Thursday, February 03, 2011

ఇంటి కోడలు--1974



సంగీతం::చక్రవర్తి
రచన::D.C.నారాయణరెడ్డి
గానం::S.P.బాలు 
Film Directed By::Lakshmii Deepak
తారాగణం::S.V.రంగారావు,కృష్ణంరాజు,గుమ్మడి,చంద్రమోహన్,మిక్కిలినేని,రావికొందలరావు,సాక్షిరంగారావు,మాడా,K.K.శర్మ,రమణారెడ్డి(అతిధి),ప్రమీల,S.వరలక్ష్మి,P.R.వరలక్ష్మీ,రోజారమణి,శ్రీరంజని,మాలతి,సూర్యకళ,సుశీల,సుధామాల,

పల్లవి::

స్నానాలగదిలోన..సనసన్నని జలపాతం
ఆ..జలపాతం జల్లులలో..తడిసే ఓ పారిజాతం 

ఊరికే చల్లారునా..ఆ
ఊరికే చల్లారున..ఒంటిలోన లేచే ఆవిరి
జంటకోసం వేచే ఆ వేడి..హ్హా..ఊరికే చల్లారునా                     

చరణం::1

మండే నేలను..రాలే చినుకులు
మరింత సెగలను..రేపుతాయి
మండే నేలను..రాలే చినుకులు
మరింత సెగలను..రేపుతాయి
రగిలే తనువున..కురిసే జల్లులు
పొగలై నీలోనే...మూగుతాయి
తడిసిన చీర...మేని కంటుకొని 
తడిసిన చీర...మేని కంటుకొని 
తగని మారాము...చేస్తుంది 
నా దగ్గరికే నిను...లాగేస్తుంది    
ఆ ఆ ఆ ఆ ఆ..ఊరికే చల్లారునా 
ఊరికే చల్లారునా..ఒంటిలోన లేచే ఆవిరి
జంటకోసం వేచే ఆ వేడి..హే..ఏ..ఊరికే చల్లారునా                    
  
చరణం::2

లలా..రారారారా..ఊ.ఊఉఊ           
పెదవుల దాహం..తీరాలంటే
పెదవుల తేనెలే...కావాలి 
పెదవుల దాహం..తీరాలంటే
పెదవుల తేనెలే...కావాలి 
కాగే దేహం...ఆరాలంటే
కౌగిలి కుంపటే...కావాలి 
ఓపలేని ఒంటరి...తనమే 
ఓపలేని ఒంటరి...తనమే  
నీపై కన్నెఱ్ఱ...చేస్తుంది
అది నిలువున నిను కాల్చేస్తుంది       
ఆ ఆ ఆ ఆ ఆ..ఊరికే చల్లారునా 
ఊరికే చల్లారునా ఒంటిలోన లేచే ఆవిరి

No comments: