Showing posts with label నిరీక్షణ--1981. Show all posts
Showing posts with label నిరీక్షణ--1981. Show all posts

Wednesday, August 13, 2014

నిరీక్షణ--1981




సంగీతం::ఇళయరాజా
దర్శకుడు::బాలూ మహేంద్ర
రచన::ఆత్రేయ
గానం::S.జానకి
తారాగణం:: భాను చందర్, అర్చన 

పల్లవి::

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందదీ
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందదీ

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ 
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ 

చరణం::1

లలలలాలలా..ఆఆఆలలలాల్లాఅలాల 

ఏ పువ్వూ ఏ తేటిదన్నది..ఏనాడో రాసున్నదీ
ఏ ముద్దూ ఏ మోవిదన్నది .. ఏ పొద్దో రాసున్నదీ
బంధాలై పెనవేయు వయసుకు .. అందాలే దాసోహమనగా
మందారం విరబూయు పెదవులు..మధువులనే చవిచూడమనగా

పరువాలే..ప్రణయాలై
స్వప్నాలే..స్వర్గాలై
ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళి అలదెను

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందదీ
ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ

చరణం::2

ఏ మేఘం ఏ వాన చినుకై..చిగురాకై మొలకెత్తెనో
ఏ రాగం ఏ గుండె లోతున..ఏ గీతం పలికించునో
హృదయాలే తెరతీసి తనువుల కలబోసీ మరపించమనగా
కౌగిలిలో చెరవేసు మదనుని..కరిగించీ గెలిపించమనగా

మోహాలే..దాహాలై..సరసాలే..సరదాలై
కాలాన్నే నిలవేసి కలలకు ఇవ్వాలీ వెలలేని విలువలు

ఆకాశం ఏనాటిదో..అనురాగం ఆనాటిదీ
ఆవేశం ఏనాడు కలిగెనో..ఆనాడే తెలిసిందదీ
లలలలలలలాలలలాలాలలాల

Thursday, February 14, 2013

నిరీక్షణ--1981




సంగీతం::ఇళయరాజా
రచన::ఆచార్య ఆత్రేయ
గానం::K.J.యేసుదాస్

పల్లవి::

సుక్కల్లే తోచావే...
ఎన్నెల్లే కాచావే..ఏడ బోయావే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే
సుక్కల్లే తోచావే..
ఎన్నెల్లే కాచావే..ఏడ బోయావే

చరణం::1

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో
దాగిందే నా పేద గుండె నీ తాపం లో
ఊగానే నీ పాటలో ఉయ్యాలై
ఉన్నానే ఈ నాటికీ నేస్తాన్నై
ఉన్నా ఉన్నాదొక దూరం
ఎన్నాళ్ళకు చేరం..తీరందీ నేరం 
సుక్కలే తోచావే..ఎన్నెల్లే కాచావే..ఏడ బోయావే

చరణం::2

తానాలే చేసాను నీ స్నేహంలో
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే
ఈనాటీ నా కళ్ళలొ కన్నీళ్ళే
ఉందా కన్నీళ్ళకు అర్ధం..ఇన్నేళ్ళకు వ్యర్ధం..చట్టందే రాజ్యం 

సుక్కల్లే తోచావే..
ఎన్నెల్లే కాచావే..ఏడ బోయావే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే
ఇన్ని వేల సుక్కల్లో నిన్ను నే వెతికానే..

సుక్కల్లే తోచావే..
ఎన్నెల్లే కాచావే..ఏడ బోయావే

సుక్కల్లే తోచావే..ఎన్నెల్లే కాచావే..ఏడ బోయావే