున్న మందారం ..
మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే
భగవంతుడవతారం 2
!! సీతాలు సింగారం !!


కూసంత నవ్విందంటె
పున్నమి కావాలా..
ఐతే నవ్వనులే... కాసంత చూసిందంటె
కడలే పొంగాలా....
ఇక చూడనులే...
కూసంత నవ్విందంటె పున్నమి కావాలా....
కాసంత చూసిందంటె కడలే పొంగాలా....
ఎండి తెరమీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల
ఆ ఎదుగూ బొదుగూ ఎలుగూ కన్నుల ఎన్నెల కాయాలా
నువ్వంటుంటే..నే వింటుంటే..నూరేళ్ళు నిండాలా....
!! సీతాలు సింగారం ..
మా లచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే
భగవంతుడవతారం !!

దాగుడుమూతలు ఆడావంటె దగ్గరకే రాను
ఐతే నేనే వస్తాలే....
చక్కిలిగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
ఎగిరొస్తాలే....
దాగుడుమూతలు ఆడావంటె దగ్గరకే రానూ
చక్కిలిగింతలు పెట్టావంటే చుక్కైపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై
వెలిగీ వెలిగించాల
నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై
ఉండిపోవాలా..
నువ్వంటుంటే..నే వింటుంటే..
వెయ్యేళ్ళు బతకాలా..
!! సీతాలు సింగారం ..
మా లచ్చి బంగారం
బంగారు కొండయ్యంటే
భగవంతుడవతారం
లా లా ల లా ల లా.....
లా లా ల లా ల లా..... !!