సంగీతం::M.M.కీరవాణి
రచన::వేటూరిసుందరరామమూర్తి
గానం::S.P.బాలు,K.S.చిత్ర,కోరస్
సినిమా దర్శకత్వం::K.రాఘవేంద్రరావు
తారాగణం::రాజశేఖర్,రమ్యకృష్ణ,మధుబాల,రావుగోపాల్‌రావు,బ్రహ్మనందం.
పల్లవి::
కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై
తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చరణం::1
చిలిపిగ నీ చేతులు అణువణువు
తడుముతుంటే మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా పదాలతోనే వరించనా
సరాగ మాలై తరించనా స్వరాలతోనే స్పృశించనా
సుఖాల వీణ శృతించనా ఆ వెన్నెల నీ కన్నుల
రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
చరణం::2
తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ
తెల్లారనీకే వొయ్యారమా
అల్లాడిపోయే యీ రేయిని
సవాలు చేసే శృంగారమా
సంధించమాకే వో హాయిని
ఆ మల్లెల కేరింతలు
నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో వొదిగిన క్షణమే
చెప్పకనే చెబుతున్నవి యిదే యిదే ప్రేమని
Allari Priyudu--1993
Music::MM.Keeravaani
Lyrics::Veturi SundaraRaammoorti
Singer's::S.P.Baalu,K.S.Chitra
Film Directed By::K.Raghavendra Rao
Film Produced By::K.Raghavendra Rao
Cast::Rajashekhar,Ramyakrishna,Madhubala,RaogopalRao,Brahmanandam.
::::::::
kanulu vippi kaluva mogga jaabillini choochenu
tamakamtO paalabugga tolimuddunu kOrenu
taDiyaarani pedavulapai
toNikina vennela merupulu
cheppakanE chebutunnavi idE idE prEmani
::::1
chilipiga nee chEtulu aNuvaNuvu
taDumutunTE mOhapu teralika toligEnaa
chali chali chiru gaalulu giliginta rEputunTE
aaSala allari aNigEnaa padaalatOnE varinchanaa
saraaga maalai tarinchanaa swaraalatOnE spRSinchanaa
sukhaala veeNa SRtinchanaa aa vennela nee kannula
rEpekkina aa kOrika
pogalai segalai yedalO ragilina kshaNamE
cheppakanE chebutunnavi idE idE prEEmani
::::2
tanuvunu penavEsina nee cheerakenta garvam
yavvana girulanu taDimenanaa
nee kaugiTa naliginandukE anta garvam
madanuDi malupulu telisenanee
tellaaraneekE voyyaaramaa
allaaDipOyE ii rEyini
savaalu chEsE SRngaaramaa
sandhinchamaakE vO haayini
aa mallela kErintalu
nee navvula laalintalu
valalai alalai voDilO vodigina kshaNamE
cheppakanE chebutunnavi idE idE prEmani
No comments:
Post a Comment