Saturday, February 05, 2011

భార్య--1968



సంగీతం::మాస్టర్ వేణు
రచన::మల్లెమాల
గానం::ఘంటసాల,P.సుశీల
దర్శకుడు::K.S.ప్రకాశరావు
తారాగణం::శోభనుబాబు, వాణిశ్రీ, కృష్ణకుమారి, నాగభూషణం, నాగయ్య, శాంతకుమారి, విజయలలిత, జ్యోతిలక్ష్మి

పల్లవి::

చీటికి మాటికి చిటపట లాడిన..చిన్నది ఇపుడేమన్నదీ                                                          విరసంలోనే సరసమున్నదీ వెర్రి నాయనా అన్నదీ 

చీటికి మాటికి చిటపట లాడిన..చిన్నది ఇపుడేమన్నదీ
విరసంలోనే సరసమున్నదీ వెర్రి నాయనా అన్నదీ

చరణం::1

ముచ్చటలాడితె రెచ్చిపోయిన..చిచ్చుబుడ్డి ఏమన్నది
ముచ్చటలాడితే రెచ్చిపోయిన..చిచ్చుబుడ్డి ఏమన్నది
కల్లాకపటం తెలియని తనతో..గిల్లికజ్జ తగదన్నదీ..ఈఈఈ

చరణం::2

నిక్కుతు నీల్గుతు నింగికెగిరిన..చక్కని చుక్కేమన్నదీ
నిక్కుతు నీల్గుతు నింగికెగిరిన..చక్కని చుక్కేమన్నదీ 
చిటారు కొమ్మన మిఠాయి కొరకే..
చిటారు కొమ్మన మిఠాయి కొరకె..చెట్టాక్కానని అన్నదీ

చీటికి మాటికి చిటపట లాడిన..చిన్నది ఇపుడేమన్నదీ                                                          విరసంలోనే సరసమున్నదీ వెర్రి నాయనా అన్నదీ

చరణం::3

కసరి కొట్టుచూ రుసరుసలాడిన.. కన్నెపిల్ల ఏమన్నదీ
కసరి కొట్టుచూ రుసరుసలాడిన..కన్నెపిల్ల ఏమన్నదీ
విసిరిన బాణం తగిలిందీ..నీ పస తెలిసిందని అన్నది

అందమైన మన జంటను చూసీ..బృందావనమేమన్నదీ
ముందున్నదిలే ముసళ్ళ పండగ..తొందరపడవద్దన్నదీ 
ఆ హా హా హా..ఆహా ఆహా ఆహా ఆహా
ఓ హో హో హో..ఓహో ఓహో ఓహో ఓహో  
  
  

No comments: