Saturday, November 21, 2015

కాంచన గంగ-1984



సంగీతం::చక్రవర్తి
రచన::వీటూరిసుందరరామ్మూర్తి 
గానం::S.P.బాలు
Film Directed By::V.Madhusoodhana Rao
తారాగణం::చంద్రమోహన్,శరత్ బాబు,సరిత,స్వప్న,ప్రతాప్ పోతన్,జె.వి.రమణమూర్తి,సుత్తి వీరభద్రరావు,
సుత్తి వేలు,రావి కొండలరావు,అన్నపూర్ణ.

పల్లవి::

బృందావని ఉంది..యమునా నది ఉంది
మధురాపురి ఉంది..కాళింది ఉంది 
లేని వాడొక్కడే..శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన..కళ్యాణ మూర్తి 

చరణం::1

పుట్టగానే పెరిగేటి..మాయబంధనాలకన్నా 
పుడుతూనే తొలిగేటి..చెరసాలలే మిన్న 
ఆ కిటుకు తెలిసేరా 
ఆ కిటుకు తెలిసేరా..శ్రీకృష్ణమూర్తి
చెరసాలలో పుట్టె..చైతన్యమూర్తి

చరణం::2

వెంటపడి వేధించే..వేలమంది స్త్రీలున్నా 
ఇంటనుండి పూజించే..ఇంతి ఉంటె చాలన్నా 
ఆ కిటుకు తెలిసేరా 
ఆ కిటుకు తెలిసేరా..శ్రీకృష్ణమూర్తి
రాధ గుండె దోచినాడు..వేదాంతమూర్తి

Kanchana Ganga--1984
Music::Chakravarti
Lyrics::Veetoorisundararaammoorti 
Singer's::S.P.Baalu
Film Directed By::V.Madhusoodhana Rao
Cast::ChandramOhan,Sarita,Swapna,SaratBabu,Prataap Potan,J.V.Ramanamoorti,Sutti Veerabhadra Rao,Sutti Velu,Ravi Kondal Rao,Annapoorna.

::::::::::::::::::::::::::::::::::::::::

bRundaavani undi..yamunaa nadi undi
madhuraapuri undi..kaaLindi undi 
lEni vaaDokkaDE..SreekRshNamoorti
kalilOna Silayaina..kaLyaaNa moorti 

::::1

puTTagaanE perigETi..maayabandhanaalakannaa 
puDutoonE toligETi..cherasaalalE minna 
aa kiTuku telisEraa 
aa kiTuku telisEraa..SreekRshNamoorti
cherasaalalO puTTe..chaitanyamoorti

::::2

venTapaDi vEdhinchE..vElamandi streelunnaa 
inTanunDi poojinchE..inti unTe chaalannaa 
A kiTuku telisEraa 
A kiTuku telisEraa..SreekRshNamoorti
raadha gunDe dOchinaaDu..vEdaantamoorti

No comments: