సంగీతం::చక్రవర్తి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::P.సుశీల,S.P.బాలు
Film Directed By::K.Raghavendra Rao
రాతాగణం::కృష్ణ, జయప్రద,రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య,కాంతారావు,నిర్మల.
పల్లవి::
అందాల జవ్వని..మందార పువ్వని
అందాల జవ్వని..మందార పువ్వని
నేనంటె నువ్వని..నువ్వంటే నవ్వని
కలిసిందిలే...కన్ను...కలిసిందిలే
తెలిసిందిలే మనసు..తెలిసిందిలే
అందాల గువ్వని..రాగాల రవ్వని
అందాల గువ్వని..రాగాల రవ్వని
నేనంటే నువ్వని..నువ్వంటే నవ్వని
కలిసిందిలే..కన్ను..కలిసిందిలే
తెలిసిందిలే మనసు..తెలిసిందిలే
చరణం::1
గోదారి నవ్వింది..పూదారి నవ్వింది
ఆ నవ్వు ఈ నవ్వు..అందాలు రువ్వింది..ఈ
చిలకమ్మ నవ్వింది..గొరవంక నవ్వింది
ఆ నవ్వు ఈ నవ్వు..నెలవంకలయ్యింది..ఈ
వెలుగుల్లో నీ రూపు..వెన్నెళ్లు కాచే వేళ
జిలుగైన సొగసంతా..సిరిపైటలేసే వేళ
చినుకంటి నీ కన్ను..చిటికేసి పోయే వేళ
తెలుగుల్లో నా వలపు..తొలి పాట పాడింది
అందాల గువ్వని...రాగాల రవ్వని
అందాల జవ్వని..మందార పువ్వని
నేనంటే నువ్వని..నువ్వంటే నవ్వని
కలిసిందిలే..కన్ను..కలిసిందిలే
తెలిసిందిలే మనసు..తెలిసిందిలే
చరణం::2
వయసొచ్చి నవ్వింది..మనసిచ్చి నవ్వింది
వలపల్లే వాలాడు..పొద్దుల్లో నవ్వింది..ఈ
పూరెమ్మ నవ్వింది..పులకింతా నవ్వింది
నూగారు బుగ్గల్లో..ముగ్గల్లే నవ్వింది..ఈ
నీరాటి రేవుల్లో..నీడల్లు ఆడే వేళ
నాలాటి ఊహల్లే..మాటొచ్చి పాడె వేళ
బంగారు మలి సంధ్య రాగాలు తీసే వేళ
మబ్బుల్లో ఓ మెరుపు నను చూసి నవ్వింది
అందాల జవ్వని..మందార పువ్వని
అందాల గువ్వని...రాగాల రవ్వని
నేనంటే నువ్వని..నువ్వంటే నవ్వని
కలిసిందిలే..కన్ను..కలిసిందిలే
తెలిసిందిలే మనసు..తెలిసిందిలే
ఆ..అహాహా..ఆ..ఆ..అహాహా..ఆ..ఆ..ఆ..ఆ
Uriki Monagaadu--1981
Music::Chakravarti
Lyrics::VeturiSundaraRamaMoorti
Singer::P.Suseela,S.P.Baalu
Film Directed By::K.Raghavendra Rao
Cast::Krishna,Jayaprada,RaogopalRao,Alluramalingayya,KantaRao,Nirmala.
:::::::::::::
andaala javvani..mandaara puvvani
andaala javvani..mandaara puvvani
nEnanTE nuvvani..nuvvanTE navvani
kalisindilE...kannu...kalisindilE
telisindilE..manasu..telisindilE
andaala guvvani..raagaala ravvani
andaala guvvani..raagaala ravvani
nEnanTE nuvvani..nuvvanTE navvani
kalisindilE..kannu..kalisindilE
telisindilE manasu..telisindilE
::::1
gOdaari navvindi..poodaari navvindi
aa navvu ee navvu..andaalu ruvvindi..ii
chilakamma navvindi..goravanka navvindi
aa navvu ee navvu..nelavankalayyindi..ii
velugullO nee roopu..venneLlu kaachE vELa
jilugaina sogasantaa..siripaiTalEsE vELa
chinukanTi nee kannu..chiTikEsi pOyE vELa
telugullO naa valapu..toli paaTa paaDindi
andaala guvvani...raagaala ravvani
andaala javvani..mandaara puvvani
nEnanTE nuvvani..nuvvanTE navvani
kalisindilE..kannu..kalisindilE
telisindilE manasu..telisindilE
::::2
vayasochchi navvindi..manasichchi navvindi
valapallE vaalaaDu..poddullO navvindi..ii
pooremma navvindi..pulakintaa navvindi
noogaaru buggallO..muggallE navvindi..ii
neeraaTi rEvullO..neeDallu aaDE vELa
naalaaTi oohallE..maaTochchi paaDE vELa
bangaaru mali sandhya raagaalu teesE vELa
mabbullO O merupu nanu choosi navvindi
andaala javvani..mandaara puvvani
andaala guvvani...raagaala ravvani
nEnanTE nuvvani..nuvvanTE navvani
kalisindilE..kannu..kalisindilE
telisindilE manasu..telisindilE
aa..ahaahaa..aa..aa..ahaahaa..aa..aa..aa..aa
No comments:
Post a Comment