Thursday, May 03, 2012

రాగమాలిక--1982


సంగీతం::ఇళయరాజా
రచన::వేటూరి
గానం::S.P.బాలు

పల్లవి::

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ

చరణం::1

నీవే నాకు రాగం సాగనీవే హృదయ తాళం
గీతం నీకు హారం దేవి పాదం నాకు తీరం
దేవీ పూజ వేళ రాగమేలే పూల హారం
నాదం నాకు ప్రాణం చెరగరాదీ ఛైత్రమాసం
రేగే అగ్నిగుండం నన్ను తాకి పొందు శాంతం
నేనే నాదం..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం

చరణం::2

నాదే సూర్య నేత్రం ఇంక నీదే చంద్రహాసం
నువ్వే చూడకుంటే నాకు లేదే సుప్రభాతం
రాగం వింత దాహం తీరకుంది తీపి మోహం
వీచే గాలిలోనే దాచుకున్నా నాదు గానం
లోకాలేడు నాలో ఆడి పాడే నాట్య వేదం
నీకే అంకితం..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
తనం ద నందం దం ద నందం దం ద
నందం దం ద నందం
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
పువ్వుగా ప్రాణాలు పోనీ తావిగా నన్నుండిపోనీ
దం ద నందం దం ద నందం
దం ద నందం దం ద నం దం దం ద
పువ్వై పుట్టి పూజే చేసి పోనీ రాలిపోనీ
నందం దం ద నందం దం ద
నందం దం ద నందం

No comments: