Friday, May 29, 2015

అగ్ని సమాధి--1983



సంగీతం::చెళ్ళపిళ్ళ సత్యం 
రచన::ఆచార్య-ఆత్రేయ
గానం::S.P.బాలు,S.జానకి
Film Directed By::K.S.R.Das
తారాగణం::నరేష్,పూర్ణిమ

పల్లవి:

ప్రియతమా..నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే నాకు దీపం
నీవే లేని నాడు నేనే శూన్యము
నీతో ఉన్న నేడు బ్రతుకే స్వర్గము
ప్రియతమా..నీ ఊపిరే నాకు ప్రాణం

చరణం::1

తోడు నీడై..అడుగుల జాడై..నడిచే నడకలు నీవే
తేనియ వలపై..తీయని పిలుపై.. పలికే పలుకులు నీవే
ఈ అనురాగమే జీవితమూ..ఈ అనుబంధమే శాశ్వతమూ
నాలో నీవై..నీలో నేనై..ఒకటై పోదాం నేడే 
ప్రియతమా..నీ ఊపిరే నాకు ప్రాణం

చరణం::2

ఎన్ని తరాల..ఎన్ని యుగాల..మారని మనసు నీవు
ఎన్నడు లేని..ఎవరికి లేని..మాయని మమతవు నీవు
ఎదలో ఉన్నది ఆలయము..అది నా దేవత మందిరము
మన ఈ జంటే..గుడి జేగంటై..మోగాలి కలకాలం

ప్రియతమా..నీ ఊపిరే నాకు ప్రాణం
నీ చూపులే..నాకు దీపం
నీవే లేని నాడు..నేనే శూన్యము
నీతో ఉన్న నేడు..బ్రతుకే స్వర్గము
ప్రియతమా..నీ ఊపిరే నాకు ప్రాణం

Agni Samadhi--1983
Music::Challapalla Satyam
Lyrics::Achaarya-Ateya
Singer's::S.P.Baalu,S.Janaki
Film Directed By::K.S.R.Das
Cast::Naresh,Poornima.

:::::::::::::::::::::::::::::::

priyatamaa..nee oopirE naaku praaNam
nee choopulE naaku deepam
neevE lEni naaDu nEnE Soonyamu
neetO unna nEDu bratukE swargamu
priyatamaa..nee oopirE naaku praaNam

::::1

tODu neeDai..aDugula jaaDai..naDichE naDakalu neevE
tEniya valapai..teeyani pilupai.. palikE palukulu neevE
ii anuraagamE jeevitamuu..ii anubandhamE SaaSwatamuu
naalO neevai..neelO nEnai..okaTai pOdaam nEDE 
priyatamaa..nee oopirE naaku praaNam

::::2

enni taraala..enni yugaala..maarani manasu neevu
ennaDu lEni..evariki lEni..maayani mamatavu neevu
edalO unnadi aalayamu..adi naa dEvata mandiramu
mana ii janTE..guDi jEganTai..mOgaali kalakaalam

priyatamaa..nee oopirE naaku praaNam
nee choopulE..naaku deepam
neevE lEni naaDu..nEnE Soonyamu
neetO unna nEDu..bratukE swargamu
priyatamaa..nee oopirE naaku praaNam

No comments: