Showing posts with label రాగమాలిక--1982. Show all posts
Showing posts with label రాగమాలిక--1982. Show all posts

Friday, August 31, 2012

రాగమాలిక--1982






















సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.జానకి
తారాగణం::రాధ,కణ్ణన్

పల్లవి::

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ..పువ్వే వికసించదా

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా..ఓ..పువ్వే వికసించదా
నాదం నీ దీవనే..ఏఏఏ

చరణం::1

అమృతగానం ఈ అనురాగం నదులు జతిగా పాడునే
నదిని విడిచే అలను నేనై ఎగసి ముగిసిపోదునే
కన్నుల మౌనమా కలకే రూపమా
దాచకే మెరుపులే పన్నీర్ మేఘమా
మరుమల్లె పువ్వంటి మనసే తొలిసారి విరిసే

నాదం నీ దీవనే

చరాణం::2

కోయిలల్లే నాద మధువే పొందకోరే దీవినే
నిదురపోని కనులలోని కలలు మాసిపోవునే
కోవెల బాటలో పువ్వుల తోరణం
ఎంతకూ మాయని తియ్యని జ్ఞాపకం
వెన్నెల్లో అల్లాడు కమలం విధి నాకు విరహం

నాదం నీ దీవనే నీ రాగాలాపనే
నీ రాగ గీతం పాడుతుంటే
పలుకే పాలూరదా ఓ..పువ్వే వికసించదా
నాదం నీ దీవనే

Wednesday, August 08, 2012

రాగమాలిక--1982






సంగీతం::ఇళయరాజ
రచన::వేటూరి
గానం::S.P.బాలు,S.జానకి

పల్లవి:: 

అవిద్యానా,మంత,స్తిమిర,మిహిర ద్వీపనగరీ
జడానాం చైతన్య,స్తబక మకరంద శ్రుతిఝరీ 
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి

నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నవ్వుతుంటే యవ్వనం 
ఒక దేవతోత్సవ తోరణం
నదికి అందం పూవనం
అలల గీతం చామరం

చరణం::1

జలకమాడే కురులలో 
తన తనువు నిలిపే దేవతా 
అలల మెరిసే మేనిలో 
ఇవి బ్రహ్మ దేవుని సొగసులో 
యవ్వనాలే పువ్వులై 
ఎద హత్తుకోనీ ప్రేమలై
యదను కురిసే..ఏ..హా..అ..ఆఅ
యదను కురిసే వెన్నెలా
నువ్వు నిలిచిపోవే కన్నులా..ఊహలై..ఈ

నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నవ్వుతుంటే యవ్వనం 
ఒక దేవతోత్సవ తోరణం
నదికి అందం పూవనం
అలల గీతం చామరం

చరణం::2

సరిర్నిసా పమరిగా
సరిర్నిసా పమరిగా
దదపమ మదనిస నిదపమ మదనిస 
సాస సాస ససరిరినినిసస
దాద దాద దదనినిపపదద
రిమాగ నిదప దనిద నిసనిద
పమాగ దసమ నిదప సనిదప
సస రిరి గగ మమ ప 
సస నిని దద పప మ
నిరిగమప

సలలిత స్వరభోగమే 
ఎద పలకరించే పుణ్యమే 
ఉదయ గానం ప్రాణమై 
నా హృదయ కమలం విరియునే 
ఎగసె మది సంగీతమే 
ఎదుట పడితే స్నేహమే 
విరహమిటుపై సాగదే 
ఇది వెండి వెన్నెల పరువమే
అధరసుధలే మధురమే 
జతకలిసి పదమై పూవులే..పూవులే..ఏఏ 

నదికి అందం పూవనం
అలల గీతం చామరం
నవ్వుతుంటే యవ్వనం 
ఒక దేవతోత్సవ తోరణం
మ్మ్..మ్మ్మ్..మ్మ్మ్..మ్మ్మ్

Thursday, May 03, 2012

రాగమాలిక--1982


సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ

చరణం::1

నీవే నాకు రాగం సాగనీవే హృదయ తాళం
గీతం నీకు హారం దేవి పాదం నాకు తీరం
దేవీ పూజ వేళ రాగమేలే పూల హారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ ఛైత్రమాసం
రేగే అగ్నిగుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం

చరణం::2

నాదే సూర్య నేత్రం ఇంక నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం తీరకుంది తీపి మోహం
వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడి పాడే నాట్య వేదం
నీకే అంకితం..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
దం ద నందం దం ద నందం
దం ద నందం దం ద నం దం దం ద
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం